హైపర్ ఆదికి సరైన మొగుడు... డామినేషన్ ఓ రేంజ్ లో ఉందిగా!

First Published Jun 17, 2024, 5:28 PM IST

బుల్లితెర మీద ఆధిపత్యం సాగిస్తున్న హైపర్ ఆదికి సరైన మొగుడు ఆ వ్యక్తి అన్న వాదన వినిపిస్తోంది. అందరినీ డామినేట్ చేసే హైపర్ ఆదిని ఆమె డామినేట్ చేస్తుంది. 
 

బుల్లితెర తెర మీద హైపర్ ఆదికి తిరుగు లేదు. షో ఏదైనా డామినేషన్ ఆదిదే. అందుకు కారణం పంచులు ఆయన నోటి నుండి ప్రవాహంలా వస్తాయి. జబర్దస్త్ వేదికగా హైపర్ ఆది పాపులారిటీ రాబట్టాడు. రైజింగ్ రాజు, శాంతి స్వరూప్ ల మీద హైపర్ ఆది వేసే జోకులు విపరీతంగా నవ్వులు పూయించాయి. 

Hyper Aadi

హైపర్ ఆది కారణంగా జబర్దస్త్ రేటింగ్ విపరీతంగా పెరిగింది. దాంతో మల్లెమాల సంస్థ ప్రొడ్యూస్ చేస్తున్న మరో రెండు ప్రోగ్రామ్స్ లో కూడా హైపర్ ఆది ఉండేలా ప్లాన్ వేశాడు. ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీ షోలలో హైపర్ ఆది తన మార్క్ కామెడీతో ఆకట్టుకుంటున్నాడు. 
 


ప్రస్తుతం జబర్దస్త్ లో హైపర్ ఆది లేడు. అయితే ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీ షోలలో మనోడు సత్తా చాటుతున్నాడు. ఈ రెండు షోలలో డామినేషన్ హైపర్ ఆదిదే. అతడే ప్రత్యేక ఆకర్షణ. ఒకప్పుడు ఢీ లో సుడిగాలి సుధీర్, యాంకర్ ప్రదీప్ సైతం ఉండేవారు. ఈ ముగ్గురు కాంబినేషన్ సూపర్ సక్సెస్ అని చెప్పాలి. 


ఢీ సెలబ్రిటీ స్పెషల్ సీజన్ 2 ఇటీవల ప్రారంభం అయ్యింది. యాంకర్ గా నందు వ్యవహరిస్తున్నాడు. ప్రదీప్ హీరోగా సినిమా చేస్తున్నాడని సమాచారం. ఈ కారణంగా యాంకరింగ్ కి కొంచెం బ్రేక్ ఇచ్చాడు. ఢీ లేటెస్ట్ సీజన్ కి జడ్జిగా హన్సిక ఎంట్రీ ఇచ్చింది. గతంలో ఈమె ఢీ షో జడ్జిగా చేసింది లేదు. 

హన్సిక, శేఖర్ మాస్టర్, గణేష్ మాస్టర్ జడ్జీలు వ్యవహరిస్తున్నారు. కాగా హైపర్ ఆదికి హన్సిక ఇచ్చే కౌంటర్లు గట్టిగా పేలుతున్నాయి. ఇన్నాళ్లకు హైపర్ ఆదికి సరైన మొగుడు వచ్చిందన్న వాదన వినిపిస్తోంది. తాజా ఎపిసోడ్లో హన్సిక హైపర్ ఆది నోరు మూయించింది. నాకు నచ్చలేదన్న హైపర్ అది కామెంట్ కి కౌంటర్ ఇచ్చింది.

హన్సిక నాకు ఇది నచ్చలేదని హైపర్ ఆది అన్నాడు. డోంట్ జడ్జ్ ది జడ్జ్... జడ్జ్ విల్ జడ్జ్ యు, అని ఇంగ్లీష్ డైలాగ్ కొట్టింది. హైపర్ ఆదికి ఏం మాట్లాడాలో తెలియక అలానే ఉండిపోయాడు. నోరెళ్లబెట్టాడు. డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ మరో మరో డైలాగ్ వేసింది. అందరినీ తన పంచ్ లతో అల్లాడించే హైపర్ ఆదిని హన్సిక తొక్కేయడం గమనార్హం.. 

Latest Videos

click me!