పెళ్లికి ముందు కాజల్ భర్త కండీషన్స్ పెట్టాడా? ఏం చేయమన్నాడంటే?

First Published | Jun 28, 2023, 6:48 PM IST

స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ (Kajal Aggarawal)  పెళ్లి తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ లోనూ వరుస ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు. అయితే పెళ్లికి ముందుకు తన భర్త కొన్ని కండీషన్స్ పెట్టినట్టు తెలుస్తోంది. 
 

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ కొన్నేళ్లు ఊపూపిన విషయం తెలిసిందే. బడా హీరోల సరసన నటించి ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసుకుంది. ‘లక్ష్మీ కళ్యాణం’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఆ తర్వాత వచ్చిన ’చందమామ’ సినిమా మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది.
 

2004 నుంచి కాజల్ ఇండస్ట్రీలో చాలా యాక్టివ్ గా ఉంటున్న విషయం తెలిసిందే. దాదాపుగా 20 ఏళ్లుగా వరుస చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తోంది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఇప్పటి వరకు సినిమాలు చేసింది. తెలుగులో ఎక్కువ సినిమాలు ఉన్నాయి. 
 


ఇక కాజల్ అగర్వాల్  మొదటి లాక్ డౌన్ లోనే పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. 2020 అక్టోబర్ 30న వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లు (Gautham Kitchlu)ను వివాహం చేసుకుంది. చాలా తక్కువ మంది అతిథులు, సన్నిహితుల మధ్య వీరి వెడ్డింగ్ ముగిసింది. ఇక గతేడాది ఏప్రిల్ 19న పండంటి మగబిడ్డకు జన్మను కూడా ఇచ్చింది కాజల్.
 

అయితే, పెళ్లి తర్వాత కూడా కాజల్ అగర్వాల్ సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ కూడా అందుతున్నాయి. ఈ క్రమంలో కాజల్ కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి నెట్టింట వైరల్ గా మారింది.

కాజల్ కు ఆమె భర్త పెళ్లి ముందు కండీషన్స్ పెట్టాడని అంటున్నారు. పెళ్లి తర్వాత సినిమాలు చేయడంలో తనకెలాంటి అభ్యంతరం లేదని.. కానీ ప్రతి రోజూ ఓ గంటసేపు తనతో సమయం గడపాలని కండీషన్ పెట్టాడంట. ఇందుకు ఒప్పుకున్నాకే కాజల్ తో పెళ్లి జరిగిందంట. 
 

దీంతో కాజల్ కూడా షూటింగ్ జరుగుతున్న సమయంలోనూ భర్త కిచ్లు కోసం గంట సమయం కేటాయించేలా చూసుకుంటోందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్ గా మారింది. ఇక కాజల్ ‘భగవంత్ కేసరి’, ‘ఇండియన్ 2’, ‘ఉమా’, ’సత్యభామ’, పారిస్ పారిస్ వంటి చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. 

Latest Videos

click me!