Pragathi on Casting couch:లైంగిక వాంఛ తీర్చితే ఆఫర్ ఇస్తానన్నాడు... స్టార్ హీరోపై నటి ప్రగతి షాకింగ్ ఆరోపణలు!

Published : Feb 04, 2022, 01:59 PM IST

క్యాస్టింగ్ కౌచ్...? అంటే ఏమిటో కూడా నాకు తెలియదు. అలాంటి ఇబ్బందులు నేను ఎదుర్కోలేదు, అని ఎవరైనా హీరోయిన్ అంటే అది పచ్చి అబద్దమే. స్థాయితో సంబంధం లేకుండా జూనియర్ ఆర్టిస్ట్ నుండి స్టార్ హీరోయిన్ వరకు ఫేస్ చేయాల్సిన సమస్య ఇది. 

PREV
17
Pragathi on Casting couch:లైంగిక వాంఛ తీర్చితే ఆఫర్ ఇస్తానన్నాడు... స్టార్ హీరోపై నటి ప్రగతి షాకింగ్ ఆరోపణలు!


జనరేషన్స్ గా ప్రపంచంలోని అన్ని చిత్ర పరిశ్రమల్లో క్యాస్టింగ్ కౌచ్ (Casting couch) ఉంది. కాకపోతే ఆడవాళ్ళ ఆలోచనా విధానంలో మార్పు రావడం, సోషల్ మీడియా వలన ఈ సమస్య వెలుగులోకి వచ్చింది. ఒకప్పటి హీరోయిన్స్ లైంగిక వేధింపులు నాలుగు గోడల మధ్యే ముగిసిపోయేవి. 

27

హీరోయిన్ గా సక్సెస్ అయిన స్టార్స్ క్యాస్టింగ్ కౌచ్ లేదంటారు. లైంగిక ఇబ్బందులు, వేధింపులు ఎదుర్కొని కూడా అవకాశాలు రాక మరుగునపడిన వారు ఒకప్పటి తమ పీడ కలల తాలూకు జాడలు బయటపెడతారు. టాలీవుడ్ లో శ్రీరెడ్డి (Srireddy)తో పాటు పలువురు చిన్నా చితక తారలు క్యాస్టింగ్ కౌచ్ పై సంచలన ఆరోపణలు చేశారు.

37


తాజాగా స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ క్యాస్టింగ్ కౌచ్ గురించి సంచలన కామెంట్స్ చేశారు. తనకు కూడా లైంగిక వేధింపులు ఎదురయ్యాయని ఒప్పుకున్నారు. ఓ దశలో దర్శక నిర్మాతలే కాకుండా హీరోల నుండి వేధింపులు ఎదురయ్యాయని వెల్లడించారు. ఒక స్టార్ హీరో అయితే... రోజంతా తనతో గడిపితే అవకాశం ఇస్తానని ఆఫర్ ఇచ్చాడంటూ తెలియజేసింది. 

47


ప్రగతిని (Pragathi) లైంగిక వాంఛ తీర్చమని కోరిన సదరు స్టార్ హీరో ఎవరనేది ప్రగతి బయటపెట్టలేదు. చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే.. ప్రగతి కెరీర్ హీరోయిన్ గా మొదలైంది. ఆమె 90లలో కొన్ని తమిళ చిత్రాలలో హీరోయిన్ గా చేశారు. 

57

1997 తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. 2002లో విడుదలైన బాబీ మూవీతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు. ఆ మూవీలో మహేష్ బాబు తల్లిగా ఆమె నటించారు. అప్పటికి ప్రగతి వయసు కేవలం 25 ఏళ్ళు మాత్రమే. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సూపర్ సక్సెస్ కావడంతో టాలీవుడ్ లో స్థిరపడిపోయారు.

67


కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో హాట్ హాట్ వీడియోలు పోస్ట్ చేస్తూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యారు. ప్రగతి తరచుగా డాన్స్, ఫిట్నెస్ వీడియోలు ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేస్తూ ఉంటారు. ఏ వీడియోలపై నెటిజన్స్ ట్రోల్స్ చేస్తూ ఉంటారు. అవేమీ పట్టించుకోని ప్రగతి తన ప్యాషన్ కొనసాగిస్తున్నారు. 

77

ఇక 2019 సక్సెస్ ఫుల్ మూవీ ఎఫ్ 2 లో హీరోయిన్ తల్లి పాత్ర చేసిన ప్రగతి కామెడీ టైమింగ్ తో కేకపుట్టించారు.  సీక్వెల్ ఎఫ్ 3లో కూడా నటిస్తున్నారు. చిరంజీవి భోళా శంకర్ మూవీలో కూడా ప్రగతి నటిస్తున్నారు. అలాగే మరికొన్ని ప్రాజెక్ట్స్ తో ఆమె బిజీగా ఉన్నారు.

click me!

Recommended Stories