నచ్చిన వాళ్లు దీన్ని జీర్ణించుకోండి : ఎన్టీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్, ఎవరికి? ఎందుకు

First Published | Oct 5, 2024, 11:24 AM IST

నచ్చిన వాళ్ళు ఈ విషయం  జీర్ణించుకుంటారు, నచ్చని వాళ్లు ఈ విషయాన్ని జీర్ణించుకోవాల్సిన అవసరం లేదు లేదు” అని ఎన్టీఆర్ కాస్త అసహనంగా వార్నింగ్ ఇచ్చే ధోరణిలో  అన్నారు.

ntr, devara, warning, tollywood


ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్ లో , అభిమానుల్లో ఒకటే చర్చ అది ..ఎన్టీఆర్ ఎవరిని ఉద్దేశించి వార్నింగ్ ఇచ్చారా అని. అసలు వార్నింగ్ ఇచ్చేటంత విషయం ఏం జరిగింది అని. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజా చిత్రం ‘దేవర’ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి తెలసిందే.  

కొరటాల శివ ఈ చిత్ర విజయంతో బౌన్స్ బ్యాక్ అయ్యాడు.  జాన్వీ కపూర్ టాలీవుడ్ డెబ్యూ మూవీతోనే సూపర్ హిట్ అందుకుంది. సైఫ్ అలీఖాన్ కు తెలుగులో ఫస్ట్ హిట్ దక్కింది. తొలిరోజు నుండి దేవర భారీ వసూళ్లు రాబట్టడంతో ఈ  భారీ విజయాన్ని పురస్కరించుకుని గ్రాండ్ సక్సెస్ పార్టీ నిర్వహించారు నిర్మాతలు.  ఈ వేదికపై జూనియర్ ఎన్టీయార్ చేసిన కామెంట్స్, వార్నింగ్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. 

devara part 1 one week worldwide box office collection official ntr jr koratala siva telugu movie


ఎన్టీయార్ మాట్లాడుతూ ” ఎన్టీఆర్ ఆర్ట్ కు మూలం అతనే. అయినా అతను ఎప్పుడూ  ముందుకు  రాడు,  చాలా మంది అతనిని సరిగా అర్ధం చేసుకోరు అతడే మా కొసరాజు హరికృష్ణ. ఎవరేమి అన్నా, అనుకున్న సరే ఎన్టీయార్ ఆర్ట్స్ కు మూలస్తంభం హరి. నాకు కళ్యాణ్ అన్నకి స్ట్రెంత్ హరి, నచ్చిన వాళ్ళు జీర్ణించుకుంటారు, నచ్చని వాళ్లు ఈ విషయాన్ని జీర్ణించుకోవాల్సిన అవసరం లేదు లేదు” అని అన్నారు. అయితే ఎవరు హరిని ఏమన్నారు..ఆ విషయం ఎన్టీఆర్ కు చేరి ఎందుకిలా రెస్పాండ్ అయ్యారనే విషయం డిస్కషన్ గా మారింది.


Junior NTRs Devara global collection reports out earns 400 crore rupees


అసలేం జరిగింది

అందుతున్న సమాచారం మేరకు నిర్మాత   హరి వచ్చాకే ఫ్యాన్స్ కు తారక్ కు మధ్య గ్యాప్ వచ్చిందని చాలా కాలం నుంచీ టాక్ ఉంది. హరి ని తీసేయాలని అభిమానులు ఆ మధ్య గొడవ చేసారు. దేవర ప్రి రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అయిన నేపథ్యంలో ఫ్యాన్స్ ‘X’ లో స్పేస్ లు పెట్టి మరి హరిని తిట్టారు. ఈ నేపధ్యంలో సమాధానం  ఈ రూపంలో తారక్ చెప్పాడని టాలీవుడ్ లో   చర్చించుకుంటున్నారు
 

Ntr, Devara, koratala shiva


 దేవర సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న ఎన్టీఆర్
   
ఇక యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం `దేవ‌ర‌` స‌క్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు. ఆ విషయం సక్సెస్ మీట్ లో ఆయనలో కనపడే ఆనందం, ఉద్వేగం తో తెలిసిపోయింది.  దాదాపు  ఆరేళ్ల త‌ర్వాత ఎన్టీఆర్ నుంచి వ‌చ్చిన ఈ సోలో మూవీ.. మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నా ఆశ్చర్యకరంగా బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ల కురుపిస్తోంది.

 ఆ కలెక్షన్స్ ఎన్టీఆర్ కు కొత్తేమీ కాదు. అయితే దేవర నుంచి ఆయన బాగా ఎక్సపెక్ట్ చేసారు. ఆర్.ఆర్.ఆర్ వంటి సక్సెస్ తర్వాత తన సోలో మూవీ కావటంతో ఈ సినిమాపై చాలా ఎక్సపెక్టేషన్స్ పెట్టుకున్నారు. అదే సమయంలో రాజమోళి సినిమా చేసాక డిజాస్టర్స్ ఇస్తారు హీరోలు అనే సెంటిమెంట్ రిపీట్ అవుతుందా అనే భయం ఎక్కడో చోట కొంతైనా ఉంటుంది. అవన్ని ఈ సినిమా సక్సెస్ తీసేసింది.  
 

Ntr, Devara, koratala shiva

 
దేవర కలెక్షన్స్ విషయానికి వస్తే....

వారం రోజుల్లో దేవరకు ఇండియావ్యాప్తంగా రూ. 215.6 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చాయి. వీటిలో తెలుగు నుంచి 164 కోట్లు, హిందీ ద్వారా 44 కోట్లు, కర్ణాటక నుంచి 1.58 కోట్లు, తమిళ వెర్షన్‌కు 4.8 కోట్లు, మలయాళంలో 1.22 కోట్ల నెట్ వసూళ్లు ఉన్నాయి. అలాగే, ఇండియా వైడ్‌గా దేవరకు రూ. 255 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి.

దేవర చిత్రానికి వారం రోజుల్లో ఏపీ, తెలంగాణలో రూ. 122.45 కోట్ల షేర్ కలెక్షన్స్ రాగా.. రూ. 172.25 కోట్ల గ్రాస్ కలెక్ట్ అయింది. అలాగే, వరల్డ్ వైడ్‌గా రూ. 324.25 కోట్ల నెట్ కలెక్షన్స్ వస్తే.. 199.43 కోట్ల షేర్, 342.30 కోట్ల గ్రాస్ వసూళ్లు నమోదు అయ్యాయి. ఇక రూ. 300 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన దేవర సినిమాకు రూ. 182.25 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగి రూ. 184 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఫిక్స్ అయింది.
 

Ntr, Devara, koratala shiva

బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకున్న దేవర

ట్రేడ్ నుంచి అందుతున్న లెక్కలు ప్రకారం అతి తక్కువ రోజుల్లోనే ఈ బ్రేక్ ఈవెన్ టార్గెట్ పూర్తి చేసుకున్న దేవర సినిమా ఇప్పటికీ రూ. 15.43 కోట్ల లాభాలను రాబట్టింది. అలాగే, తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో 153.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్‌కు 155 కోట్లకుపైగా బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను పూర్తి చేసి రూ. 12.15 కోట్ల ప్రాఫిట్ కొల్లగొట్టింది దేవర చిత్రం.

ఇక ఇతర రాష్ట్రాలైన కర్ణాటకలో రూ. 14.85 కోట్లు, తమిళనాడులో 3.85 కోట్లు, కేరళలో 83 లక్షలు, హిందీతోపాటు ఇతర స్టేట్స్‌లో 25.35 కోట్లు, ఓవర్సీస్‌లో 32.10 కోట్ల షేర్ కలెక్షన్స్‌ను దేవర సినిమా ఏడు రోజుల్లో కొల్లగొట్టింది. అలాగే, ఓవర్సీస్‌లో 69.10 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టింది.
 

Latest Videos

click me!