యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ప్రాజెక్ట్ కె. బాహుబలి తర్వాత ప్రభాస్ నుంచి వచ్చిన ఏ చిత్రమూ మెప్పించలేకపోయింది. సాహో, రాధే శ్యామ్, ఆదిపురుష్ ఇలా ప్రతి మూవీ ఆరంభంలో అంచనాలు పెంచడం ఆ తర్వాత చతికలబడడం జరుగుతూ వచ్చింది. కానీ ప్రభాస్ ఫ్యాన్స్ అంతా డైరెక్టర్ నాగ అశ్విన్ పై నమ్మకంతో ఉన్నారు.