అతనో సీనియర్ నటుడు, సినిమా ఫ్యామిలీ నుంచి వచ్చాడు, అద్భుతమైన నటన, వాయిస్, టాలెంట్ ఉన్నా కానీ... సరైన పాత్రలు మాత్రం ఎవరు ఇవ్వలేదంటూ అసంతృప్తితో ఉన్నాడు. ఇంతకీ ఎవరా నటుడు?
ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎంత పెద్ద స్టార్స్ అయినా, ఏదో ఒక విషయంలో అసంతృప్తి కామన్ గా ఉంటుంది. అది పాత్రల విషయంలో కానీ, సినిమాల విషయంలో కానీ, రకరాల విషయాల్లో ఇది ఉంటుంది. అయితే కొంత మందికి చాలా టాలెంట్ ఉన్నా, అనుకున్నంత అవకాశాలు మాత్రం రావు, పలుకుబడి ఉన్నా వారు అనుకున్నది జరగదు. అలాంటి పరిస్థితినే ఫేస్ చేస్తున్నాడు సీనియర్ నటుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్ రవిశంకర్. సినిమా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఈ యాక్టర్ డబ్బింగ్ ఆర్టిస్ట్ గా మాత్రం ఎక్కువ అవకాశాలు పొందారు. నటుడిగా తనను తాను నిరూపించుకునే పాత్రలు ఇవ్వలేదంటున్నాడు రవిశంకర్.
24
ఫ్యామిలీలో అందరు నటులే
రవిశంకర్ సినిమా ఫ్యామిలీ నుంచే వచ్చారు. ఆయన అన్న సాయి కుమార్ టాలీవుడ్ హీరో, డబ్బింగ్ ఆర్టిస్ట్, క్యారెక్టర్ ఆర్టిస్ట్, వీరి తండ్రి శర్మ తెలుగులో వందల సినిమాల్లో నటించి మెప్పించారు. సాయి కుమార్ తల్లి కూడా నటి, సాయి కుమార్ తనయుడు ఆది టాలీవుడ్ లో యంగ్ హీరోగా కొనసాగుతున్నాడు. అయితే సాయి కుమార్ నటుడిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్ రెండు రకాలుగా ఎంతో కెరీర్ ను చూశారు. కానీ ఆయన తమ్ముడైన రవిశంకర్ మాత్రం డబ్బిగ్ ఆర్టిస్ట్ గా మాత్రం ఎక్కువ రాణించారు. నటుడిగా మంచి మంచి పాత్రలు చేయాలని ఉన్నా.. అవకాశాలు అడపాదడపానే రావడంతో.. యాక్టర్ గా రవిశంకర్ బిజీ అవ్వలేకపోయారు.
34
3500 సినిమాల రికార్డు..
రవిశంకర్ గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన ఆవేదన వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ... టాలీవుడ్ లో సగానికి పైగా విలన్స్ కు వాయిస్ ఇచ్చింది నేనే. రాజమౌళి సినిమాల్లో విలన్స్ అందరికి నాదే వాయిస్. దాదాపు 3500 సినిమాలకు పైగా పూర్తయ్యాయి. అందులో నటుడిగా తక్కువ, డబ్బింగ్ ఆర్టిస్ట్ గానే ఎక్కువ. అందరు నా వాయిస్ ను యూస్ చేసుకున్నారు కానీ.. మంచి వేషాలు మాత్రం ఇవ్వలేదు. నాకు నటుడిగా మంచి పాత్రలు చేయాలని ఉంది, కానీ ఆ అవకాశం రాలేదు. '' అని రవిశంకర్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
టాలీవుడ్ లో మంచిమంచి పాత్రలకు రవిశంకర్ డబ్బింగ్ చెప్పారు. మరీ ముఖ్యంగా రాజమౌళి సినిమాల్లో విలన్స్ కు రావిశంకర్ వాయిస్ ఉండాల్సిందే. విక్రమార్కుడు సినిమాలో బావూజీ, సైల్ లో ప్రదీప్ రావత్, సింహాద్రి సినిమాలో నాజర్, బాహుబలి సినిమాలో కట్టప్ప, గుడుంబ శంకర్ సినిమాలో ఆశిష్ విద్యార్ధికి, ఇలా చాలా మంది ప్రముఖ నటులకు రవి శంకర్ డబ్బింగ్ చెప్పారు. ఆయన తండ్రి శర్మ కూడా ఆ కాలంలో ఎంతోమంది నటులకు గాత్రదానం చేశారు. ఇటు సాయి కుమార్ కూడా వేల పాత్రలకు తన డబ్బింగ్ తో ప్రాణంపోశారు. కానీ నటులగా మాత్రం పెద్దగా రాణించలేకపోయారు.