రాంచరణ్ నటించిన పెద్ది చిత్రం ఓటీటీలో హంగామా చేస్తోంది. మరోసారి ఈ మూవీకి సంబంధించిన విశేషాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పెద్ది చిత్రానికి ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో ఈ కథనంలో తెలుసుకుందాం.
మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటించిన పెద్ది చిత్రం థియేటర్స్ లో మంచి విజయం సాధించింది. హిందీ, ఓవర్సీస్ మార్కెట్ లో ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రాలేదు కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం సంచలన కలెక్షన్స్ నమోదు చేసుకుంది. బయ్యర్లకు లాభాలు తెచ్చిపెట్టింది. ఇటీవల ఓటీటీలో విడుదలైన ఈ చిత్రం అక్కడ కూడా విధ్వంసం మొదలుపెట్టింది.
25
ఓటీటీలో పెద్ది హవా
ప్రేక్షకులు ఓటీటీలో ఎగబడి పెద్ది చిత్రాన్ని చూస్తున్నారు. నెట్ ఫ్లిక్స్ లో పెద్ది చిత్రం ట్రెండింగ్ లో టాప్ లో ఉంది. ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాకి ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. థియేటర్స్ లో చూసిన వాళ్ళు, చూడని వాళ్ళు అందరూ పెద్ది చిత్రాన్ని ఓటీటీలో చూస్తున్నారు. వీడియో క్లిప్స్, స్క్రీన్ షాట్స్ కట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ సినిమాపై తమ అభిప్రాయాలు పంచుకుంటున్నారు.
35
జాన్వీ కపూర్ సన్నివేశాల వివాదం
ఈ చిత్రం థియేటర్స్ లో రిలీజ్ అయినప్పుడు బిగ్గెస్ట్ కంప్లైంట్ ఏంటంటే.. జాన్వీ కపూర్ సన్నివేశాలు. ఆమె నటించిన సీన్లు ఫ్యామిలీ ఆడియన్స్ కి ఇబ్బంది కలిగించేలా ఉన్నాయి అని, అమ్మాయిని ఆబ్జెక్టిఫై చేసేలా ఉన్నాయి అంటూ ట్రోలింగ్ నడిచింది. దీనితో దర్శకుడు స్వయంగా క్షమాపణ చెప్పి ఆ సన్నివేశాల్లో మార్పులు చేశారు.
ఓటీటీలో కూడా నెట్ ఫ్లిక్ వివాదాలకు తావు లేకుండా సవరించిన సన్నివేశాలతోనే సినిమాని స్ట్రీమింగ్ చేస్తున్నారు. సాధారణంగా ఓటీటీల్లో బోల్డ్ కంటెంట్ ఉంచేందుకు సంస్థలు వెనుకాడవు. కానీ నెట్ ఫ్లిక్స్ మాత్రం మంచి నిర్ణయం తీసుకుంది. అయినప్పటికీ పెద్ది మూవీపై ట్రోలింగ్ తప్పడం లేదు. ఒకవైపు క్రేజీ రెస్పాన్స్ వస్తుండగా మరికొందరు కొన్ని సన్నివేశాల్ని పోస్ట్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు.
55
వాటిపై ట్రోలింగ్
ఫస్ట్ హాఫ్ లో రాంచరణ్ ఆడే క్రికెట్ షాట్లు చిత్ర విచిత్రంగా ఉంటాయి. ఆ క్లిప్స్ ని పోస్ట్ చేస్తూ కొందరు ట్రోల్ చేస్తున్నారు. కొందరు ఫన్నీగా ట్రోల్ చేస్తుంటే మరికొందరు మాత్రం.. ప్రపంచ క్రికెట్ లో ఎక్కడా ఎలాంటి షాట్లు చూడలేదు.. ఇది నిజంగా క్రికెట్ యేనా అంటూ విమర్శలు చేస్తున్నారు.