మహేష్ బాబు కంటే నమ్రత వయసులో అంత పెద్దదా..! ఇది ఊహించని ట్విస్ట్!

First Published | Aug 9, 2024, 1:59 PM IST

సాధారణంగా భర్త కంటే భార్య వయసులో చిన్నదై ఉంటుంది. కానీ మహేష్ బాబు తన కంటే చాలా పెద్ద వయసున్న నమ్రతను వివాహం చేసుకున్నాడు. వీరిద్దరి ఏజ్ గ్యాప్ తెలిస్తే షాక్ అవుతారు.
 


మహేష్ బాబు కెరీర్ బిగినింగ్ లోనే ప్రేమలో పడ్డాడు. హీరోగా ఆయన మూడో చిత్రం వంశీ. 2002లో విడుదలైంది. వంశీ మూవీ హీరోయిన్ నమ్రత శిరోద్కర్ ని మహేష్ బాబు వివాహం చేసుకున్నారు. దర్శకుడు బీ గోపాల్ తెరకెక్కించిన వంశీ షూటింగ్ విదేశాల్లో జరుగుతుందట. అదే చివరి షెడ్యూల్ అట. షూటింగ్ కంప్లీట్ అయితే కలవడం కుదరదు. 
 

తమ ప్రేమను మహేష్ బాబు-నమ్రత వంశీ మూవీ సెట్స్ లో పరస్పరం వ్యక్తం చేసుకున్నారట. అయితే ప్రేమికులుగా కొన్నాళ్ళు ప్రయాణం చేయాలని భావించారు. అప్పుడు ఇద్దరికీ లోతైన అవగాహన కుదురుతుంది. ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకున్నాకే పెళ్లి చేసుకోవాలని అనుకున్నారట. కారణం ఇద్దరి నేపధ్యాలు పూర్తిగా విరుద్ధం. 


నాలుగేళ్లకు పైగా మహేష్ బాబు- నమ్రత రిలేషన్ లో ఉన్నారు. అనంతరం పెళ్లి చేసుకోవాలని అనుకున్నారట. మహేష్ లవ్ మేటర్ అక్క మంజులకు తెలుసట. నమ్రత, మహేష్, మంజుల తరచుగా కలుస్తూ ఉండేవారట. కాగా నమ్రతతో వివాహానికి కృష్ణ ఒప్పుకోలేదట. అయితే మంజుల తండ్రి కృష్ణను ఒప్పించి మహేష్-నమ్రతల వివాహం జరిగేలా ప్రయత్నం చేసిందట. 
 


2005లో మహేష్-నమ్రతల వివాహం అత్యంత నిరాడంబరంగా జరిగింది. మీడియాకు కూడా సమాచారం లేదు. మహేష్ పెళ్లి వార్త జనాలకు షాక్ ఇచ్చింది. కాగా మహేష్ కంటే నమ్రత వయసులో పెద్దది కావడం విశేషం. 1975 ఆగస్టు 9న పుట్టిన మహేష్ ప్రస్తుత వయసు 49 ఏళ్ళు. ఇక నమ్రత 1972 జనవరి 22న జన్మించింది. నమ్రత భర్త మహేష్ కంటే 3 సంవత్సరాల 6 నెలలు పెద్దది. 

Mahesh Babu

వివాహం అనంతరం నమ్రత నటనకు గుడ్ బై చెప్పింది. మహేష్ బాబు దంపతులకు గౌతమ్, సితార సంతానం. పిల్లలు పెద్దయ్యే వరకు నమ్రత వారి బాధ్యత తీసుకుంది. ప్రస్తుతం మహేష్ బాబు సలహాదారుగా, బిజినెస్ ఉమన్ గా రాణిస్తుంది. మహేష్ బాబు సక్సెస్ లో నమ్రత పాత్ర కూడా ఉందని అంటారు. టాలీవుడ్ బెస్ట్ కపుల్ గా మహేష్-నమ్రత ఉన్నారు. 
 

Latest Videos

click me!