kajal aggarwal:మనసు అది కోరుకుంటుంది... హాట్ ఫోజులో చందమామ కాజల్ ఇంస్టాగ్రామ్ పోస్ట్ వైరల్

Published : Feb 04, 2022, 03:27 PM IST

కాజల్ అగర్వాల్(Kajal aggarwal) జోరు తగ్గినట్లే అనిపిస్తుంది. ఒప్పుకున్న చిత్రాలు తప్పితే కొత్తగా సైన్ చేస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. అయితే ఆఫర్స్ వచ్చినా రాకున్నా కాజల్ కి నష్టమేమీ లేదు. కోరుకున్న ప్రియుడ్ని పెళ్లాడిన కాజల్ హ్యాపీ మారీడ్ లైఫ్ అనుభవిస్తుంది. 

PREV
16
kajal aggarwal:మనసు అది కోరుకుంటుంది... హాట్ ఫోజులో చందమామ కాజల్ ఇంస్టాగ్రామ్ పోస్ట్ వైరల్

ఇక ఈ ఏడాది తల్లి కూడా కానుంది కాజల్. కెరీర్, పర్సనల్ లైఫ్ ఇంత పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకున్న కాజల్ తెలివితేటలను మెచ్చుకోవాల్సిందే.  పెళ్ళైన ఏడాది కాలంలోనే శుభవార్త చెప్పేసింది. 2020 అక్టోబర్ లో కాజల్ తన చిరకాల మిత్రుడు గౌతమ్ కిచ్లుని వివాహం చేసుకున్నారు. పెళ్లి అయ్యాక ఏకంగా నెల రోజుల పాటు మాల్దీవ్స్ లో హనీమూన్ ఎంజాయ్ చేశారు ఈ జంట.

26

ఇక లాక్ డౌన్ కారణంగా సినిమా షూటింగ్స్ వాయిదాపడడంతో కాజల్ కి కావలసినంత తీరిక దొరికింది. ఈ ఏడాది కాలంలో అనేక విహారాలు చేశారు. నచ్చిన ప్రదేశానికి అనుకుందే తడవుగా వెళ్లి, ఆహ్లాదంగా గడిపారు. అప్పటి వెకేషన్స్ కాజల్ కి బాగా గుర్తొస్తున్నాయట. మనసు వెకేషన్ కోరుకుంటుంది.. అంటూ ఇంస్టాగ్రామ్ లో ఓ పోస్ట్ షేర్ చేసింది.

36

సినిమా అవకాశాలు వచ్చినా కాజల్ ఒప్పుకోక పోవచ్చు. ప్రశాంతంగా బిడ్డను కని, తర్వాత కెరీర్ గురించి ఆలోచన చేయవచ్చు. బిడ్డ పుట్టాక కాజల్ బహుశా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసే అవకాశం కలదు. హీరోయిన్ ఆఫర్స్ ఇకపై కష్టమే.

46

ఇక కాజల్ హీరోయిన్ గా నటించిన మల్టీస్టారర్ ఆచార్య (Acharya)ఏప్రిల్ 29న విడుదల కానుంది.-చిరంజీవి చరణ్ నటిస్తున్న ఈ మూవీలో ఆమె చిరుకు జంటగా నటించారు. దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించారు. ఆచార్యలో మరో హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తున్నారు. 

56


ఇక హిందీలో ఒక చిత్రంతో పాటు, తమిళంలో మూడు చిత్రాల వరకూ నటిస్తున్నారు. తెలుగు, తమిళంలో అధిక చిత్రాలు చేసిన కాజల్... హిందీలో కూడా అడపాదడపా చిత్రాలు చేశారు. సౌత్ లో లాంగ్ కెరీర్ కలిగిన హీరోయిన్స్ లో ఒకరిగా కాజల్ నిలిచారు. 

66


పెళ్లి తర్వాత తన భర్త గౌతమ్ వ్యాపార వృద్ధికి కాజల్ తన వంతు సాయం చేస్తున్నారు. ఆయన నడుపుతున్న సంస్థ ఉత్పత్తులకు ప్రచార కర్తగా వ్యవహరిస్తోంది. గృహిణిగా కాజల్ నెరవేరుస్తున్న బాధ్యతలు అబ్బురపరుస్తున్నాయి. 

click me!

Recommended Stories