యంగ్ హీరోయిన్ నిషా అగర్వాల్ తెలుగు చిత్రాల్లో నటించి ఆడియెన్స్ గుర్తింపు దక్కించుకుంది. అక్క కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) సపోర్ట్ తో సినిమాల్లోకి వచ్చినా పెద్దగా నిలబడలేకపోయింది. కానీ ఆయా చిత్రాలతో ప్రేక్షకులను అలరించింది.
‘ఏమైంది ఈవేళా’, ‘సోలో’, ‘సుకుమారుడు’, ‘సరదాగా అమ్మాయితో’ వంటి చిత్రాలతో వెండితెరపై అలరించింది. అటు తమిళం, మలయాళంలోనూ రెండు, మూడు సినిమాలు చేసింది. మొత్తానికి పదేళ్లుగా సినిమాలకు దూరంగానే ఉంది.
కెరీర్ కు ఆల్మోస్ట్ గుడ్ బై చెప్పిన ఈ బ్యూటీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గానే కనిపిస్తోంది. ఇంట్రెస్టింగ్ పోస్టులు పెడుతూ ఆకట్టుకుంటోంది. అలాగే తన బ్యూటీఫుల్ ఫొటోషూట్లతో నెటిజన్ల చూపు తనపై పడేలా చేసింది.
సినిమాలు చేయకపోయినా పలు బ్యూటీ ప్రాడక్ట్స్ ను ప్రమోట్ చేస్తూనే వస్తోంది. తాజాగా ఓ బ్రాండ్ ను ప్రచారం చేసేందుకు మరో వ్యక్తితో కలిసి భార్యభర్తలుగా యాడ్ షూట్ చేసింది. ఇందులో తన కోస్టార్ తో నిశా నటించిన తీరు ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
బ్యూటీ ప్రాడక్ట్ ను వివరించే క్రమంలో ‘నా భర్త’ అంటూనే ముద్దులతో ముచేసింది. లిప్ లాప్, కిస్సులు, హగ్ చేసుకుంటూ ప్రాక్ట్ ను పరిచయం చేసింది. కానీ... సినిమాలో కూడా ఇంత రొమాన్స్ ఉండదని వీడియో చూసిన వారు షాక్ అవుతున్నారు.
యాడ్ షూట్ కోసమే నిశా అగర్వాల్ ఇంతలా చేయాల్సిన అవసరం ఉందా? అంటున్నారు. ఏదేమైనా నిశా పంచుకున్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. పదేళ్లుగా సినిమాకు దూరంగా ఉన్న ఈ బ్యూటీ మళ్లీ ఎప్పుడు రీఎంట్రీ ఇస్తుందనేది వేచి చూడాలి.