Chhaava: రెహమాన్ సరైన పాటలు, నేపథ్య సంగీతం ఇవ్వలేదని నెటిజన్లు చాలామంది మండి పడుతున్నారు. ముఖ్యంగా బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Fans Call AR Rahman Chhaava Music Mediocre in telugu
Chhaava: భారతీయ సినీ సంగీత ప్రపంచానికి ఏ ఆర్ రెహమాన్ ఓ సన్సేషన్. కెరీర్ ప్రారంభంలో అద్బుతమైన హిట్స్ ఇచ్చారు. ఆయన స్వరపరిచిన పాటలు ఇప్పటికీ ఎక్కడో చోట వినపడుతూనే ఉంటాయి. అతి తక్కువ సమయంలోనే సంగీత దర్శకుడిగా తనకంటూ ఓ మార్క్‌ను క్రియేట్ చేసుకున్నారు ఆయన.
రెండు ఆస్కార్ అవార్డులను గెలుచుకొని భారతీయ సినిమాను అంతర్జాతీయ వేదికపైకి తీసుకెళ్లిన ఘనత సైతం రెహ్మాన్ దే. రోజా, బొంబాయి, రంగీలా, తాళ్, లగాన్, రంగ్ దే బసంతి ఇలా ఆయన స్వరాల మ్యాజిక్‌తో మెస్మరైజ్ అయిన సినిమాలు ఎన్నో వున్నాయి. అయితే గత కొంతకాలంగా ఆయన సంగీతం అందించిన పాటలు, సినిమాలు వర్కవుట్ కావటం లేదు. పెద్ద హిట్టైన పాటలు కనపడటం లేదు.పై వివాదాలు తక్కువే.
అయితే ఇప్పుడు ఆయనపై సోషల్ మీడియాలో భయంకరమైన ట్రోలింగ్, విమర్శలు వర్షం కురుస్తోంది. అందుకు కారణం రీసెంట్ బాలీవుడ్ సెన్సేషన్ చిత్రం ‘చావా’. భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రంకి రెహమాన్ సంగీతం అందించారు . గత శుక్రవారమే విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అద్భుతాలు చేస్తోన్న సమయంలో రెహమాన్ పై ట్రోలింగ్ కు కారణమేంటి, అసలేం జరిగింది.
24
Fans Call AR Rahman Chhaava Music Mediocre in telugu
విక్కీ కౌశల్ కెరీర్ లో అత్యంత భారీ ఓపెనింగ్స్ తెచ్చుకున్న సినిమాగా ‘చావా’ నిలిచింది. ముప్పై అయిదు కోట్ల దాకా ఫస్ట్ డే గ్రాస్ వచ్చినట్టు ట్రేడ్ టాక్. అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా ఈ వారం నెంబర్ వన్ పొజిషన్ లో ఉండటంతో ట్రేడ్ ని సంతోషంలో మనిగింది.
వీకెండ్ లో జెన్యూన్ గా వంద కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి.. వీక్ డేస్‌లో కూడా స్ట్రాంగ్‌గా కొనసాగుతోంది. ఈ క్రమంలో ఈ సినిమాకు సంబంధించి అన్ని క్రాఫ్ట్ ల మీదా ప్రశంసలు కురుస్తున్నాయి కానీ.. రెహమాన్ సంగీతం పై మాత్రం విమర్శల వర్షం కురుస్తోంది. ‘చావా’ సినిమాకు అసలు విలన్ రెహమాన్ అని అంటున్నారు.
34
Fans Call AR Rahman Chhaava Music Mediocre in telugu
ఇన్ని విమర్శలకు కారణం ‘చావా’ సినిమాకు రెహమాన్ సరైన పాటలు, నేపథ్య సంగీతం ఇవ్వలేదని అనిపించటమే. ముఖ్యంగా బ్యాగ్రౌండ్ స్కోర్ అసలు బాగోలేదని, తెరపై అద్బుతమైన ఎమోషన్ విజువల్స్ వస్తున్నా, యాక్షన్ ఎపిసోడ్స్ నడుస్తున్నా రెహమాన్ మాత్రం చాలా లైట్ తీసుకున్నాడంటున్నారు.
మ్రొక్కుబడిగా ఈ సినిమాకు సాంగ్స్ ఇచ్చాడని, ఒక్క పాటా కూడా హిట్ కాలేదని తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి హిస్టారికల్ ఫిల్మ్ కు సరిపడే భారతీయ సౌండ్ ఇవ్వకుండా.. మోడర్న్ ఇన్‌స్ట్రుమెంట్స్ వాడి ఎమోషన్ తగ్గించాడని రెహమాన్‌ను విమర్శిస్తున్నారు.అజయ్-అతుల్‌కు సంగీత బాధ్యతలు అప్పగిస్తే పర్ఫెక్ట్‌గా ఉండేదని అభిప్రాయపడుతున్నారు.
44
Fans Call AR Rahman Chhaava Music Mediocre in telugu
ఇదిలా ఉంటే ఇదిలా ఉంటే రాబోయే రామ్ చరణ్ సినిమాకు ఎలాంటి మ్యూజిక్ ఇస్తాడో మరికొందరు ట్వీట్స్ చేస్తున్నారు. గేమ్ ఛేంజర్ రిలీజ్ తర్వాత గ్లోబల్ స్టార్ చరణ్ బుచ్చి బాబు డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడని తెలిసిందే.
స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చరణ్ మరోసారి తన మాస్ స్టామినా చూపించాలని చూస్తున్నాడు. చరణ్ 16వ సినిమాగా రాబోతున్న ఈ మూవీ కోసం బుచ్చి బాబు మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్ ని కావాలని తీసుకున్నారు. దాంతో ఇప్పుడు ఈ సినిమాకు మ్యూజిక్ ఎలా ఇస్తాడో అని కంగారుపడుతున్నారు మెగాభిమానులు.