ఆర్ఆర్ఆర్ తరువాత రాజమౌళి మహేష్ బాబు(Mahesh Babu)తో సినిమా ప్లాన్ చేసుకుంటున్నాడు. దీని కోసం ఇప్పటికే పనులు స్టార్ట్ అయినట్టు కూడా తెలుస్తోంది. జక్కన్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ కంప్లీట్ చేసేలోపు అటు మహేష్, త్రివిక్రమ్ సినిమాను కంప్లీట్ చేసే ఆలోచనలో ఉన్నాడు.
అయితే రాజమౌళి(Rajamouli) ఈసారి కూడా మల్టీ స్టారర్ సినిమానే చేయబోతున్నాడట. మహేష్ బాబుతో చేసే ప్రాజెక్ట్ లో సూపర్ స్టార్ కు సరిసమానమైన పవర్ ఫుల్ పాత్రను క్రియేట్ చేశాడట జక్కన్న. ఇక ఈ పాత్ర కోసం ఏం ఆలోచించకుండా బాలకృష్ణ(Balakrishna)ను తీసుకోవాలి అని చూస్తున్నాడ.
మహేష్ బాబు(Mahesh Babu) సినిమా.. అది కూడా బాలయ్య (Balakrishna) కాంబినేషన్ లో అంటే అంచనాలు మామూలుగా ఉండవు. అయితే ఇక్కడు వచ్చింది చిక్కంతా. మల్టీ స్టారర్ సినిమా అంటే ఇద్దరు హీరోలకు ఇంపార్టెన్స్ కరెక్ట్ గా ఉండాలి. ఒకరు తక్కువ మరొకరు ఎక్కువ కాకుండా చూసుకోవాలి. లేదంటే ఫ్యాన్స్ హర్ట్ అయ్యే అవకాశం ఉంది.
ఇప్పటికే ట్రిపుల్ ఆర్(RRR) విషయంలో అటు మెగా ఫ్యాన్స్.. ఇటు నందమూరి ఫ్యాన్స్ పలు సందర్భాల్లో హార్ట్ అయ్యారు. తమ హీరోకు ఇంపార్టెన్స్ లేదు అంటూ ఫీల్ అయ్యారు. మల్టీ స్టారర్.. అది కూడా భారీ ఫ్యాన్ బేస్ ఉన్న హీరోలతో సినిమా చేయాలి అంటే ఇలాంటివాటిని హ్యాండిల్ చేయడానికి రెడీగా ఉండాలి. ఆ విషయంలో జక్కన్నముందే ఆలోచించి సమాధానాలు రెడీగా పెట్టుకున్నాడు.
ఇక ఇఫ్పుడు సూపర్ స్టార్ మహేష్(Mahesh Babu).. నటసింహం బాలకృష్ణ (Balakrishna) కాంబినేషన్ లో సినిమా.. మహేష్ హీరోగా నటిస్తుండే అంతకు మించిన పవర్ ఫుల్ క్యారెక్టర్ లో బాలయ్య.. ఇది ఊహిస్తేనే ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారా అనేది మొదటి ప్రశ్న అయితే.. హీరోలకు ఇచ్చే ఇంపార్టెన్స్ విషయంలో ఏదైనా తేడా వస్తే ఏంటి పరిస్థితి అనేది మరో ప్రశ్న.
అసలే బాలయ్య(Balakrishna), మహేష్ బాబు(Mahesh Babu)కు డైహార్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. బాలా ఫ్యాన్స్ పక్కా మాస్ అయితే..మహేష్ కు మాస్ క్లాస్ రెండు రకాల ఫ్యాన్స్ ఉన్నారు. మరి వీరందరూ హ్యాపీ ఫీల్ అయ్యేలా జక్కన్న సినిమాను ప్లాన్ చేయగలడా.. చేసి పర్ఫెక్ట్ గా సినిమాన కంప్లీట్ చేయగలడా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. అయితే ఇప్పటికే ఈ పాత్ర కోసం బాలకృష్ణ ను ఒప్పించే పనిలో ఉన్నాడట రాజమౌళి.
అసలు రాజమౌళితో సినిమా అంటేనే రెండు మూడేళ్లు సమర్పించుకోవాలి. ఏడాదికి ఒక్క సినిమా చేసే మహేష్ బాబు(Mahesh Babu) ఈ విషయంలో ఇంకా తర్జనబర్జన పడుతూనే ఉన్నాడు. అన్నేళ్లు సినిమా లేకపోతే ఫ్యాన్స్ ఏమైపోవాలి.. ఆతరువాత వచ్చేది కూడ సోలో సినిమా కాకుండా మల్టీ స్టారర్ సినిమా అయితే ఫ్యాన్స్ ఒప్పుకుంటారా అని ఆలోచిస్తున్నాడట.
ఇక అటు బాలకృష్ణ(Balakrishna) విషయం చూసుకుంటే ఆయన కూడా రెండు మూడేళ్లు టైమ్ కేటాయించడం కుదిరే పని కాదు. రాజమౌళి ప్రాజెక్ట్ లోకి వస్తే.. ఆల్ రెడీ బాలయ్య కమిట్ అయిన సినిమాల పరిస్థితి ఏంటి..? సీనియర్ హీరో వరుసగా సినిమాలు ప్లాన్ చేసుకుంటున్న బాలా.. జక్కన్న కోసం అంత త్యాగం చేస్తాడా అనేది చూడాలి.
మరో వైపు ఈ ఇద్దరు హీరోల ఇమేజ్ విషయం చూస్తే.. ట్రిపుల్ ఆర్(RRR) లో ఇద్దరూ యంగ్ హీరోలే కాబట్టి ఇద్దరి ఇంపార్టెన్స్ విషచంలో ఫ్యాన్స్ హార్ట్ అయ్యి ఉండవచ్చు.. కాని ఇక్కడ మహేష్(Mahesh Babu), బాలయ్య ఇద్దరివి సెపరేట్ పాత్రలు కావడంతో ఎవరి ఇంపార్టెన్స్ వారికి ఉండేలా జక్కన్న ప్లాన్ చేసుకుంటున్నట్టు సమాచారం.
అటు బాయల్య(Balakrishna) కూడా రాజమౌళి సినిమా వదిలేసుకోడు అనే అనుకుంటున్నారు ఇండస్ట్రీ వర్గాలు. అసలే రీసెంట్ గా అన్ స్టాపబుల్ షోలో కూడా మిమ్మల్ని డైరెక్ట్ చేయాలి అంటే భయం సార్ అన్నాడు జక్కన్న. హీరోల కంఫర్ట్ గురించి నేను ఆలోచించనన్నాడు. అటు బాలయ్య కూడా నేను కారావాన్ దిగితే ఎండ వానా పట్టించుకోను.. డైరెక్టర్ ఏది చెపితే అదే వింటానని కూడా క్లారిటీ ఇచ్చాడు.
ఇక ఇన్ని పరిణామాలు చూసుకుంటే రాజమౌళి సినిమాలో బాలయ్య(Balakrishna) పాత్ర దాదాపు కన్ ఫార్మ్ అయినటే అని తెలుస్తోంది. మరి సూపర్ స్టార్ మహేష్ బాబును.. బాలయ్యను కలిపి భారీ మల్టీ స్టారర్ ను ఆయన ఎలా ప్లాన్ చేస్తాడు అనేది చూడాలి.