దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికి తెలుసు. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం 1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికి తెలుసు. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం 1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. రాంచరణ్, ఎన్టీఆర్ లని జక్కన్న ప్రజెంట్ చేసిన విధానం అదుర్స్. బ్రిటిష్ కాలం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి జనాలు నీరాజనాలు పట్టారు.
26
ఇక అంతర్జాతీయ స్థాయిలో కూడా ఆర్ఆర్ఆర్ చిత్రానికి అప్లాజ్ లభిస్తోంది. ఆర్ఆర్ఆర్ చిత్రం థియేటర్స్ లో రిలీజైనప్పుడు చాలా మంది హాలీవుడ్ వాళ్ళు ఈ చిత్రంపై ప్రశంసలు కురిపించారు. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ మూవీ ఓటిటిలోకి కూడా వచ్చేసింది. తాజాగా ఈ చిత్రాన్ని హాలీవుడ్ ప్రముఖ నటుడు, రచయిత పాటన్ ఓస్వాల్ట్ వీక్షించారు.
36
అనంతరం వరుస ట్వీట్స్ చేస్తూ ప్రశంసల వర్షం కురిపించారు. ఆర్ఆర్ఆర్ చిత్రంలో హీరోయిజం, అద్భుతమైన యాక్షన్ కి వెర్రెత్తిపోయిన ఓస్వాల్ట్ ఏకంగా 'F*** మైండ్స్' అంటూ కామెంట్స్ చేశారు.
46
'మీ దగ్గర్లో ఉన్న థియేటర్స్ లో ఆర్ఆర్ఆర్ చిత్రం ఆడకపోతే వెంటనే ఓటిటిలో చూసేయండి. వెర్రెత్తించే సినిమా ఇది అంటూ ట్వీట్ చేశాడు. దీనికి ఆర్ఆర్ఆర్ చిత్రం థాంక్యూ అంటూ రిప్లై ఇచ్చింది. ఓస్వాల్ట్ తిరిగి ట్వీట్ చేస్తూ.. 'మీ మైండ్ నెక్స్ట్ లెవల్ లో ఉంది. F*** మైండ్స్.. మిమ్మల్ని సినిమాలు చేయనీయకూడదు అంటూ ఆర్ఆర్ఆర్ టీం, రాజమౌళిని ఆదేశించి ట్వీట్ చేశారు. మీ తదుపరి చిత్రం కోసం ఎదురుచూడలేకున్నా అని ఓస్వాల్ట్ అన్నారు.
56
ఆర్ఆర్ఆర్ చిత్రం అంతర్జాతీయంగా బాహుబలిని మించేలా పాపులర్ అయిందనే చెప్పాలి. రాంచరణ్, ఎన్టీఆర్ లాంటి ఇద్దరు స్టార్ హీరోలతో జక్కన్న విధ్వంస రచనే చేశారు. రాంచరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమురం భీంగా నటించిన సంగతి తెలిసిందే.
66
ఓస్వాల్ట్ మాత్రమే కాదు.. హాలీవుడ్ క్రిటిక్స్, నటులు చాలా మంది ఓటిటిలో ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని చూస్తూ ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు. రోజు రోజుకు జక్కన్న కీర్తి ప్రపంచం నలుమూలల వ్యాప్తిస్తోంది. రాజమౌళి తదుపరి సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే.