భర్త గౌతమ్‌తో కలిసి కాజల్‌ హోలీ వేడుకలు..

First Published Mar 29, 2021, 1:48 PM IST

కాజల్‌ అగర్వాల్‌ తన భర్తతో కలిసి హోలీ సెలబ్రేట్‌ చేసుకుంది. పెళ్లైన తర్వాత మొదటి సారి వీరిద్దరు హోలీ వేడుకలో పాల్గొన్నారు. ఒకరినొకరు రంగులు పూసుకుని ఎంజాయ్‌ చేశారు. సరదాగా గడిపారు. ఈ సందర్భంగా ఫోటోలను పంచుకుంటూ అభిమానులకు విషెస్‌ తెలియజేశారు. 

కాజల్‌ హోలీ పండుగని చాలా పద్ధతిగా చేసుకున్నారు. తన భర్తకి కొద్దికొద్దిగా రంగులు పూసి హుందాతనాన్ని చాటుకుంది.
undefined
అదే సమయంలో గౌతమ్‌ కిచ్లు కూడా తన భార్య కాజల్‌కి రంగులద్ది విషెస్‌ తెలిపారు. ఈ సందర్భంగా వీరి హోలీ వేడుకకి సంబంధించిన ఫోటోలని పంచుకున్నారు.
undefined
ప్రస్తుతం ఆయా ఫోటోలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అయితే వీరిద్దరు చాలా కొద్ది రంగులనే పూసుకోవడం కలర్‌ఫుల్‌గా పూర్తి రంగులతో నిండిలేకపోవడంతో అభిమానులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
undefined
హోలీ అంటే రంగుల పండుగ, ఆ రంగులన్నీ కనిపిస్తేనే, ఆ రంగులన్నీ పూసుకుంటేనే దానికి అందం. కానీ వీరి విషయంలో అది మిస్‌ అవుతుంది.
undefined
ఏదేమైనప్పటికీ ఈ ఇద్దరు కొత్త జోడీ అభిమానులకు హోలీ విషెస్‌ చెప్పారు.
undefined
కాజల్‌ స్పందిస్తూ, ఈ హోలీ పండుగ మీకు, మీ ఫ్యామిలీకి మంచి ఆరోగ్యాన్ని, సంతోషాన్ని, ప్రేమని, పాజిటివిటీని పంచాలని కోరుకుంటున్నా` అని తెలిపింది.
undefined
గౌతమ్‌ కిచ్లు స్పందిస్తూ మా నుంచి మీకు హోలీ పండుగ శుభాకాంక్షలు అని చెప్పారు. ఈ సందర్భంగా సేఫ్‌గా ఉండాలని, ఇంట్లోనే ఉండాలని చెప్పారు.
undefined
మరోవైపు కాజల్‌ ఇటీవల పంచుకున్న హాట్‌ ఫోటోలు తెగ ఆకట్టుకుంటున్నాయి. ఓ బ్యాగ్‌ ప్రమోషన్‌లోనూ కాజల్‌ హోయలు పోయి మెస్మరైజ్‌ చేస్తుంది.
undefined
కాజల్‌ ప్రస్తుతం `ఆచార్య`, నాగార్జున సినిమాలో నటిస్తుంది. తమిళంలో `హే సినామిక` చిత్రం చేస్తుంది.
undefined
click me!