బాలీవుడ్ యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్ త్వరలో తెలుగు ప్రేక్షకులను పలకరించబోతోంది. దివంగత, ప్రముఖ నటి శ్రీదేవి కూతురిగా జాన్వీ వెండితెరకు పరిచయం అయిన విషయం తెలిసిందే. హీరోయిన్ గా జాన్వీకి ‘ధడక్’ తొలిచిత్రం.
ఐదేళ్లపాటు ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ లోనే వరుస చిత్రాలతో అలరించింది. ఇతర ఇండస్ట్రీల్లోనూ అవకాశాల కోసం చూసింది. ఎట్టకేళలకు టాలీవుడ్ కు ఎంట్రీ ఇస్తోంది. ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) సరసన Devara మూవీలో నటిస్తోంది. కొరటాల శివ డైరెక్టర్.
ప్రస్తుతం జాన్వీ నటించిన నాలుగు చిత్రాలు విడుదల కావాల్సి ఉన్నాయి. ‘దేవర’, ‘ఉలజ్’ సినిమాలు చిత్రీకరణలో ఉన్నాయి. హిందీ సినిమాలు ‘బావల్’, ’మిస్టర్ అండ్ మిస్ మహి’ మూవీస్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్నాయి. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
ఇదిలా ఉంటే వరుస చిత్రాలతోనే కాకుండా జాన్వీ సోషల్ మీడియాలోనూ మెరుస్తూ ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తోంది. బ్యాక్ టు బ్యాక్ పోస్టులు పెడుతూ, తన వ్యక్తిగత విషయాలను ఎప్పటికప్పుడు పంచుకుంటూ మరింతగా దగ్గరవుతోంది. ఈ క్రమంలో తాజాగా బ్యూటీఫుల్ ఫొటోలను షేర్ చేసింది.
తన స్నేహితులతో కలిసి వెకేషన్ కు వెళ్లిన జాన్వీ నేచర్ అందాలను ఆస్వాదిస్తూ కాస్తా రిలాక్స్ అవుతోంది. ప్రకృతికి దగ్గరగా ఉంటూ నేచర్ అవర్ అనిపించుకుంటోంది. ఈ సందర్భంగా అదిరిపోయేలా ఫొటోషూట్ కూడా చేసింది. ఆ పిక్స్ పంచుకోవడంతో ఫ్యాన్స్, నెటిజన్లు ఖుషీ అవుతున్నారు.
లేటెస్ట్ పిక్స్ లో జాన్వీ కపూర్ గ్లామర్ మెరుపులు కూడా మెరిపించింది. లాంగ్ హూడీలో ఫొటోలకు ఫోజులిచ్చింది. జబ్బలపైనుంచి హూడీ జారిపోతున్నా పట్టించుకోనట్టుగా స్టిల్స్ ఇచ్చింది. టాప్ షోతో పాటు మత్తు చూపులతో కుర్ర హృదయాలను కొల్లగొట్టింది. క్యూట్ లుక్స్ తో మంత్రముగ్ధులను చేసింది.