Kajal Agarwal: `ప్రెగ్నెన్సీ` పై ఫస్ట్ టైమ్‌ స్పందించిన కాజల్‌.. మాతృత్వం గురించి ఇంట్రెస్టింగ్‌ కామెంట్‌..

Published : Nov 09, 2021, 04:15 PM IST

స్టార్‌ హీరోయిన్‌ కాజల్‌ అగర్వాల్‌(Kajal Agarwal) మ్యారేజ్‌ చేసుకుని విజయవంతంగా ఏడాది పూర్తి చేసుకుంది. అదే సమయంలో ఆమెకి సంబంధించిన ప్రెగ్నెన్సీ వార్తలు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా కాజల్‌ స్పందించింది.   

PREV
17
Kajal Agarwal: `ప్రెగ్నెన్సీ` పై  ఫస్ట్ టైమ్‌ స్పందించిన కాజల్‌.. మాతృత్వం గురించి ఇంట్రెస్టింగ్‌ కామెంట్‌..

కాజల్‌(Kajal Agarwal) తెలుగులో స్టార్‌ హీరోయిన్‌గా రాణిస్తుంది. మంచి క్రేజ్‌ ఉన్స సమయంలోనే ఊహించని విధంగా తన మ్యారేజ్‌ డేట్‌ని, ప్రియుడు గౌతమ్‌ కిచ్లుని అనౌన్స్ చేసింది. అంతే వేగంగా మ్యారేజ్‌ చేసుకుని సెటిల్‌ అయ్యింది. మ్యారేజ్‌ తర్వాత కూడా సినిమాలు చేస్తూనే ఉంది. మరోవైపు భర్త గౌతమ్‌ కిచ్లు(Gautam Kitchlu)తో కలిసి వైవాహిక జీవితాన్ని ఎంజాయ్‌ చేస్తుంది Kajal Agarwal. అదే సమయంలో కొత్త బిజినెస్‌లు ప్రారంభించింది. భర్త వ్యాపారాలను ప్రమోట్‌ చేస్తూనే, ఇద్దరు కలిసి కొత్తగా సోఫా దిండ్ల బిజినెస్‌ని స్టార్ట్ చేశారు. వీటన్నింటిని సక్సెస్‌ఫుల్‌గా రన్‌ చేస్తున్నారు. 

27

ఇదిలా ఉంటే ఇటీవల అక్టోబర్‌ 30న తమ ఫస్ట్ మ్యారేజ్‌ యానివర్సరీ జరుపుకుంది కాజల్‌. పెళ్లై ఏడాది గడిచిన సందర్భంగా ఎన్నో జ్ఙాపకాలను నెమరేసుకుంది. భర్తతో కలిసి దిగిన ఇంటెన్స్ ఫోటోలను పంచుకుంది. తన మ్యారేజ్‌ జీవితానికి సంబంధించిన సంతోషాన్ని పంచుకుంది కాజల్‌. ఆయా పిక్స్ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. 

 

37
kajal agarwal

ఇదిలా ఉంటే గత కొన్ని రోజులుగా కాజల్‌ ప్రెగ్నెన్సీ(Kajal Pregnancy) రూమర్స్ సోషల్‌ మీడియాలో ఊపందుకున్నాయి. కాజల్‌, గౌతమ్‌ కిచ్లు కలిసి పిల్లలకు ప్లాన్‌ చేస్తున్నారని, ప్రస్తుతం కాజల్‌ ప్రెగ్నెంట్‌గా ఉందనే వార్త చాలా రోజులుగా చక్కర్లు కొడుతుంది. అంతేకాదు ఆమె కమిట్‌ అయిన సినిమాల నుంచి తప్పుకుందనే న్యూస్‌ కూడా వినిపించింది. తెలుగులో నాగార్జునతో కలిసి కాజల్‌ `ఘోస్ట్` చిత్రంలో నటిస్తుంది. ఇందులోనుంచి తప్పుకుందని, ఆమె స్థానంలో ఇలియానాని అడుగుతున్నారనే టాక్‌ వచ్చింది. 

47

అయితే ఇప్పటి వరకు ఇవన్నీ రూమర్స్ గానే మిగిలాయి. మ్యారేజ్‌ యానివర్సరీ సందర్భంగా కూడా కాజల్‌ తన ప్రెగ్నెంట్‌ గురించి స్పందించలేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె స్పందించింది. ప్రెగ్నెన్సీ రూమర్స్ పై కాజల్‌ చెబుతూ, సరైన సమయంలో దాని గురించి మాట్లాడతా అని చెప్పింది. ప్రెగ్నెన్సీ రూమర్స్ పై నెలకొన్న సస్పెన్స్ కి ఫుల్‌స్టాప్‌ పెట్టలేదు కదా, దాన్ని మరింతగా పెంచింది. గర్భం దాల్చకపోయి ఉంటే అలాంటిదేమీ లేదు, ఇంకా ప్లాన్‌ చేయలేదు అనే సమాధానం చెప్పేది. కానీ అలా స్పందించలేదు. సరైన సమయంలో స్పందిస్తానని చెప్పడం ఇప్పుడు ప్రెగ్నెన్సీ వార్తలకు మరింత ఊతమిచ్చినట్టయ్యింది. 

57

అయితే ఈ సందర్భంగా తన చెల్లి నిషా అగర్వాల్‌ పిల్లల గురించి స్పందిస్తూ తన చెల్లి పిల్లలతో మాతృత్వాన్ని పొందుతున్నప్పుడు తనకు కూడా ఆ మాతృత్వాన్ని ఆలింగనం చేసుకోవాలనే ఫీలింగ్‌ కలుగుతుందని చెప్పింది. ఆ ప్రక్రియ తనని బాగా ఉత్తేజపరుస్తుందని, కానీ అదే సమయంలో భయపెడుతుందని చెప్పింది కాజల్‌. నిషా జీవితం ఇప్పుడు ఆమె ఎంత సంపూర్ణంగా ఉందో తాను చూశానని, మాతృత్వం ఒక అద్భుతమైన అనుభూతి అని చెప్పింది కాజల్‌. 

67
kajal aggarwal

ఇంకా చెబుతూ, మాతృత్వం సెల్ఫీ రియలైజేషన్‌ అని, ఆ విషయం తన చెల్లి పిల్లలను చూసినప్పుడు కలుగుతుందని, ఆ పిల్లలు జీవితంలోకి వచ్చినప్పటి నుంచి తాను కూడా ఓ తల్లిలాగే భావిస్తుందట. ప్రస్తుతం తాము తన పెంపుడు కుక్క మియాకి తల్లిదండ్రులుగానే భావిస్తున్నామని చెప్పింది కాజల్‌. `పిల్లలు నా జీవితంలోకి ప్రవేశించే ముందు నేను ఎప్పుడూ కనుగొనని నా హృదయంలో ఈ సరికొత్త భాగం ఉందని భావిస్తా. నాకు సొంత బిడ్డ ఉన్నప్పుడు ఆ భావోద్వేగాన్ని మరింత పెంచుతుందని కచ్చితంగా అనుకుంటున్నా` అని తెలిపింది కాజల్‌. 

 

77

కాజల్‌ చివరగా `మోసగాళ్లు` చిత్రంలో నటించింది. ప్రస్తుతం తెలుగులో చిరంజీవి సరసన `ఆచార్య` చిత్రంలో నటించింది. మరోవైపు నాగార్జునతో `ఘోస్ట్` సినిమా చేస్తుంది. తమిళంలో రెండు సినిమాలు పూర్తి చేసుకుంది. హిందీలో ఓ సినిమా చేస్తుంది. కొత్త సినిమాలపై సస్పెన్స్ నెలకొంది. 

also read: Kajal aggarwal: పబ్లిక్ గా ఆయనతో పెగ్గేస్తూ పేకాడుతున్న చందమామ... డబ్బుల కోసం ఏమైనా చేస్తావా కాజల్!?

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories