Telugu

ధురంధర్ కథ కాపీ ఆరోపణలు..

రణవీర్ సింగ్ నటించిన 'ధురంధర్: ది రివెంజ్' సినిమా కథ తనదేనని నిర్మాత సంతోష్ కుమార్ ఆరోపించారు. ఈ వివాదం ఇప్పుడు కోర్టుకు చేరడంతో బాలీవుడ్‌లో కలకలం రేగింది.
Telugu

డి-సాహెబ్' స్క్రిప్ట్‌ను కాపీ కొట్టారా?

2023లో తాను రిజిస్టర్ చేయించిన స్క్రిప్ట్‌ను ఆదిత్య ధర్ కాపీ కొట్టి 'ధురంధర్' తీశారని, తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని సంతోష్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.
Image credits: instagram
Telugu

రెండు కథల మధ్య పోలికలు

తన కథలోని మాజీ సైనికాధికారి కొడుకు ప్రతీకారం, 'రా' ఏజెంట్‌గా మారడం వంటి ప్రధాన అంశాలనే తీసుకుని, దానికి రాజకీయ రంగు పులిమి సినిమా తీశారని సంతోష్ ఆరోపించారు.
Image credits: instagram
Telugu

ఆరోపణలు ఖండించిన ఆదిత్య ధర్

నిరాధార ఆరోపణలతో సినిమా ఇమేజ్ ను దెబ్బతీయవద్దని, ఇలాగే కొనసాగితే కఠిన చర్యలు తప్పవని దర్శకుడు ఆదిత్య ధర్ తన న్యాయవాది ద్వారా హెచ్చరించారు.

Image credits: instagram
Telugu

బెదిరింపులకు భయపడను

ఆదిత్య ధర్ పంపింది నోటీస్ కాదని, కేవలం బెదిరింపు ఇమెయిల్ అని, ఈ కేసును న్యాయస్థానానికి తీసుకెళ్తానని సంతోష్ కుమార్ స్పష్టం చేశారు. ఈ 'కథా యుద్ధం' హాట్ టాపిక్‌గా మారింది.
Image credits: X/@AdityaDharFilms

Top 5 Disasters: నిర్మాతలను ముంచేసిన టాలీవుడ్‌ టాప్‌ 5 డిజాస్టర్లు ఇవే

ఫ్లాప్ హీరోయిన్ కెరీర్ కి ఊపిరి పోసిన బాలయ్య, సినిమాలన్నీ డిజాస్టర్స్

80 Actress: 80ల నాటి హీరోయిన్లు ఇప్పుడు ఎలా ఉన్నారో చూస్తే మతిపోతుంది

గుడ్‌ న్యూస్‌ చెప్పిన రష్మిక, విజయ్‌.. పెళ్లైన నెలకే ముగ్గురు