ఎన్టీఆర్‌ రొమాన్స్ చేయాలనుకున్న సీనియర్‌ హీరోయిన్‌ ఎవరో తెలుసా? శ్రీదేవి, సావిత్రి కాదు

Published : May 11, 2025, 02:44 PM ISTUpdated : May 11, 2025, 04:39 PM IST

జూ ఎన్టీఆర్‌ తన మనసులో మాటని వెల్లడించారు. అలనాటి హీరోయిన్లలో ఎవరితో రొమాన్స్ చేయాలని ఉందంటే ఓ క్రేజీ హీరోయిన్‌ పేరుని చెప్పారు. మరి ఆమె ఎవరంటే?  

PREV
15
ఎన్టీఆర్‌ రొమాన్స్ చేయాలనుకున్న సీనియర్‌ హీరోయిన్‌ ఎవరో తెలుసా? శ్రీదేవి, సావిత్రి కాదు
jr ntr

జూ ఎన్టీఆర్‌.. నందమూరి తారక రామారావు మనవడిగా, నట వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. బాల నటుడిగానే అదరగొట్టి ఇప్పుడు పాన్‌ ఇండియా స్టార్‌గా రాణిస్తున్నారు. ప్రస్తుతం వరుసగా పాన్‌ ఇండియా చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో తారక్‌ ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. 

25
Sridevi

ఎన్టీఆర్‌ తనకు ఇష్టమైన అలనాటి హీరోయిన్‌ ఎవరో తెలిపారు. అందరిలాగే శ్రీదేవి ఇష్టమని తెలిపారు. ఫేవరేట్‌ యాక్టర్‌ తాతగారు ఎన్టీఆర్‌ అని, హీరోయిన్‌ శ్రీదేవి అని చెప్పారు. జయప్రదతో గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని పంచుకున్నారు జూ ఎన్టీఆర్‌. 

35
jr ntr

ఈ సందర్భంగా జయప్రద ఒక క్రేజీ ప్రశ్న అడిగింది. అలనాటి హీరోయిన్లలో నటించాల్సి వస్తే ఎవరితో నటిస్తారు అని అడిగారు జయప్రద. ఈ సందర్బంగా వాణిశ్రీ, జయలలిత పేర్లు చెప్పారు. మొదట ఇద్దరితోనూ చేయాలని ఉందని చెప్పిన ఆయన ఆ తర్వాత ఒక పేరునే తీసుకోవాలని చెప్పగా, జయలలితతో రొమాన్స్  చేయాలనుందని చెప్పారు. 

45
jayalalitha movies

జయలలిత నటించిన చాలా సినిమాలు చూశానని, తాతగారితో చేసిన `దేవుడు చేసిన మనుషులు` సినిమాలో ఆమె చాలా అందంగా ఉంటుంది. చాలా బ్యూటీఫుల్‌గా ఉంటుందని చెప్పారు తారక్‌. మొత్తంగా జయలలితతో రొమాన్స్ కి రెడీ అని చెప్పడం విశేషం.

55
Junior NTR

ఎన్టీఆర్‌ చివరగా `దేవర` సినిమాతో ఆడియెన్స్ ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ మూవీ పెద్ద హిట్‌ అయ్యింది. ప్రస్తుతం ఆయన ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో సినిమాలో నటిస్తున్నారు. దీనికి `డ్రాగన్‌` అనే టైటిల్‌ని అనుకుంటున్నారు. అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. దీంతోపాటు హిందీలోకి ఎంట్రీ ఇచ్చి `వార్‌ 2`లో హృతిక్‌ రోషన్‌తో కలిసి నటించారు. ఈ మూవీ ఆగస్ట్ లో రిలీజ్‌ కాబోతుంది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories