కల్కిలో ప్రభాస్ ది నెగిటివ్ రోలా... బిల్లా, సాహూ రిజల్ట్ రిపీట్ కాదు కదా, ఇవిగో ఆధారాలు!

First Published | Jun 17, 2024, 7:22 PM IST

కల్కి మూవీలో ప్రభాస్ పాత్ర నెగిటివ్ షేడ్స్ కలిగి ఉంటుందని తెలుస్తోంది. ట్రైలర్ తో పాటు విడుదలైన సాంగ్ పరిశీలిస్తే ఈ విషయం అవగతం అవుతుంది. మరి కల్కి మూవీలో ప్రభాస్ పాత్ర ఎలా ఉండనుందో చూద్దాం.. 
 


ప్రభాస్ నెగిటివ్ షేడ్స్ కలిగిన పాత్రలు చేసింది చాలా తక్కువ. ఒకటి రెండు చిత్రాల్లో ఆయన నెగిటివ్ షేడ్స్ తో కూడిన రోల్స్ చేశాడు.  సాహో చిత్రంలో ప్రభాస్ రోల్ చివరి వరకు నెగిటివ్ షేడ్స్ లో సాగుతుంది. అలాగే బిల్లా మూవీలో కూడా ప్రభాస్ నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్ చేశాడు. గ్యాంగ్ స్టర్ బిల్లా వెపన్స్ సప్లై చేస్తూ ఇల్లీగల్ వ్యవహారాలు ప్రోత్సహిస్తాడు. 
 


కల్కి మూవీలో మరోసారి ఈ తరహా పాత్ర చేస్తున్నాడనే భావన కలుగుతుంది. ట్రైలర్ మనం గమనిస్తే... భైరవ(ప్రభాస్) లక్ష్యం ఒక్కటే. కాంప్లెక్స్ అనే ప్రపంచానికి వెళ్ళాలి. అందుకు వన్ మిలియన్ యూనిట్స్ కావాలి. వాటిని ఎలా సంపాదించాలి అనే ఆలోచనలో ఉంటాడు. వాటి కోసం ఎలాంటి పనులైనా చేస్తాడు. 



కాంప్లెక్స్ కి అధిపతి యాస్కిన్. అతడు విలన్. యాస్కిన్ కి పద్మ(దీపికా పదుకొనె) కావాలి. ఆమె కడుపులో పెరుగుతున్న బిడ్డ కావాలి. పద్మకు రక్షకుడిగా అశ్వద్ధామ(అమితాబ్) ఉంటాడు. తన స్వార్థం కోసం భైరవ విలన్ యాస్కిన్ కి పద్మను అప్పగిస్తానని మతిస్తాడు. 
 


ఈ క్రమంలో భైరవ-అశ్వద్ధామ మధ్య యుద్ధం చోటు చేసుకుంటుంది. ఈ సన్నివేశాలు, కథ పరిశీలిస్తే ప్రభాస్ పాత్రలో నెగిటివ్ కోసం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. నేడు విడుదలైన భైరవ యాంథమ్ తో ఇంకా క్లారిటీ వచ్చేసింది. ఆ సాంగ్ లో లిరిక్స్ గమనిస్తే... తన సుఖం, తన లక్ష్యం కోసమే బ్రతికే స్వార్ధపరుడిగా భైరవ పాత్ర గురించి చెప్పారు . 
 

Kalki 2829 AD


కాబట్టి కల్కి మూవీలో ప్రభాస్ రోల్ నెగిటివ్ గా సాగుతుంది. కల్కి కి రెండవ భాగం కూడా ఉందని సమాచారం. పార్ట్ 2లో ప్రభాస్ రోల్ నెగిటివ్ నుండి పాజిటివ్ కి టర్న్ అయ్యే సూచనలు కలవు. నెగిటివ్ షేడ్స్ లో ప్రభాస్ ని ఆడియన్స్ పెద్దగా అంగీకరించలేదు. బిల్లా యావరేజ్ రిజల్ట్ అందుకుంది. సాహో తెలుగులో ప్లాప్ అయ్యింది. 
 

Kalki 2829 AD Trailer

మరి కల్కి విషయంలో ఏమవుతుందో చూడాలి. కల్కి జూన్ 27న వరల్డ్ వైడ్ విడుదల చేస్తున్నారు. వైజయంతీ మూవీస్ బ్యానర్ లో రూ. 500 కోట్లకు పైగా ఖర్చుతో నిర్మించారు. మైథాలజీ, సైన్స్ ఫిక్షన్ జోడించి కల్కి తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు నాగ్ అశ్విన్. 
 

Latest Videos

click me!