అభిమానుల వల్ల చిత్ర భుజానికి గాయం, ప్రమాదం గురించి వివరాలు వెల్లడించిన స్టార్ సింగర్

Published : Jun 26, 2025, 12:26 PM IST

స్టార్ సింగర్ చిత్ర అన్ని భాషల్లో కలిపి కొన్ని వేల పాటలను ఆలపించారు. రీసెంట్ గా ఆమె భుజానికి గాయంతో, చేతికి కట్టుతో కనిపించారు. అసలు ఆమెకు ప్రమాదం ఎలా జరిగింది. ఈ విషయాన్ని చిత్ర స్వయంగా వెల్లడించారు. 

PREV
16

గాయని చిత్ర అంటే ఇష్టపడనివారు ఉండరు. ఆమె గాత్రానికి మైమరచిపోతుంటారు అభిమానులు. కొన్ని దశాబ్దాలుగా వేల పాటలు పాడి, శ్రోతల మనసుల్లో స్థానం సంపాదించారు చిత్రం. అద్భుతమైన పాటలతో ఆడియన్స్ ను అలరిస్తూనే ఉన్నారు చిత్ర. 

అంతే కాదు ఆమె పాటలు వినని రోజు ఉండదంటే అతిశయోక్తి కాదు. ఎప్పుడూ నవ్వుతూ కనిపించే చిత్ర కెరీర్ లో ఎన్నో విషాదాలు కూడా ఉన్నాయి. చిత్రకు పెళ్లైన చాలా కాలం తరువాత పుట్టిన పాపను ఓ ప్రమాదంలో కోల్పోవడం జరిగింది. అది తన జీవితంలో అతి పెద్ద విషాదంగా మిగిలిపోయింది.

26

ఇక కొన్ని రోజుల క్రితం చిత్రకు ప్రమాదం జరిగినట్టు వార్తలు వచ్చాయి. అయితే అప్పుడు ఆమెకు ఏమయ్యింది, ఇప్పుడు ఎలా ఉంది అనే విషయంలో ఎటువంటి అప్ డేట్ లేక ఫ్యాన్స్ కంగారు పడుతున్న క్రమంలో.. చిత్ర ఈ విషయంలో స్పందించారు. తనకు జరిగిన ప్రమాదం గురించి ఆమె స్వయంగా వివరాలు వెల్లడించారు. ఎయిర్‌పోర్ట్‌లో జరిగిన ఈ సంఘటన వల్ల తనకు గాయం అయ్యిందని చిత్ర అన్నారు.

36

ఆసియా నెట్ స్టార్ సింగర్ వేదికపై చిత్ర ఈ ప్రమాదం గురించి చెప్పారు. చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో ఈ సంఘటన జరిగింది. ప్రమాదంలో భుజం ఎముక దాదాపు ఒకటిన్నర అంగుళాలు కిందకి జరిగిందని, మూడు నెలలు చాలా జాగ్రత్తగా ఉండాలని డాక్టర్ చెప్పారని చిత్ర తెలిపారు.

ఇక చిత్ర మాట్లాడుతూ.. నేను కింద పడిపోవడం వల్ల భుజానికి గాయం అయ్యింది. హైదరాబాద్ వెళ్లడానికి చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో ఉన్నా. సెక్యూరిటీ చెక్ అయిపోయాక, నా భర్త కోసం ఎదురు చూస్తున్నా. అప్పుడు చాలా మంది అభిమానులు నన్ను చూసి ఫోటోలు తీసుకోవడానికి వచ్చారు దాంతో ప్రమాదం జరిగిందన్నారు చిత్ర.

46

అందరు ఒకే సారి వచ్చేసరికి క్రౌండ్ కంట్రోల్ అవ్వలేదు. అక్కడే సెక్యూరిటీ వస్తువులు పెట్టే ట్రే ఉంది. నాతో ఫోటో తీసుకునే ఉత్సాహంలో ఎవరో దానిని నా కాలి వెనక్కి నెట్టి వెళ్లిపోయారు. నేను వెనకాల చూసుకోలేదు. అందరు ఫోటోలు తీసుకున్నాక తిరిగి వెనక్కి అడుగు వేశా. నా కాలు ట్రేను తగిలి, బ్యాలెన్స్ తప్పి పడిపోయాను. దాంతో నా భుజం ఎముక ఒకటిన్నర అంగుళాలు కిందకి జరిగింది. డాక్టర్లు దాన్ని తిరిగి సరిచేశారు. కాని మూడు వారాలు విశ్రాంతి తీసుకోవాలి. మూడు నెలలు చాలా జాగ్రత్తగా ఉండాలని డాక్టర్ చెప్పారు అని కె.ఎస్. చిత్ర వెల్లడించారు.

56

చిత్రకు ఇలా గాయం అయ్యిందని తెలిసి అభిమానులు కంగారు పడుతున్నారు. ఎప్పుడూ నవ్వుతూ ఉండే తమ అభిమాన గాయని ఇలా చేతికి కట్టుతో కనిపించడంతో ఫ్యాన్స్ బాధపడుతున్నారు. చిత్ర త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా వేదికగా కోరుకుంటున్నారు. ఆమె ఆరోగ్యంగా ఉండి..ముందు ముందు కూడా మంచి మంచి పాటలతో అలరించాలని కోరుకుంటున్నారు.

66

చిత్రకు గతంలో కంటే ఇప్పుడు కాస్త పాటల ప్రవాహం తగ్గిపోయింది. ఎక్కువగా లైవ్ ప్రోగ్రామ్స్ ఇస్తున్నట్టు తెలుస్తోంది. గతంలో బాలు, చిత్ర జోడీ సాంగ్స్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యేవి. వీరి పాట లేకుండా సినిమా ఉండేది కాదు. కాని రాను రాను మారుతున్న ట్రెండ్ కు తగ్గట్టు ఫాస్ట్ బీట్ సాంగ్స్ పెరిగిపోయాయి. యంగ్ సింగర్స్ కు అవకాశాలు పెరిగాయి. దాంతో చిత్ర పాడగలిగే మెలోడీ సాంగ్స్ తక్కువవ్వడంతో చిత్ర పాటల ప్రవాహం కాస్త తగ్గిందనే చెప్పవచ్చు. ఇప్పటికే ఆమె అన్ని భాషల్లో కలిపి దాదాపు 20 వేలకు పైగా పాటలు పాడారు.

Read more Photos on
click me!

Recommended Stories