Kajal Aggarwal: ఆ భయంతో నా కొడుక్కి పాలు ఇవ్వడం మానేశాను, కల్తీ ఆహారంపై కాజల్ షాకింగ్స్ కామెంట్స్

Published : Jul 11, 2026, 09:00 AM IST

Kajal Aggarwal: స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. "ది ఇండియా స్టోరీ" ప్రమోషన్స్‌లో భాగంగా కల్తీ ఫుడ్‍పై కాజల్ షాకింగ్ కామెంట్స్ చేశారు. 

PREV
16
అసలు పాలివ్వడమే మానేశా: కాజల్

చాలా మంది తల్లులు పాలు తాగితే బలం వస్తుందని పిల్లలకు ఇస్తుంటారు.. కానీ తన కొడుకు విషయంలో మాత్రం అసలు పాలివ్వడమే మానేశానని హీరోయిన్ కాజల్ అన్నారు. ప్రపంచంలో జరుగుతున్న ఆహార కల్తీ నేపథ్యంలో 'ది ఇండియన్ స్టోరీ' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. జూలై 24న సినిమా రిలీజ్ కానుంది. ఈ క్రమంలో మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో కాజల్ బోల్డెన్ని షాకింగ్ విషయాలు చెప్పారు. 

26
కథ కోసం రీసర్చ్‌ చేస్తూ షాకింగ్ విషయాలు తెలుసుకున్నా: కాజల్

మన డైలీ లైఫ్‍లో మనం తీసుకునే ఆహారం ఎంతలా కల్తీ అయిపోయిందో వివరిస్తూ కాజల్ ఆవేదన వ్యక్తం చేశారు. కథ కోసం రీసర్చ్‌ చేస్తే చాలా విషయాలు బయటపడ్డాయన్నారు. అవి చూసి షాకయ్యానని... ప్రస్తుతం ప్రతి ఇంట్లో క్యాన్సర్‌ సాధారణమైపోయిందని చెప్పుకొచ్చారు. ఇటీవల వాటర్ మిలన్ కేసు చూసి పుచ్చకాయ తినడం మానేశానన్నారు. క్యాన్సర్ నేపథ్యంతో ఈ సినిమా రూపొందించినట్లు చెప్పారు.

36
నా కొడుకు ఆరోగ్యమే ముఖ్యం: కాజల్

ఈ క్రమంలోనే తన వ్యక్తిగత జీవితంలో తీసుకున్న ఒక కఠిన నిర్ణయాన్ని ఆమె పంచుకున్నారు.మనం చిన్నప్పటి నుంచి పాలు తాగడం ఆరోగ్యానికి ఎంతో మంచిదని చదువుకున్నాం... కానీ ప్రస్తుత రోజుల్లో మార్కెట్లో దొరుకుతున్న ప్యాకెట్ పాలలో అసలు పాలల్లో ఏం కలుపుతున్నారో తెలియడం లేదని కాజల్ అన్నారు. ఈ సినిమా స్క్రిప్ట్ విన్నాక, దీని వెనుక జరిగిన రీసెర్చ్ చూశాక చాలా భయపడ్డానని అన్నారు. మనం నిత్యం వాడే ప్యాకెట్ పాలు ఎంత ప్రమాదకరంగా మారుతున్నాయో తెలిసి షాక్ అయ్యానని తెలిపారు. ఆ భయంతోనే తన కొడుక్కి మార్కెట్లో దొరికే పాలు ఇవ్వడం పూర్తిగా మానేశానన్నారు. తనను క్రూరమైన తల్లి అని అనుకున్నా పర్లేదు కానీ...తన కొడుకు ఆరోగ్యమే ముఖ్యమని అన్నారు. 

46
డెలివరీ యాప్స్ లో కొనడం ఆపేశా: కాజల్

కేవలం పాలు మాత్రమే కాదు, కూరగాయలు, ఇతర నిత్యావసర వస్తువుల విషయంలో కూడా తాను చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు కాజల్ తెలిపారు. ఇప్పుడున్న 5 మినిట్స్ డెలివరీ యాప్స్ వల్ల మనకు పనులు సులువు అవుతున్నాయి కానీ ఆ కూరగాయలు, ఫ్రూట్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? వాటిపై ఎంతవరకు పురుగుల మందులు చల్లుతున్నారు? అనే గ్యారెంటీ లేదు. అందుకే నేను ఫోన్‌లో ఆర్డర్ చేయడం తగ్గించి, మార్కెట్లో దొరికే వాటినే తీసుకుంటున్నట్లు తెలిపారు. 

56
6 ఏళ్ల చిన్నారి క్యాన్సర్‌తో చేసే పోరాటం, కల్తీ ఆహార మాఫియాపై సినిమా

డైరెక్టర్ చేతన్ దాదాపు 6 ఏళ్లు రీసెర్చ్ చేసి ఈ 'ది ఇండియన్ స్టోరీ' చిత్రాన్ని తెరకెక్కించినట్లు కాజల్ అన్నారు. 6 ఏళ్ల చిన్నారి క్యాన్సర్‌తో చేసే పోరాటం, దాని వెనుక ఉన్న కల్తీ ఆహార మాఫియా చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఇందులో కాజల్ అగర్వాల్ ఒక శక్తివంతమైన లాయర్ పాత్రలో కనిపించనున్నారు. ఒక జవాన్ తరపున ఆమె కోర్టులో చేసే న్యాయపోరాటమే 'ది ఇండియన్ స్టోరీ'సినిమా.

66
ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తుంది: కాజల్

మనం తినే తిండిలో కెమికల్స్, పురుగుల మందులు ఎలా కలిసిపోతున్నాయి, దేశంలో 'క్యాన్సర్ ట్రైన్' లాంటి భయానక పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది ఈ సినిమాలో కళ్లకు కట్టినట్లు చూపించబోతున్నారు. జూలై 24న విడుదల కాబోతున్న ఈ చిత్రం ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తుందని కాజల్ అన్నారు. 

Read more Photos on
click me!