NTR: ఎన్టీఆర్ కు నిద్రపట్టనివ్వని ‘యమదొంగ’ఫస్ట్ డే షాకింగ్ టాక్ !

Published : Feb 18, 2025, 07:21 AM IST

  NTR: ఎన్టీఆర్ కెరీర్ లో స్టూడెంట్ నెం 1, ‘సింహాద్రి’ చిత్రాల తర్వాత ఆ రేంజ్ హిట్ కొట్టింది మళ్ళీ యమదొంగ మూవీనే. సోషియో ఫాంటసీ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా కలెక్షన్లు వర్షం కురిపించింది.అయితే సినిమా రిలీజ్ రోజు మాత్రం టాక్ వేరేగా ఉంది. 

PREV
14
 NTR: ఎన్టీఆర్ కు నిద్రపట్టనివ్వని ‘యమదొంగ’ఫస్ట్ డే షాకింగ్ టాక్  !
Jr NTR Yamadonga: A Shocking First-Day Story in telugu


 NTR:  ఎన్టీఆర్ కెరీర్ లో ప్రత్యేకమైన చిత్రం యమదొంగ.  బాహుబలి చిత్రం ఫేమ్‌ ఎస్‌ఎస్‌.రాజమౌళి బాహుబలి,ఆర్.ఆర్ .ఆర్ వంటి  చిత్రాలకి ముందు తెలుగులో తన దర్శకత్వంలో బ్రహ్మాండంగా చెక్కిన చిత్రం యమదొంగ.  

జూనియర్‌ ఎన్టీఆర్‌ హీరోగానూ , మోహన్‌బాబు ప్రధాన పాత్రలోనూ నటించిన ఈ చిత్రంలో నటి కుష్బూ, ప్రియమణి, మమతామోహన్‌దాస్, రంభ మేలి కలయికలో రూపొందిన ఈ చిత్రానికి కీరవాణి సంగీతాన్ని అందించారు. విజయేంద్ర ప్రసాద్‌ కథతో రాజమౌళి 2007లో తెరకెక్కించిన యమదొంగ చిత్రం కమర్శియల్‌గానూ మ్యూజికల్‌గానూ మంచి విజయాన్ని సాధించింది. అయితే ఫస్ట్ డే టాక్ ఎన్టీఆర్ కు నిద్రపట్టనివ్వకుండా చేసిందిట. 

24
Jr NTR Yamadonga: A Shocking First-Day Story in telugu

‘యమదొంగ’కు ముందు ఎన్టీఆర్ సరైన హిట్ లేదు. రాజమౌళితో చేసిన సింహాద్రి నుండి యమదొంగ వరకు మధ్యలో ఎన్టీఆర్ ఆరు సినిమాలు చేశారు. ఆంద్రావాలా, సాంబ, నా అల్లుడు, నరసింహుడు, అశోక్, రాఖీ. వీటిలో సాంబ, రాఖీ చిత్రాలు యావరేజ్ టాక్ తెచ్చుకున్నాయి. మిగతా నాలుగు సినిమాలు ప్లాప్స్ గా నిలిచాయి. వరుస పరాజయాలతో ఉన్న ఎన్టీఆర్ మళ్ళీ రాజమౌళితో జతకట్టి యమదొంగ తీశారు.

ఈ సినిమా కోసం ఎన్టీఆర్ చాలా సన్నబడ్డాడు. ఈ సినిమాలో తన నటనలోని ఇంకో కోణాన్ని చూపించారు. సీనియర్ ఎన్టీఆర్ పౌరాణికం పాత్రల్లో ఆరితేరినవారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ యముడి పాత్రతో మళ్ళీ సీనియర్ ఎన్టీఆర్ ని గుర్తు చేశారు. అందరితో తాతకి తగ్గ మనవడు అనిపించుకున్నాడు.ఈ సినిమాలోని ఒక పాటలో సీనియర్ ఎన్టీఆర్ వచ్చి వెళ్ళేలాగా గ్రాఫిక్స్ చేశారు.  అయితే సినిమాకు మార్నింగ్ షో రిపోర్ట్ పెద్ద గొప్పగా లేదు. ఎన్టీఆర్ కు పట్టున్న కొన్ని ప్రాంతాల నుంచి మాత్రం పాజిటివ్ టాక్ వచ్చింది. 

34
Jr NTR Yamadonga: A Shocking First-Day Story in telugu


‘యమదొంగ’ రిలీజ్ కు ముందు తన వాళ్లతో కలిసి ఎన్టీఆర్ చూసినప్పుడు జస్ట్ ఓకే అనుకున్నారట. యమలోకం వంటివి ఇప్పుడు వర్కవుట్ అవుతాయా అని ఆయన సన్నిహితులు అన్నారట. మోహన్ బాబు డామినేషన్ కనపడుతోంది అని మరికొందరు అన్నారట. అందుకు తగ్గట్లే ‘యమదొంగ’ మార్నింగ్ షో టాక్ సూపర్ హిట్ అని రాలేదు. యావరేజ్, బిలో యావరేజ్ అన్నట్లు వచ్చిందిట. ఇంట్రవెల్ సీన్ మాత్రమే హైలెట్ అని మీడియాలో ప్రచారం మొదలైంది.

అప్పట్లో ఇప్పుడున్నంత సోషల్ మీడియా లేకపోయినా రివ్యూలు వచ్చేవి. ఈ క్రమంలో ఎన్టీఆర్ కు రాత్రి నిద్రపట్టలేదట. అయితే రెండు రోజుల లోపే సినిమా పెద్ద హిట్ అయ్యింది. అందరి అంచనాలను తల క్రిందలు చేసింది.  ఇరవై కోట్లతో నిర్మితమైన ఈ చిత్రం ఫస్ట్ వీక్ లోనే 11 కోట్లు రాబట్టింది.  రాజమౌళి మ్యాజిక్ మెల్లిమెల్లిగా ఎక్కేసింది. ఎన్టీఆర్ డాన్స్ లకు ఫిదా అయ్యిపోయారు. అప్పుడు తన ఫ్రెండ్స్ అందరినీ పిలిచి ఎన్టీఆర్ పెద్ద  పార్టీ ఇచ్చారట. 

44
Jr NTR Yamadonga: A Shocking First-Day Story in telugu


 సోషియో ఫాంటసీ ఇతివృత్తంతో భూలోకం, యమలోకంలో జరిగే జనరంజకంగా రూపొందిన ఈ చిత్రం తమిళంలో విజయన్‌ పేరుతో అనువాదమైంది. ఈ సినిమాలోని ఒక పాటలో సీనియర్ ఎన్టీఆర్ వచ్చి వెళ్ళేలాగా గ్రాఫిక్స్ చేశారు. ఈ సినిమాలో ప్రియమణి హీరోయిన్ గా చేసింది. రెండో హీరోయిన్ గా మమతా మోహన్ దాస్ చేసింది.

యముడి పాత్రలో మోహన్ బాబు మెప్పించారు. ఈ సినిమాలో పాటలు కూడా మంచి విజయం సాధించాయి. సీనియర్ హీరోయిన్ రంభ ఇందులో ఐటెం సాంగ్ చేయడం విశేషం. ఈ సినిమాకి విజయేంద్ర ప్రసాద్ కథని అందించగా, విశ్వామిత్ర క్రియేషన్స్ బ్యానర్ పై ఊర్మిళ గుణ్ణం నిర్మించారు. 

Read more Photos on
click me!

Recommended Stories