Kajal Pregnancy Shoot: కాజల్‌ ప్రెగ్నెన్సీతో ఫస్ట్ ఫోటో షూట్‌.. థైస్‌ చూపిస్తూ తగ్గేదెలే అంటోన్న అందాల చందమామ

First Published | Jan 2, 2022, 6:27 PM IST

కాజల్‌ అగర్వాల్‌ తల్లికాబోతుంది. త్వరలోనే ఆమె పండంటి బిడ్డకి జన్మనివ్వబోతుంది. కొత్త సంవత్సరం సందర్భంగా గుడ్‌న్యూస్‌ని ప్రకటించారు కాజల్‌ భర్త గౌతమ్‌ కిచ్లు.  తమ జీవితంలోకి మరో వ్యక్తి రాబోతున్నందున తన సంతోషం వ్యక్తం చేశారు. 

కాజల్‌ కెరీర్‌ పరంగా ఫుల్‌స్వింగ్‌లో ఉన్న సమయంలోనే పెళ్లి చేసుకుని సెటిల్‌ అయ్యింది. 2020 అక్టోబర్‌లో ఆమె గౌతమ్‌ కిచ్లుని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. కరోనా నిబంధనల నేపథ్యంలో అతికొద్ది మందితో గ్రాండ్‌గా చేసుకున్నారు.  మ్యారేజ్‌ అయి ఏడాది తర్వాత పిల్లలకు ప్లాన్‌ చేసుకుంది కాజల్‌ జంట. 

గత కొన్ని రోజులుగా కాజల్‌ ప్రెగ్నెన్సీకి సంబంధించిన వార్తలు గుప్పుమన్నాయి. దీనిపై సైలెంట్‌గా ఉన్న కాజల్‌.. సరైన సమయంలో మాట్లాడతానని తెలిపింది. ఎట్టకేలకు ఆమె భర్త గౌతమ్‌ కిచ్లు కాజల్‌ ప్రెగ్నెన్సీని కన్ఫమ్‌ చేశాడు. దీంతో ప్రస్తుతం కాజల్‌ సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతుంది. ఆమెకి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. 
 


ఇదిలా ఉంటే తాజాగా కాజల్‌ ప్రెగ్నెన్సీతో ఫస్ట్ ఫోటో షూట్‌ నిర్వహించింది. తన భర్తతో కలిసి ఆమె ప్రెగ్నెన్సీ విషయాన్ని తెలియజేస్తూ, పోజులిచ్చింది. మరోవైపు సింగిల్‌గానూ హాట్‌ పోజులతో కుర్రాళ్ల మతిపోగొడుతుంది. థైస్‌ చూపిస్తూ మత్తెక్కించే చూపులతో ఇంటర్నెట్‌లో సెగలు రేపుతుంది కాజల్‌. 
 

ప్రెగ్నెన్సీ తర్వాత కూడా తానేం తక్కువ కాదని, గ్లామర్ విషయంలో తగ్గేదెలే అనే విషయాన్ని చాటుకుంటుంది కాజల్‌. ప్రస్తుతం ఈ బ్యూటీ పంచుకున్న ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. అభిమానులను అలరిస్తున్నాయి. 
 

కాజల్‌ కొత్త ఏడాది సందర్భంగా ఓ ఈవెంట్‌లో పాల్గొంది. తనదైన హాట్‌ నెస్‌తో ఆద్యంతం ఆకట్టుకుంది. ఈవెంట్‌కి  సందడి తీసుకొచ్చింది. దీనికి సంబంధించిన ఓ వీడియో క్లిప్‌ కూడా ఇప్పుడు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుండటం విశేషం. 

టాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా రాణిస్తున్న కాజల్‌.. ప్రస్తుతం తెలుగులో `ఆచార్య` చిత్రంలో నటించింది. ఇది విడుదలకు సిద్ధమవుతుంది. మరోవైపు నాగార్జునతో నటించాల్సిన `ఘోస్ట్ ` చిత్రం నుంచి ఆమె తప్పుకున్నట్టు సమాచారం. మరోవైపు హిందీలో `ఉమా` చిత్రంలో నటిస్తుంది కాజల్‌. 

దీంతోపాటు తమిళంలో `హే సినామికా`, `కరుంగాపియమ్‌`, `ఘోస్టీ`, `ఇండియన్‌ 2` చిత్రాల్లో నటిస్తుంది. ఈ సినిమాలు షూటింగ్‌ పూర్తి చేసుకుని విడుదలకు రెడీగా ఉన్నాయి. ఈ ఏడాదంతా వెండితెరపై కాజల్‌ సందడి ఉండబోతుందని చెప్పొచ్చు. 

also read: ఉప్పొంగే ఎద అందాలతో యాంకర్‌ వర్షిణి బ్లాస్టింగ్‌ పోజులు.. వామ్మో ఇది నెక్ట్స్ లెవల్‌ ట్రీట్‌

Latest Videos

click me!