సమంతకు ప్రపోజ్ చేసిన రోజే శోభితతో ఎంగేజ్మెంట్.. నాగ చైతన్య అలా చేయడానికి కారణం తెలుసా?

First Published | Aug 10, 2024, 10:10 AM IST

సమంతకు నాగ చైతన్య ప్రపోజ్ చేసిన రోజే శోభిత ధూళిపాళ్లతో నిశ్చితార్థం జరుపుకున్నాడట . నాగ చైతన్య అలా చేయడానికి కారణం ఏమిటనే చర్చ మొదలైంది. 
 

నాగ చైతన్య-శోభిత ధూళిపాళ్ల ఎంగేజ్మెంట్ టాలీవుడ్ హాట్ టాపిక్ గా ఉంది. సమంతతో విడాకులు తీసుకున్న నాగ చైతన్య శోభిత ధూళిపాళ్లకు దగ్గరయ్యాడు. కొన్నాళ్లుగా శోభితతో నాగ చైతన్య రిలేషన్ లో ఉన్నాడు. గత రెండేళ్లుగా వీరిద్దరి ఎఫైర్ రూమర్స్ మీడియాలో కథనాలుగా వెలువడుతున్నాయి.

నాగ చైతన్య తరచుగా తన కొత్త ఇంటికి శోభితను తీసుకువెళ్లేవాడట. పలుమార్లు జంటగా విదేశీ టూర్లు ఎంజాయ్ చేశారు. నాగ చైతన్య, శోభిత కలిసి ఉన్న ఫోటోలు సైతం లీక్ అయ్యాయి. శోభితతో ఎఫైర్ రూమర్స్ ఖండిస్తూ వచ్చారు నాగ చైతన్య టీమ్. సడన్ గా నిశ్చితార్థం జరుపుకుని నాగ చైతన్య షాక్ ఇచ్చాడు.  
 


Naga Chaitanya

ఆగస్టు 8న నిరాడంబరంగా కుటుంబ సభ్యుల సమక్షంలో  శోభిత-నాగ చైతన్యల ఎంగేజ్మెంట్ వేడుక ముగిసింది. అయితే ఈ తేదీ చాలా ప్రత్యేకం అట. ఇదే తారీఖున సమంతకు నాగ చైతన్య లవ్ ప్రపోజ్ చేశాడట. ఏమాయ చేసావే సినిమా విడుదలయ్యాక సమంతకు నాగ చైతన్య తన ప్రేమను వ్యక్తం చేశాడట.

సమంతకు ఐ లవ్ యు చెప్పిన తేదీనే శోభితతో నిశ్చితార్థం జరుపుకోవడం వెనుక నాగ చైతన్య ఆంతర్యం ఏమిటనే చర్చ మొదలైంది. బహుశా నాగ చైతన్య సమంత మీద ఆ విధంగా రివేంజ్ తీర్చుకున్నాడా? లేక అది యాదృచ్చికంగా జరిగిందా? అనేది తెలియాలి. 
 

కాగా సమంతతో విడాకులు నాగ చైతన్యను మానసిక వేదనకు గురి చేశాయని నాగార్జున వెల్లడించాడు. శోభిత రాకతో నాగ చైతన్య జీవితంలో తిరిగి సంతోషం వెల్లివిరిసినట్లు ఆయన చెప్పకనే చెప్పాడు. పెళ్ళికి ఇంకా సమయం ఉందని అన్నారు. 
 

Latest Videos

click me!