Karthika Deepam: ఊరు వదిలి వెళ్ళిపోతానన్నా శౌర్య.. సౌందర్య, హిమకు షాకిచ్చిన జ్వాల!

Published : Jul 02, 2022, 08:23 AM IST

Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం (Karthika Deepam) సీరియల్ కుటుంబ కథా నేపథ్యం లో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ రోజు జులై 2వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.  

PREV
17
Karthika Deepam: ఊరు వదిలి వెళ్ళిపోతానన్నా శౌర్య.. సౌందర్య, హిమకు షాకిచ్చిన జ్వాల!

 ఈరోజు ఎపిసోడ్ లో స్వప్న(swapna), శోభ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు శోభ ఆంటీ నేను మిమ్మల్ని కొన్ని డౌట్లు అడుగుతాను అని అనడంతో సరే అంటుంది స్వప్న. అప్పుడు శోభ,నిరుపమ్,హిమ లకు పెళ్లి చేసిన తరువాత హిమ(hima) చనిపోయాక మళ్ళీ నాకు నిరుపమ్ కి పెళ్లి చేస్తాను అని మాట ఇచ్చారు కదా.. అది బాగానే ఉంది ఒకవేళ మళ్లీ హిమ బ్రతికితే అప్పుడు పరిస్థితులు ఏంటి ఆంటీ అని అడుగుతుంది.
 

27

హిమకు,నిరుపమ్(Nirupam)మీద ప్రేమ లేదు కానీ ఈ నిరుపమ్ దాని మాయలో పడి జీవితం నాశనం చేసుకుంటున్నాడు అదే నా బాధ అని అంటుంది స్వప్న. అప్పుడు శోభ(shobha)ఆ హిమ నన్ను కాకుండా వేరే వాళ్ళని ఇచ్చి పెళ్లి చేస్తుంది అంటే అందులో ఏదో తిరకాసి ఉంది దాని వెనక ఏదో రహస్యం ఉంది ఆంటీ అనడంతో స్వప్న ఆలోచనలో పడుతుంది. మరొకవైపు  హిమ,జ్వాలా కోసం క్యారేజ్ తీసుకొని వెళ్ళమని సౌందర్య ఆనందరావుకి చెబుతుంది. 
 

37

అప్పుడు వారు జ్వాలా(jwala),పరిస్థితిని తలుచుకుని బాధపడుతూ ఉంటారు. ఇంతలోనే స్వప్న అక్కడికి వచ్చి వారిని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంది. దీనితో వారు టెన్షన్ పడుతూ ఉంటారు. అప్పుడు స్వప్న నాకు తెలియకుండా ఏదో జరుగుతుంది అది నాకు అర్థం కావడం లేదు అని అనడంతో హిమ(hima) అలాగే చూస్తూ ఉండిపోతుంది. ఇంతలోనే జ్వాలా ఫోన్ చేయడంతో వాళ్ళు టెన్షన్ పడుతూ ఉంటారు.
 

47

ఆ తరువాత సౌందర్య(soundarya)ఆనంద్ రావ్ లు జ్వాలా ఇంటికి వెళ్తారు. మరొకవైపు నిరుపమ్ శుభలేఖ చూసి మురిసిపోతూ ఉండగా ఇంతలో శోభ ఫోన్ చేసి నీ పెళ్లికి ఏం గిఫ్ట్ కావాలి అని అడుగుతుంది. అప్పుడు నిరుపమ్(Nirupam)నువ్వు పెళ్ళికి కావడమే పెద్ద గిఫ్ట్ అని అనగా వెంటనే శోభ తన మనసులో మన పెళ్లికె అందరివి వచ్చేలా చేస్తాను అని అనుకుంటూ ఉంటుంది.

57

 అప్పుడు నిరుపమ్,వర్మ అని నాకు తెలిసిన ఫ్రెండ్ కెనడాలో ఉంటున్నాడు ఇండియాకు త్వరలోనే రాబోతున్నాడు అతను నీకు బాగా సూట్ అవుతాడు అని అనడంతో శోభ(shobh) ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఆ తరువాత శోభ, స్వప్న దగ్గరికి వచ్చి జరిగిన విషయం చెప్పడంతో స్వప్న(swpana) షాక్ అవుతుంది. అప్పుడు వారిద్దరు ఆ విషయం గురించి ఆలోచిస్తు ఉంటారు. అప్పుడు శోభ, ఎలా అయినా ఈ పెళ్లిని ఆపండి అని అంటుంది.
 

67

అప్పుడు శోభ(shobha) అసలు విషయం చెప్పలేక లోలోపల కుమిలిపోతూ ఉంటుంది. మరొకవైపు జ్వాలా,సౌందర్య ఆనంద్ రావ్ లు ముగ్గురు కలిసి భోజనం చేస్తూ ఉంటారు. అప్పుడు భోజనం చేస్తూ జ్వాలా ఆలోచిస్తూ ఉండగా అప్పుడు సౌందర్య ఆనందరావు (anand rao)లు దైర్యం చెబుతారు. అప్పుడు జ్వాలా,నిరుపమ్ గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది.
 

77

అప్పుడు హిమ(hima) పై సీరియస్ అవుతూ మాట్లాడడంతో సౌందర్య ఆనంద్ రావులు ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతారు. అప్పుడు జ్వాల(jwala) నా మనసు విరిగిపోయింది ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను అనగా వెంటనే సౌందర్య ఆనందరావు లు ఎక్కడికి వెళ్తావు అని బాధపడుతూ ఉంటారు. రేపటి ఎపిసోడ్ లో జ్వాల అనుకోకుండా నిరుపమ్ దగ్గరికి వెళ్లి 500 చిల్లర ఇవ్వమని అడుగుతుంది. ఆ తరువాత నిరుపమ్ ఇచ్చిన ఆ డబ్బులను ఎప్పటికి ఖర్చు చేయను అలాగే పెట్టుకుంటాను అని బాధపడుతూ ఉంటుంది జ్వాలా. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.

click me!

Recommended Stories