Karthika Deepam: కళ్ళు తిరిగి పడిపోయిన స్వప్న.. దగ్గరుండి చూసుకుంటున్న సౌందర్య!

Published : May 04, 2022, 07:56 AM IST

Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం (Karthika Deepam) సీరియల్ కుటుంబ కథ నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ రోజు మే 4 ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.  

PREV
16
Karthika Deepam: కళ్ళు తిరిగి పడిపోయిన స్వప్న.. దగ్గరుండి చూసుకుంటున్న సౌందర్య!

ఎపిసోడ్ ప్రారంభంలోనే జ్వాల (Jwala) ఆటో లో డీజిల్ అయిపోతుంది. దాంతో జ్వాల చిరాకు పడుతూ ఉంటుంది. ఈ లోపు అటుగా సౌందర్య (Soundarya) కారు వస్తుంది. ఇక జ్వాల సౌందర్య ను హెల్ప్ అడుగుతుంది. కానీ సౌందర్య తనతో వినయంగా అడిగి పిచ్చి కొని మరీ జ్వాల కు తన కారులోని డీజిల్ ఇస్తుంది. 
 

26

ఇక డీజిల్ తీసుకుంటున్న క్రమంలో జ్వాల (Jwala) నానమ్మ నేను అర్జెంట్ పని మీద వెళుతున్నాను కాబట్టి నిన్ను ఫాలో చేయలేకపోతున్నాను. ఎప్పుడూ ఏదో ఒక అడ్డు వస్తూనే ఉంటుంది అని మనసులో అనుకుంటుంది. ఇక డాక్టర్ సాబ్ ముందు నాకు ఏది ముఖ్యం కాదు. ఆయనే నా ప్రపంచం అని నిరూపమ్ (Nirupam) గురించి అనుకుంటుంది.
 

36

మరోవైపు స్వప్న (Swapna) బాగా తలనొప్పి నీరసంగా తూలి పోతూ ఉండగా ఈలోగా అక్కడకు సౌందర్య వెళ్లి పట్టుకుంటుంది. కానీ స్వప్న సౌందర్య పై చిరాకు పడుతుంది. సౌందర్య (Soundarya) పెద్దగా కసురుకుని స్వప్నను బెడ్ పై పడుకోబెడుతుంది. ఇక సౌందర్య తన చేతితో స్వయంగా స్వప్నకు నీళ్లు తాగిస్తుంది.
 

46

ఇక రెస్టారెంట్ కి వెళ్లి నిరూపమ్ (Nirupam) కోసం వెయిట్ చేస్తున్న సౌర్య డాక్టర్ బాబు ఏ విధంగా ప్రపోజ్ చేస్తాడు అని ఆలోచిస్తూ ఉంటుంది. ఈలోపు అక్కడ కు నిరూపమ్ వచ్చి కూర్చుండగా జ్వాల (Jwala) ఓ రేంజిలో ఊహల్లోకి వెళ్ళిపోతుంది.
 

56

మరోవైపు సౌందర్య (Soundarya) స్వప్నను దగ్గరుండి జాగ్రత్తగా చూసుకుంటుంది. ఈలోగా అక్కడకు హిమ (Hima) రాగ ఇంట్లో డాక్టర్ లేడా? వైద్యం కోసం మీ మనవరాలినే పిలిపించాలా అని కోపం పడుతుంది. ఇక హిమ ఆ మాటలు ఏమీ పట్టించుకోకుండా స్వప్న ఆరోగ్య పరిస్థితి ని పరిశీలిస్తుంది.
 

66

ఒకవైపు నిరూపమ్ (Nirupam) జ్వాల నాకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు అని అంటాడు. కానీ ఈ లోపు జ్వాల నేనే మీకు ముందుగా ఒకటి చెప్పాలనుకున్నాను అని అంటుంది. ఇక నిరూపమ్ పర్వాలేదు చెప్పు అని అంటాడు. జ్వాల (Jwala) మనసులోని మాట చెబుతుండగా ఈలోపు అక్కడకు ఎవరో అనుకోకుండా వస్తారు. ఇక ఈ క్రమంలో రేపటి భాగం లో ఏం జరుగుతుందో చూడాలి.

click me!

Recommended Stories