Kajal New Look: స్టయిలీష్‌ లుక్‌లో అదరగొడుతున్న కాజల్‌.. ఇలా మారిపోయిందేంటి?.. సమంత పోస్ట్

Published : Feb 01, 2022, 04:50 PM ISTUpdated : Feb 01, 2022, 09:17 PM IST

స్టార్‌ హీరోయిన్‌ కాజల్‌.. జీవితంలో ఈ ఏడాది పెను మార్పు చోటు చేసుకోబోతుంది. త్వరలో తల్లి కాబోతుంది. పండంటి బిడ్డకి జన్మనిచ్చేందుకు సిద్ధమవుతుంది. ఈ క్రమంలో కాజల్‌లో చాలా మార్పు కనిపిస్తుంది. 

PREV
16
Kajal New Look: స్టయిలీష్‌ లుక్‌లో అదరగొడుతున్న కాజల్‌.. ఇలా మారిపోయిందేంటి?.. సమంత పోస్ట్

కాజల్‌(Kajal) లేటెస్ట్ గా వెకేషన్‌లో ఎంజాయ్‌ చేస్తుంది. తాను ఎక్కడికి వెళ్లిందో చెప్పలేదుగానీ, వెకేషన్‌లో ఉన్నట్టు పేర్కొంది కాజల్‌. అయితే తాజాగా ఆమె ఓ స్టయిలీష్‌ పిక్‌ని ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అభిమానులతో పంచుకుంది. ఇందులో హెడ్‌పై స్టయిలీష్‌ గ్లాసెస్‌, జీన్స్ షర్ట్, బ్లూ ప్యాంట్‌ ధరించి సోఫాలో రిలాక్స్ డ్‌ గా కూర్చుంది. 

26

Kajal పోజ్‌ మాత్రం అదిరిపోయేలా ఉంది. అభిమానులను కట్టిపడేస్తుంది. కాజల్‌ దర్జా పోజ్‌కి అభిమానులు అదే స్టయిల్‌లో కామెంట్లు, ప్రశంసలు కురిపిస్తున్నారు. స్టయిలీష్‌ లుక్‌లోనూ ఏంజెల్‌లా ఉన్నావని, బ్యూటీఫుల్‌గా ఉన్నావని అంటున్నారు. మొత్తంగా కాజల్‌ లేటెస్ట్ పిక్‌ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. చాలా రోజుల తర్వాత కాజల్‌ పిక్‌ రావడంతో అభిమానులు హ్యాపీ అవుతున్నారు. 

36

ఈ సందర్భంగా కాజల్‌ ఓ ఇంట్రెస్టింగ్‌ పోస్ట్ పెట్టింది. `రుతువులు మారుతున్నాయి. వాటి లాగే నేను కూడా మారుతున్నా. కొత్త ఆకులా మారిపోతూ..` అంటూ ఆకు ఎమోజీని, బేబీ బంప్‌తో ఉన్న ఎమోజీని పంచుకుంది కాజల్‌. అయితే ఇందులో కాజల్‌ చాలా మారిపోయింది. తానిప్పుడు గర్బవతి కావడంతో ముఖం చాలా మారిపోయింది. ఫేస్‌లో గ్లో వచ్చింది. ప్రెగ్నెంట్‌ లక్షణాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. 

46

అయితే కాజల్‌ ఈ లేటెస్ట్ ఫోటోపై మరో స్టార్‌ హీరోయిన్‌ సమంత స్పందించింది. ఆమెకి ప్రేమతో కూడిన ఎమోజీలను పంచుకుంది. అభినందనలు తెలిపింది. దీంతో సమంత అభిమానులు సైతం ఈ పిక్‌ని షేర్‌చేస్తూ వైరల్‌ చేస్తున్నారు. 

56

కాజల్‌ గర్భవతి అవుతున్నట్టు గత నెలలో భర్త గౌతమ్‌ కిచ్లు ప్రకటించిన విషయం తెలిసిందే. కొద్ది గ్యాప్‌తో ఓ కమర్షియల్‌ యాడ్‌ ద్వారా కాజల్‌ తన ప్రెగ్నెన్సీని ప్రకటించింది. ప్రస్తుతం ఆమె సినిమాలకు గుడ్‌బై చెప్పి పూర్తిగా బేబీ బంప్‌తో ప్రీ డెలివరీ అనుభూతులను ఆస్వాధిస్తుంది. కాజల్‌, గౌతమ్‌ కిచ్లు 2020 అక్టోబర్‌లో ముంబయిలో ప్రైవేట్‌ ఈవెంట్‌గా తమ మ్యారేజ్‌ని చేసుకున్న విషయం తెలిసిందే. 

66

మ్యారేజ్‌ తర్వాత కూడా ఆమె సినిమాలు కంటిన్యూ అవుతూ వచ్చారు. తమిళంలో `హే సినామికా`, తెలుగులో `ఆచార్య` చిత్రాలు చేశారు. దీంతోపాటు నాగార్జునతో `ది ఘోస్ట్` చిత్రానికి కూడా కమిట్‌ కాగా, ఇటీవల తాను ప్రెగ్నెంట్‌ కావడంతో ఆ చిత్రం నుంచి తప్పుకుంది. మరోవైపు ఇప్పటికే ఆమె తమిళంలో `కరుంగాపియమ్‌`, `ఘోస్టీ`, హిందీలో `ఉమా` చిత్రాలు పూర్తి చేసుకుంది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories