మాస్ మహారాజ రవితేజ ప్రస్తుతం 4 చిత్రాల్లో నటిస్తున్నారు. రవితేజ కంబ్యాక్ ఇవ్వడానికి ఇదే సరైన సమయం. ఒక్కో చిత్రం ఒక్కో జోనర్ లో రూపొందుతుండడంతో ఆసక్తి నెలకొంది.
రవితేజకి ఇటీవల బాక్సాఫీస్ వద్ద సరైన సక్సెస్ లేదు. మిస్టర్ బచ్చన్, ఈగల్, టైగర్ నాగేశ్వర రావు లాంటి చిత్రాలు తీవ్రంగా నిరాశపరిచాయి. కానీ టాలీవుడ్ లో మాస్ చిత్రాలతో పాటు వైవిధ్యమైన కథలతో మెప్పించే హీరోలలో రవితేజ ఒకరు. రవితేజ తదుపరి చిత్రాల లైనప్ ప్రామిసింగ్ గా ఉంది. రవితేజ కంబ్యాక్ ఇవ్వడానికి ఇదే సరైన సమయం అనిపిస్తోంది. ఎందుకంటే రవితేజ నటిస్తున్న తదుపరి నాలుగు చిత్రాలు ఒక్కొక్కటి ఒక్కో జోనర్ లో రూపొందుతున్నారు. ఆ చిత్రాల వివరాలు ఇప్పుడు చూద్దాం.
25
మాస్ జాతర
రవితేజ నటించిన 75వ సినిమా మాస్ జాతర, అక్టోబర్ 31న విడుదల కానుంది. ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను దర్శకుడు భాను భోగవరపు తెరకెక్కిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నాగ వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రవితేజతో పాటు శ్రీలీల, రాజేంద్ర ప్రసాద్, నవీన్ చంద్ర తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
35
RT76 – ఫ్యామిలీ ఎంటర్‌టైనర్
మాస్ జాతర తర్వాత రవితేజ RT76లో నటిస్తున్నారు. ఇది ఫన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి ‘నేను శైలజ’, ‘ఉన్నది ఒకటే జిందగీ’ వంటి సినిమాలతో పేరు తెచ్చుకున్న దర్శకుడు కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో అషికా రంగనాథ్, కేతికా శర్మ హీరోయిన్లుగా నటిస్తున్నారు. స్పెయిన్‌లో షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమాకు భర్త మహాశయులకు విజ్ఞప్తి అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. రాబోయే సంక్రాంతి 2026 సీజన్‌లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
మూడవ ప్రాజెక్ట్ RT77, ఇది శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతోంది. ‘నిన్ను కోరి’, ‘మజిలీ’ వంటి ప్రేమకథలతో ప్రేక్షకుల మన్నన పొందిన శివ నిర్వాణ, ఈసారి రవితేజతో థ్రిల్లర్ డ్రామా చేయబోతున్నారు. ఈ చిత్రంలో రవితేజ వయస్సుకు తగ్గ పాత్రలో కనిపించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది.
55
RT78 – సూపర్ హీరో మూవీ
రవితేజ నాలుగవ ప్రాజెక్ట్ RT78, ఇది సూపర్ హీరో జానర్‌లో తెరకెక్కుతోంది. ఈ సినిమాకు కల్యాణ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆయన గతంలో రూపొందించిన కామెడీ డ్రామా ఫ్రాంచైజీ ‘MAD’తో మంచి పేరు తెచ్చుకున్నారు. ఈ సినిమాను కూడా నాగ వంశీ నిర్మించనున్నారు.