దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) దర్వకత్వం వహించిన బ్లాక్ బాస్టర్ ఫిల్మ్ ‘ఆర్ఆర్ఆర్’. ఈ చిత్రంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) కలిసి నటించారు. ఉద్యమ వీరులు అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, గొండు బెబ్బులి కొమురం భీం పాత్రలో తారక్ నటించారు. మార్చి 25న రిలీజ్ అయిన ఈ చిత్రానికి వరల్డ్ వైడ్ అదిరిపోయే రెస్సాన్స్ దక్కుతోంది.