NTR Jayanthi:జూనియర్ ఎన్టీఆర్ కు తాత సీనియర్ ఎన్టీఆర్ పేరే పెట్టడం వెనుక రహస్యమేంటో తెలుసా..?

Published : May 28, 2022, 10:59 AM IST

నందమూరి తారక రామారావు ఈ పేరు తెలుగు జాతి మెచ్చిన పేరు.. ప్రతీ తెలుగు వాడు గర్వంగా చెప్పుకునే పేరే. ఇక ఇప్పుడు ఈ పేరుతో స్టార్ హీరోగా వెలుగొందుతున్నాడు జూనియర్ ఎన్టీఆర్. అసలు తారక్ కు ఎన్టీఆర్ పేరు ఎలా పెట్టారు..? ఎవరు పెట్టారు..? ఆ సీక్రేట్ ఏంటీ..? 

PREV
19
NTR Jayanthi:జూనియర్ ఎన్టీఆర్ కు తాత సీనియర్ ఎన్టీఆర్ పేరే పెట్టడం వెనుక రహస్యమేంటో తెలుసా..?

నందమూరి నట వారసత్వాన్ని పెద్దాయన తరువాత బాలకృష్ణ నిలబెడితే.. బాలకృష్ణతో పాటు ఆతరువాత తరంలో జూనియర్ ఎన్టీఆర్ ఇనుమడింపచేస్తున్నాడు. ఎన్టీఆర్ కు ఎంతో మంది మనవళ్లు ఉన్నా.. ఆయన నటవారస్వానికి స్టార్ హోదాతో వన్నె తెచ్చాడు తారక్. 

29

తెలుగు చిత్ర పరిశ్రమకు, తెలుగు రాజకీయాలకు  వన్నెతెచ్చిన మహనీయుడు ఎన్టీఆర్ గారు. ఎన్నో జానపద, పౌరాణిక, సాంఘిక చిత్రాల్లో నటించడమే కాక ఆయా పాత్రల్లో జీవించి తన దివ్య మోహనరూపం తో ఎందరికో స్ఫూర్తినిచ్చారు

39

ఆయన నట వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని నందమూరి ఫ్యామిలీ నుంచి చాలామంది ఇండస్ట్రీ కి వచ్చారు. అయితే సీనియర్ ఎన్టీఆర్ పోలికలతో .. ఇండస్ట్రీలో దూసుకుపోతుంది మాత్రం జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే. పెద్దాయనలా ఉండటం, నటనలో ఏమాత్రం తీసిపోని ప్రతిభతో తారక్ కు బారీగా ఫ్యాన్ బేస్ ఏర్పడింది. 
 

49

అయితే తారక్ కు జూనియర్ ఎన్టీర్ పేరు ఎలా వచ్చింది..? ఆయనకు అంత మంది మనవళ్లు ఉన్నా కాని.. తారక్ కు మాత్రమే ఎన్టీఆర్ అనే పేరు ఎలా వచ్చింది...? ఆ పేరు ఎవరు పెట్టారు అనే విషయం చాలా మందికి తెలియదు. ఈ విషయంలో చాలా మందికి డౌట్ కూడా ఉంది. అసలు ఆ పేరు ఎన్టీఆర్ కు ఎలా వచ్చిందంటే..? 

59

నందమూరి హరికృష్ణ శాలిని  దంపతులకు మే 20,1983 న జూనియర్ ఎన్టీఆర్ పుట్టారు.చిన్నప్పుడే కూచిపూడి లో ప్రతిభ కనబరిచి పలు ప్రదర్శనలు కూడా ఇచ్చారు. తారక్ బ్రహ్మర్షి విశ్వామిత్ర, బాలరామాయణం లాంటి సినిమాల్లో  చైల్డ్ ఆర్టిస్ట్ గా మెప్పించారు. ఇలా చిన్న వయసులోనే  ఎన్నో అద్భుతమైన విజయాలను అందుకున్నారు. 
 

69

జూనియర్ ఎన్టీఆర్ 11ఏళ్ల వయసులో ఉన్నప్పుడు బాగా జ్వరం వచ్చిందట. ఇది తెలుసుకున్న పెద్దాయన తన మనవడు బాగోగుల గురించి తెలుసుకోవడానికి తన పర్సనల్ అసిస్టెంట్ ని హరికృష్ణ  ఇంటికి పంపించారట. అప్పుడు హరికృష్ణ తారక్ ను ఎన్టీఆర్ ఉంటున్న అబిడ్స్ కి తీసుకొచ్చారు. తండ్రి కొడుకులిద్దరు ఎన్టీఆర్ రూమ్ కి వెళ్లారట.లోపలికి వెళ్లగానే కూర్చోమని చెప్పి నీ పేరేంటి బాబు అని అడిగారట పెద్దాయన.  
 

79

జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ.. నా పేరు తారక్ రామ్ అని చెప్పగానే హరికృష్ణ  వైపు చూస్తూ నువ్వు ఎందుకు ఆ పేరు పెట్టావని ప్రశ్నించారట. అమ్మ పేరు, రాముడిపేరు  కలిసేలా, నా కొడుకు ల పేర్లలో ఉండేలా కళ్యాణ్ రామ్, తారక్ రామ్ అని పెట్టాను నాన్నగారు అని హరికృష్ణ బదులిచ్చారట. 
 

89

అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ తో మాట్లాడుతూ భవిష్యత్తులో గొప్ప వాడు అవుతావని దీవించి... కొద్దిసేపటి తర్వాత నీది నా అంశ నాపేరు నీకు ఉండాలి అని నందమూరి తారక రామారావు అని పేరు పెట్టి ఆశీర్వదించారట. అప్పటి నుంచీ తారక్ అనే పేరుతో పాట.. ఎన్టీఆర్ పేరు కూడా కలిసి..  జూనియర్ ఎన్టీఆర్ గా ఫేమస్ అయ్యాడు. 
 

99

ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో స్టార్ డమ్ తో దూసుకుపోతున్న జూనియర్.. వరుసగా హిట్ల మీద హిట్లు కొడుతూ.. దూసుకుపోతున్నాడు. తన పిల్లలకు కూడా తాత పేరు కలిసి వచ్చేలా అభయ్ రామ్, భార్గవ్ రామ్ అని పెట్టాడు ఎన్టీఆర్. 
 

click me!

Recommended Stories