గత సీజన్ల కంటే బిగ్ బాస్ సీజన్ 7 బాగా హైలైట్ అయింది. శివాజీ, పల్లవి ప్రశాంత్, శోభా శెట్టి, ప్రియాంక జైన్, అమర్ దీప్ హౌస్ లో పోరాడిన తీరు అద్భుతం అనే చెప్పాలి. హౌస్ లో వీళ్లంతా రెండు గ్రూపులుగా విడిపోయి ఆడారు. దీనితో ఫ్యాన్స్ కూడా తమకి ఇష్టమైన గ్రూప్ కి మద్దతు తెలిపారు. శివాజీ, యావర్, పల్లవి ప్రశాంత్ ఒక గ్రూప్ కాగా.. శోభా శెట్టి, అమర్ దీప్, ప్రియాంక మరో బ్యాచ్ అన్నట్లుగా హౌస్ లో ఫైట్ సాగింది.