
కిరణ్ అబ్బవరం `క` మూవీతో హిట్ అందుకున్నాడు. మళ్లీ హీరోగా ఫామ్‌లోకి వచ్చాడు. ఆ తర్వాత చేసిన `దిల్‌రూబా` ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. రెగ్యూలర్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద డిజప్పాయింట్ చేసింది. ఈ క్రమంలో ఇప్పుడు మరో మూవీతో వస్తున్నారు కిరణ్ అబ్బవరం. `కే ర్యాంప్` అంటూ రచ్చ చేసేందుకు వస్తున్నారు. ఆ చిత్రానికి జైన్స్ నాని దర్శకత్వం వహించగా, హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్ బ్యానర్లపై రాజేష్ దండ, శివ బొమ్మకు సంయుక్తంగా నిర్మించారు. ఇందులో యుక్తి తరేజా హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రం దీపావళి పండుగని పురస్కరించుకుని ఈ నెల 18న విడుదల కాబోతుంది. ఈ క్రమంలో ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ ఆకట్టుకున్నాయి. యూత్‌ఫుల్ కంటెంట్‌తో సినిమా ఉండబోతుందని అర్థమవుతుంది. బోల్డ్ డైలాగ్‌లు, కిస్ సీన్లు పుష్కలంగా ఉన్నట్టు టాక్.
`K-ర్యాంప్`పై అంచనాలు బాగానే ఉన్నాయి. ఈ దీపావళి చిత్రాల్లో మంచి బజ్ ఉన్న మూవీస్‌లో ఇదొకటని చెప్పొచ్చు. ఇందులో కిరణ్ అబ్బవరం కూడా కొత్తగా కనిపిస్తున్నారు. బాడీ లాంగ్వేజ్ పరంగానూ చాలా ఫ్రీగా కనిపిస్తున్నారు. ఓ రకంగా తనలోని మరో కోణం చూపించబోతున్నట్టుగా అనిపిస్తోంది. బోల్డ్ డైలాగ్‌లు, ట్రెండీ అంశాలుండటంతో యూత్‌కి బాగా కనెక్ట్ అవుతున్నాయి. ఇవి సినిమాపై అంచనాలు పెరగడానికి కారణమవుతోంది. ఇప్పటికే సెన్సార్ రిపోర్ట్ వచ్చింది. సెన్సార్ బోర్డ్ `ఏ` సర్టిఫికేట్ ఇచ్చింది. రెండు గంటల ఇరవై నిమిషాల నిడివితో సినిమా ఉంటుందట. సెన్సార్ నుంచి పాజిటివ్ టాక్ వచ్చినట్టు సమాచారం. ఈ క్రమంలో సినిమా ఎలా ఉండబోతుందనేది ఫస్ట్ రిపోర్ట్ బయటకు వచ్చింది. సినిమా యూనిట్ నుంచి తెలుస్తోన్న సమాచారం మేరకు ఈ మూవీ డీసెంట్‌గా ఉండబోతుందట.
టీజర్ లో ఉన్నట్టుగా బోల్డ్ డైలాగ్‌లు ఉండబోవని, ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా చూసేలా ఉంటాయని, ఎంటర్‌టైన్‌మెంట్స్ తోపాటు ఎమోషన్స్ కూడా బలంగా ఉంటాయని టాక్. పైకి యూత్‌ఫుల్, రొమాంటిక్ మూవీగా కనిపించినా, సినిమాలో ఫ్యామిలీ కంటెంట్ చాలా ఉందని కిరణ్ అబ్బవరం చెబుతున్నారు. ఏదీ ఓవర్ బోర్డ్ ఉండదని, ఏది ఎంత ఉండాలో అంతే ఉంటుందని, మంచి దీపావళి పండగ మూవీ అవుతుందని అంటోంది టీమ్. అయితే సినిమా ఫస్ట్ రివ్యూ విషయానికి వస్తే ఫస్ట్ ఆఫ్ ఫర్వాలేదు అనేలా ఉంటుందట. బోర్ లేకుండా సాగుతుందని, ఫన్, పాటలు ఆకట్టుకుంటాయని తెలుస్తోంది. అయితే ఇంటర్వెల్ మాత్రం అదిరిపోయేలా ఉంటుందట. ఇక సెకండాఫ్‌ని హిలేరియస్ ఎంటర్‌టైనర్‌గా సాగుతుందట. క్లైమాక్స్ లో సందేశం కూడా ఉంటుందని తెలుస్తోంది. కిరణ్ అబ్బవరం సినిమాల్లో ఏదో ఒక చిన్నపాటి సందేశం ఉంటుంది. ఇందులోనూ సందేశం ఉంటుందని సమాచారం.
హీరో పాత్ర తీరుతెన్నులు కొత్తగా ఉంటాయని, యూత్‌కి బాగా కనెక్ట్ అవుతుందని తెలుస్తోంది. నరేష్, వెన్నెల కిశోర్ ట్రాక్ అదిరిపోతుందట. అయితే సినిమాలో హీరో బాగా రిచ్ అని, కానీ అవన్నీ వదిలేసి అవారాగా బిహేవ్ చేస్తుంటాడని, అలా ఆయన ఎందుకు చేస్తున్నాడు? ఆయనలో వచ్చిన రియలైజేషన్ ఏంటి? ఆయన ఫ్యామిలీ కథేంటనేది ఆసక్తికరంగా ఉండబోతుందని సమాచారం. సైకలాజికల్ సమస్యతో బాధపడే ఒక అమ్మాయి చిల్లర్‌గా తిరిగే రిచ్ కుర్రాడి ప్రేమలో పడితే ఆ తర్వాత పరిణామాలేంటనేది కొత్తగా ప్రయత్నించారని, కాకపోతే అది ఆడియెన్స్ కి ఏవిధంగా కనెక్ట్ అవుతుందనేదాన్ని బట్టి సినిమా ఫలితం ఆధారపడి ఉంటుందని సమాచారం. ఇది మినిమమ్ గ్యారంటీ చిత్రమని టీమ్ చెబుతుంది. దీపావళి విన్నర్ అయ్యే లక్షణాలు ఈ మూవీలో ఉన్నట్టు టాక్. మరి సినిమా నిజంగానే ఆ స్థాయిలో ఆకట్టుకుంటుందా? కిరణ్ అబ్బవరం దీపావళి విన్నర్‌గా నిలుస్తాడా అనేది చూడాలి.