Acharya effect: కుంగదీసిన రాధేశ్యామ్, ఆచార్య.. ప్రభాస్, రాంచరణ్ ఎలా బయటపడబోతున్నారంటే..

Published : May 03, 2022, 06:54 AM IST

కోవిడ్ ఎఫెక్ట్ నుంచి బయట పడుతూ చిత్ర పరిశ్రమ వరుస చిత్రాలతో దూసుకుపోతోంది. ఈ క్రమంలో టాలీవుడ్ కొన్ని మెరుపులు మరికొన్ని మరకలు ఎదురవుతున్నాయి. అఖండ, పుష్ప, భీమ్లా నాయక్, ఆర్ఆర్ఆర్ చిత్రాలు విజయం సాధించాయి. రాధే శ్యామ్, ఆచార్య చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. 

PREV
16
Acharya effect: కుంగదీసిన రాధేశ్యామ్, ఆచార్య.. ప్రభాస్, రాంచరణ్ ఎలా బయటపడబోతున్నారంటే..

కోవిడ్ ఎఫెక్ట్ నుంచి బయట పడుతూ చిత్ర పరిశ్రమ వరుస చిత్రాలతో దూసుకుపోతోంది. ఈ క్రమంలో టాలీవుడ్ కొన్ని మెరుపులు మరికొన్ని మరకలు ఎదురవుతున్నాయి. అఖండ, పుష్ప, భీమ్లా నాయక్, ఆర్ఆర్ఆర్ చిత్రాలు విజయం సాధించాయి. రాధే శ్యామ్, ఆచార్య చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. ఈ రెండు చిత్రాలు ఊహించని విధంగా దారుణమైన పరాజయాన్ని ఎదుర్కోన్నాయి. 

 

26

ప్రభాస్ హస్తసాముద్రిక నిపుణుడిగా నటించిన రాధే శ్యామ్ చిత్రం ఎమోషనల్ అండ్ థ్రిల్లింగ్ లవ్ స్టోరీగా తెరకెక్కింది. కానీఈ చిత్రం ప్రేక్షకులని ఏమాత్రం మెప్పించలేకపోయింది. ఈ చిత్రం తర్వాత ప్రభాస్ తన షూటింగ్స్ కి కొంత గ్యాప్ ఇచ్చారు. ప్రభాస్ వెకేషన్ కి వెళ్లారని, కాలికి చిన్న సర్జరీ జరిగిందని వార్తలు వచ్చాయి. 

 

36

ఏది ఏమైనా ప్రభాస్ తిరిగి షూటింగ్స్ తో బిజీ కాబోతున్నాడు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న వరల్డ్ క్లాస్ మూవీ ప్రాజెక్ట్ కె (వర్కింగ్ టైటిల్). ఈ చిత్ర కొత్త షెడ్యూల్ హైదరాబాద్ లో షురూ కానుంది. త్వరలో స్టార్ట్ కాబోతున్న ఈ షెడ్యూల్ లో ప్రభాస్ పాల్గొనబోతున్నాడు. రాధే శ్యామ్ ఇచ్చిన షాక్ నుంచి బయట పడుతూ యంగ్ రెబల్ స్టార్ తన వర్క్ తో బిజీ కాబోతున్నాడు. 

 

46

దాదాపు ఇదే పరిస్థితి రాంచరణ్ ది కూడా. ఆర్ఆర్ఆర్ చిత్రం ఇచ్చిన హై జోష్ ని ఆచార్య అమాంతం తగ్గించేసింది. తన తండ్రితో ఎంతో ఇష్టపడి నటించిన ఆచార్య చిత్రం బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మారబోతోంది. తొలి రోజు నుంచే ఆచార్య చిత్రం నెగిటివ్ టాక్ మూటగట్టుకున్న సంగతి తెలిసిందే. 

 

56

ఆచార్య ఫలితం ఇలా అవుతుందని ఎవ్వరూ ఊహించలేదు. కొరటాల దర్శకత్వంలో తెరకెక్కిన ఆచార్య తీవ్రంగా నిరాశపరిచింది. ఈ షాక్ నుంచి రాంచరణ్ కూడా బయటపడేందుకు ప్రయత్నిస్తున్నాడు. ప్రస్తుతం రాంచరణ్ శంకర్ దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. 

 

66

ఈ చిత్ర కొత్త షెడ్యూల్ వైజాగ్ లో ప్రారంభం కాబోతోంది. ఆచార్య పరాజయ భారాన్ని పక్కన పెట్టి చరణ్ ఈ షెడ్యూల్ లో బిజీ కాబోతున్నాడు. ఇప్పటికే రాజమండ్రి, అమృత్ సర్ ప్రాంతాల్లో ఈ చిత్రానికి సంబందించిన కీలక షెడ్యూల్స్ పూర్తయ్యాయి.  

 

Read more Photos on
click me!

Recommended Stories