స్టార్ హీరోయిన్ గా టాలీవుడ్ ను ఒక ఊపు ఊపిన కాజల్ తెలుగు, తమిళ భాషల్లో తన సత్తా చాటింది. దాదాపు అందరు స్టార్ హీరోలకు జోడీగా నటించింది. టాలీవుడ్ లో మెగాస్టార్, కోలీవుడ్ లో కమల్ హాసన్ లాంటి సీనియర్లతో కూడా ఆడిపాడింది కాజల్.
27
2020 అక్టోబర్ లో కాజల్ అగర్వాల్ తన స్నేహితుడు గౌతమ్ కిచ్లుని పెళ్లి చేసుకుంది. పెళ్లి తరువాత తన చేతిలో ఉన్న కొన్ని సినిమాలు కంప్లీట్ చేసిన కాజల్.. ఆతరువాత భర్తతో వెకేషన్స్ కు వెళ్తు.. కొత్త ఇల్లు చూసుకుని మ్యారేజ్ లైఫ్ ను ఫుల్ గా ఎంజాయ్ చేస్తుంది.
37
ప్రస్తుతం గర్భవతి కావడంతో కొన్ని సినిమాల నుంచి తప్పుకుంది కాజల్ అగర్వాల్. కాజల్, గౌతమ్ కిచ్లు దంపతులు ఫస్ట్ బేబీకి త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నారు. కాజల్ కూడా టెంపరరీగా సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టి ఇంట్లోనే ఉంటూ ఆరోగ్యం విషయంలో జాగ్రతల్లు తీసుకుంటుంది.
47
కాజల్ తన ప్రెగ్నెస్సీకి సంబంధించిన గుర్తులను ఫోటోల రూపంలో పదిలం చేసుకుంటుంది. బేబీ బంప్ ఫోటో షూట్స్ తో తీపిగురుతులను దాచుకుంటుంది. ఈ ఫిక్స్ ను సోషల్ మీడియాలో శేర్ చేసుకుంటూ అభిమానులకు ఎప్పటికప్పుడు అప్ డేట్ ఇస్తోంది.
57
రీసెంట్ గా కాజల్ పోస్ట్ చేసిన ఫిక్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. కాజల్ బేబీ బంప్ తో పాటు భర్త గౌతమ్ కిచ్లుతో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చింది. తనకు ఎంతో ఇష్టమైన తన కుక్కపిల్లను ఎత్తుకుని ముద్దాడుతూ కూడా కాజల్ ఫోటోల దిగింది.
67
అంతే కాదు గర్భవతిగా ఉన్న కాజల్ కు సంబంధించిన అన్ని విషయాలు భర్త గౌతమ్ దగ్గరుండి చూసుకుంటున్నారు. కాజల్ కూడా గర్భవతిగా ఉన్నప్పుడు చేయవల్సిన వ్యాయామాలను నిపుణుల పర్యావేక్షణలో చేస్తూ.. ఎప్పటికప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది.
77
ఇదిలా ఉండగా రీసెంట్ గా కాజల్ తన బేబీ బంప్ ఫోటోస్ షేర్ చేసినప్పుడు కొందరు నెటిజన్ల నుంచి బాడీ షేమింగ్, ట్రోలింగ్ ఎదుర్కొంది. మహిళలు గర్భంతో ఉన్నప్పుడు శరీరంలో మార్పులు సహజమే. అయితే రకరకాల కామెంట్లు వినిపించడంతో కాజల్ వారిపై అదే రేంజ్ లో ఫైర్ అయ్యింది.