బిగ్ బాస్ తెలుగు 7 (Bigg Boss Telugu) అన్ని సీజన్ల కంటే సక్సెస్ అయిన విషయం తెలిసిందే.. మొన్నటి వరకు బిగ్ బాస్ వార్తలు కనిపిస్తూనే ఉన్నాయి. పల్లవి ప్రశాంత్ కేసు, కంటెస్టెంట్ల కామెంట్లతో న్యూస్ కనిపిస్తూనే ఉంది.
ఈ పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 టైటిల్ విన్నర్ గా పల్లవి ప్రశాంత్ (Pallavi Prashanth) విజయం సాధించిన విషయం తెలిసిందే.. రైతు బిడ్డగా టీవీత ఆడియెన్స్ గుండెల్లో స్థానం సంపాదించుకున్నారు.
కానీ బిగ్ బాస్ తెలుగు టైటిల్ గెలుచుకున్న తర్వాత పల్లవి ప్రశాంత్ ఊహించని వివాదాల్లో చిక్కుకున్నారు. కేసు, జైలు, కోర్టు చుట్టూ తిరిగిన విషయం తెలిసిందే. టైటిల్ గెలుపొందిన ఆనందం కూడా లేకుండా పోయింది.
ఇప్పుడిప్పుడే తన సక్సెస్ ను ఆయా షోలలో వ్యక్తం చేస్తున్నారు. ఇక తాజాగా బీబీ ఉత్సవం (BB Utsvam) ఈవెంట్ ద్వారా మళ్లీ BB7 కంటెస్టెంట్లు అందరూ రీయూనైట్ అయ్యారు. ఈ సందర్భంగా పల్లవి ప్రశాంత్ తన తండ్రిని తలుకుంటూ గుక్కపెట్టి ఏడ్చారు.
‘బిగ్ బాస్ 7 గ్రాండ్ ఫినాలే తర్వాత మా నాన్న కళ్లలో ఆనందం చూడాలనుకున్నాను.. కానీ నా వల్ల కోర్టు బయట పడుకున్న వీడియో చూశాక.. ఇంకా నేను ఎందుకు బతికున్నానా అనిపించింది. చాలా బాధేసింది.’ అంటూ గుక్కపెట్టి ఏడ్చాడు.
ప్రశాంత్ కంటనీరు చూశాక మిగితా కంటెస్టెంట్లు కూడా ఎమోషనల్ అయ్యారు. ప్రశాంత్ ను ఓదార్చారు. ఇక ఈ పూర్తి ఈవెంట్ ఫిబ్రవరి 18న సాయంత్రం 6 గంటలకు స్టార్ మా ఛానెల్ లో ప్రసారం కానుంది.