Karthika Deepam: నిన్ను కాసేపు కూడా భరించలేను.. వెళ్ళిపో అంటూ జ్వాలపై శివాలెత్తిన సౌందర్య!

Published : May 03, 2022, 07:52 AM IST

Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం (Karthika Deepam) సీరియల్ కుటుంబ కథ నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ రోజు మే మూడవ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

PREV
16
Karthika Deepam: నిన్ను కాసేపు కూడా భరించలేను.. వెళ్ళిపో అంటూ జ్వాలపై శివాలెత్తిన సౌందర్య!

ఎపిసోడ్ ప్రారంభంలోనే జ్వాల (Jwala) మీ మనవరాలు బొమ్మ సంగతేమిటని సౌందర్య (Soundarya) ను అడుగుతుంది. ఇక సౌందర్య ఆర్టిస్ట్ ఫోన్ చేస్తే తీయడం లేదు ఇక నేనే వెళ్లి తెచ్చుకోవాలి అని చెబుతుంది. జ్వాల నేనే సౌర్య ను అని నాకు చెప్పాలని అనిపించినప్పుడే నీ దగ్గరికి వస్తాను అని మనసులో అనుకుంటుంది.
 

26

ఇక సౌందర్య (Soundarya) అక్కడి నుంచి ఆర్టిస్ట్ దగ్గర బొమ్మ కలెక్ట్ చేసుకోడానికి వెళ్తుంది. దాంతో జ్వాల (Jwala) నానమ్మ నా బొమ్మను ఎక్కడ చూస్తుందో అన్న భయంతో ఆమె కూడా వెళుతుంది. సౌందర్య నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి అని అడగగా..  మేము కూడా  బొమ్మ గీయిస్తున్నాం అని జ్వాల అంటుంది.
 

36

ఆ తర్వాత సౌందర్య (Soundarya) గీత కోసం వెళ్లగా గీత అన్నీ ఖాళీ చేసి వెళ్ళిపోయింది అని తెలుస్తుంది. ఇక సౌర్య.. మనవరాలి మీద ప్రేమ కన్నా మనవరాలి బొమ్మతోనే ఎక్కువ అవసరం ఉన్నట్టుంది అని అంటుంది. దాంతో సౌందర్య సౌర్య పై మండి పడుతుంది. మరోవైపు హిమ (Hima) జ్వాల కోసం తన ఇంట్లో వెయిట్ చేస్తూ ఉంటుంది.
 

46

ఇక ఇంటికి వచ్చిన జ్వాల (Jwala) ఆ ఆర్టిస్ట్ ఇల్లు వదిలి వెళ్ళిపోయిందట ఇక పాత కాగితాలు అన్నీ చెత్త పేపర్లు కొనే వాడికి ఇచ్చేసారు అని చెబుతుంది. దాంతో హిమ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుంటూ సంతోషంగా కనిపిస్తుంది. మరోవైపు నిరూపమ్ (Nirupam) హిమ కు నా ప్రేమను చెప్పే విషయం లో జ్వాల హెల్ప్ తీసుకోవడం కరెక్ట్ అని తనకు కాల్ చేస్తాడు.
 

56

ఇక జ్వాల (Jwala) నిరూపమ్ కాల్ చూడగా తెగ హడావిడి పడుతూ నేను పూర్తిగా డాక్టర్ సాబ్ ప్రేమలో పడిపోయాను అను అనుకుంటుంది. ఇక నిరూపమ్.. (Nirupam) జ్వాల ను ఒక చోట కలుద్దాం అంటాడు. ఇక కలవటానికి వెళుతున్న జ్వాలా ఆటో డీజిల్ లేక ఒక చోట ఆగి పోతుంది.
 

66

ఇక తరువాయి భాగం లో అనుకోకుండా జ్వాల (Jwala) కు సౌందర్య ఎదురు పడుతుంది. ఇక జ్వాల తనని డీజిల్ ఇవ్వమని అడుగుతుంది. సౌందర్య (Soundarya) అడిగిన వెంటనే ఏ మాత్రం ఆలోచించకుండా తన కారులో ఉన్న డీజిల్ ను షేర్ చేస్తుంది. కాగా రేపటి భాగం లో ఎం జరుగుతుందో చూడాలి.

click me!

Recommended Stories