జిమ్ లో కొడుకుతో కాజల్.. ముద్దులతో ముంచేస్తూ మురిసిపోతున్న చందమామ.. ఇంట్రెస్టింగ్ పోస్ట్

First Published | Jul 21, 2023, 12:52 PM IST

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) తాజాగా ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేసింది. తన కొడుకుతో కలిసి జిమ్ లో ఉన్న ఫొటోలను అభిమానులతో పంచుకుంది. ఆసక్తికరంగా క్యాప్షన్ ఇచ్చింది. 
 

టాలీవుడ్ లో కొన్నేళ్ల పాటు స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) దుమ్ములేపిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ లోనూ దుమ్ములేపుతోంది. వరుస ప్రాజెక్ట్స్ తో కాజల్ బిజీ అయ్యారు. అటు సినిమాలతో అలరిస్తూనే ఇటు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోంది. 
 

రెండేళ్ళ కింద కాజల్ కు వివాహం జరిగిన విషయం తెలిసిందే. 2020 అక్టోబర్ 6న కాజల్ అగర్వాల్ గౌతమ్ కిచ్లును పెళ్లి చేసుకుంది. ఈ జంట తమ స్వస్థలమైన ముంబైలోని ఓ చిన్న ప్రైవేట్ వేడుకలో ఒక్కటయ్యారు. ఇక గతేడాది  19 ఏప్రిల్ 2022న పండటి మగబిడ్డ నీల్ కూ జన్మిచ్చి తల్లిగా ప్రమోషన్ పొందింది. 
 


కాజల్ కు అబ్బాయి పుట్టిన తర్వాత తన కొడుకును చూస్తూ మురిసిపోతోంది. తరుచుగా నీల్ కిచ్లు ఫొటోలను అభిమానులతో పంచుకుంటూ వస్తోంది. ఇక తాజాగా జిమ్ లో సెషన్ లోనూ నీల్ ను తనవెంట తీసుకెళ్లింది. హాల్ లో కిచ్లును ముద్దాడుతూ మురిసిపోయింది. ఫొటోలకు క్యూట్ గా తల్లికొడుకు ఫోజులిచ్చారు. 
 

నీల్ కిచ్లుపై కాజల్ అగర్వాల్ చూపిస్తున్న ప్రేమకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. తల్లిగా మురిసిపోతున్న స్టార్ హీరోయిన్ పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ ఫొటోలను పంచుకుంటూ ‘నా ఫేవరెట్ జిమ్ బడీ’ అంటూ నీల్ ను ఉద్దేశించి క్యాప్షన్ ఇచ్చింది. 
 

తల్లికొడుకును ఇలా చూసిన ఫ్యాన్స్ కూడా ఖుషీ అవుతున్నారు. లైక్స్, కామెంట్లతో ఆ ఫొటోలను వైరల్ చేస్తున్నారు. ఇక కాజల్ జిమ్ వేర్ లో దర్శనమిచ్చింది. వర్కౌట్స్ చేస్తూ నాజూగ్గా మారేందుకు ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం సినిమాలపైనే ఫోకస్ పెట్టింది.

కాజల్ చేతిలో ప్రస్తుతం రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. తమిళంలో రూపుదిద్దుకుంటున్న ‘ఇండియన్2’తో పాటు, తెలుగులో ‘భగవంత్ కేసరి’లో నటిస్తోంది. తెలుగులోనే ‘సత్యభామ’ అనే మూవీలో పోలీస్ ఆఫీసర్ గా అలరించబోతోంది. అలాగే హిందీలో ‘ఉమా’ అనే మూవీ చేస్తోంది. 
 

Latest Videos

click me!