సునీల్ తన కెరీర్ లో చేసిన బిగ్ మిస్టేక్ ఇదే.. ఆ మూవీ రిజెక్ట్ చేయడంతో నానికి బ్లాక్ బస్టర్ హిట్

Published : Jun 26, 2025, 09:20 AM IST

కొంతకాలం సునీల్ హీరోగా కూడా రాణించాడు. అందాల రాముడు, మర్యాద రామన్న, పూలరంగడు లాంటి విజయాలు సునీల్ కి దక్కాయి.

PREV
15
కమెడియన్ గా సునీల్ ఎంట్రీ

సునీల్ టాలీవుడ్ లోకి కమెడియన్ గా అడుగు పెట్టారు. ఎన్నో చిత్రాల్లో సునీల్ తన హాస్యంతో తెలుగు ప్రేక్షకులకు వినోదాన్ని పంచారు. ఒక దశలో సునీల్ టాలీవుడ్ లో బ్రహ్మానందం, అలీ లాంటి అగ్ర కమెడియన్లకు పోటీ ఇచ్చే స్థాయికి ఎదిగారు. ముఖ్యంగా అప్పట్లో సునీల్ కామెడీ టైమింగ్ యువతను విపరీతంగా ఆకట్టుకునేది. కానీ ఆ తర్వాత సునీల్ హీరోగా టర్న్ తీసుకున్నాడు.

25
హీరోగా సునీల్ కి విజయాలు 

కొంతకాలం సునీల్ హీరోగా కూడా రాణించాడు. అందాల రాముడు, మర్యాద రామన్న, పూలరంగడు లాంటి విజయాలు సునీల్ కి దక్కాయి. దీంతో సునీల్ కామెడీని పక్కన పెట్టి పూర్తి స్థాయిలో హీరోగా మాత్రమే కొనసాగాలని నిర్ణయించుకున్నాడు. అయితే ఆ సమయంలో సునీల్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు అతడి కెరీర్ ని దెబ్బతీసాయి.

అందుకే సునీల్ ఎక్కువ కాలం హీరోగా రాణించలేకపోయారు. సునీల్ హీరోగా చేసిన చిత్రాలు వరుసగా డిజాస్టర్ అవుతూ రావడంతో తిరిగి మళ్ళీ కామెడీ రోల్స్, క్యారెక్టర్ రోల్స్ చేయడం ప్రారంభించారు. హీరోగా సునీల్ చాలా మిస్టేక్స్ చేశారు అని ఇండస్ట్రీలో ప్రచారం ఉంది.

35
సునీల్ మిస్ చేసుకున్న గోల్డెన్ ఛాన్స్ 

సునీల్ హీరోగా ఒక గోల్డెన్ ఛాన్స్ ని మిస్ చేసుకున్నాడు. ఆ చిత్రం కనుక సునీల్ చేసి ఉంటే అతడి కెరీర్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్లి ఉండేదని చెప్పడంలో సందేహం లేదు. ఇంతకీ సునీల్ మిస్ చేసుకున్న అవకాశం ఏంటంటే భలే భలే మగాడివోయ్ మూవీ. ఈ చిత్ర కథని డైరెక్టర్ మారుతి ముందుగా సునీల్ కే చెప్పారట. ఈ విషయాన్ని మారుతి ఓ ఇంటర్వ్యూలో కన్ఫర్మ్ చేశారు.

45
యాక్షన్ సీన్స్ పెట్టమని అడిగిన సునీల్

మారుతి మాట్లాడుతూ భలే భలే మగాడివోయ్ చిత్ర స్టోరీ లైన్ అనుకున్నప్పుడు ముందుగా సునీల్ కి వెళ్లి చెప్పాను. హీరో పాత్రకి మతిమరుపు ఉంటుంది.. దాని చుట్టూ ప్రేమ సన్నివేశాలు, అతడు పడే ఇబ్బందులు ఆధారంగా కథ రెడీ చేస్తున్నానని చెప్పాను. సునీల్ కి మతిమరుపు క్యారెక్టర్ నచ్చింది. కానీ ఇందులో లవ్ సీన్స్ వద్దు. యాక్షన్ ఎలిమెంట్స్ బాగా పెట్టమని సునీల్ కోరాడు.

ఎందుకంటే ఆ టైంలో సునీల్ యాక్షన్ చిత్రాలు ఎక్కువగా చేస్తున్నాడు. ఆడియన్స్ లో యాక్షన్ ఇమేజ్ పెంచుకోవాలనేది సునీల్ కోరిక. కానీ భలే భలే మగాడివోయ్ లాంటి చిత్రంలో యాక్షన్స్ సన్నివేశాలు ఉండడం కరెక్ట్ కాదు అనిపించింది. అందుకే సునీల్ తో వద్దని ఈ కథని నానికి చెప్పినట్లు డైరెక్టర్ మారుతి తెలిపారు.

55
సునీల్ రిజెక్ట్ చేసిన చిత్రంతో బ్లాక్ బస్టర్ కొట్టిన నాని

భలే భలే మగాడివోయ్ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది. నాని కెరీర్లో బెస్ట్ మూవీస్ లో ఇది కూడా ఒకటి. ఇలాంటి చిత్రాన్ని సునీల్ మిస్ చేసుకోవడం అతడు చేసిన బిగ్ మిస్టేక్ అనే చెప్పాలి. నువ్వే కావాలి చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన సునీల్ ఆ తర్వాత చిరునవ్వుతో, నువ్వే నువ్వే, నువ్వు నాకు నచ్చావ్, మనసంతా నువ్వే, సొంతం, నువ్వు నేను లాంటి చిత్రాల్లో అద్భుతమైన కామెడీ టైమింగ్ తో అదరగొట్టారు. 

Read more Photos on
click me!

Recommended Stories