ఆసియాలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న సౌత్ ఇండియన్ నటుడు ఎవరు?

Mahesh Jujjuri | Published : May 11, 2025 2:15 PM
Google News Follow Us

ఆసియాలోనే అత్యధిక పారితోషికం అందుకుంటున్న నటుడిగా ఒక సౌత్ ఇండియాన్ స్టార్ హీరో  నిలిచారు. షారుఖ్ ఖాన్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, ప్రభాస్ వంటి వారిని అధిగమించి ఈ ఘనత సాధించిన హీరో ఎవరో తెలుసా? 

14
ఆసియాలోనే అత్యధిక  రెమ్యునరేషన్ తీసుకుంటున్న  సౌత్ ఇండియన్ నటుడు ఎవరు?
ఆసియాలోనే అత్యధిక పారితోషికం అందుకుంటున్న నటుడు

సినిమా రంగంలో ప్రముఖులు ఎక్కువ పారితోషికం అందుకుంటారు. ప్రస్తుతం 72 ఏళ్ల వయసున్న ఒక నటుడు అత్యధిక పారితోషికం అందుకుంటున్నారు. ఆసియాలోనే అత్యధిక పారితోషికం అందుకుంటున్న నటుల్లో ఈయనే అగ్రస్థానంలో ఉన్నారు. బాలీవుడ్ , సౌత్  సినీ రంగంలో చాలా మంది నటులు ఒక్క సినిమాకి వంద కోట్ల రూపాయలకు పైగా పారితోషికం అందుకుంటున్నారు.

24
ఆసియాలోనే అత్యధిక పారితోషికం అందుకుంటున్న నటుడు

ఆయన ఎవరో కాదు సూపర్ స్టార్ రజినీకాంత్. అభిమానుల చేత  తలైవా అని ముద్దుగా పిలుుకునే  స్టార్.   రెమ్యునరేషన్ విషయంలో  రజినీకాంత్ అగ్రస్థానంలో ఉన్నారు. నటన,  సింపుల్ లైఫ్ స్టైల్ లాంటి విషయాలలో  రజినీకాంత్ ను ఇష్టపడనివారు ఉండదరు.  1950 డిసెంబర్ 12న రజినీ జన్మించారు. ఆయన అసలు పేరు శివాజీ రావు గైక్వాడ్. బస్ కండక్టర్ వంటి చిన్న చిన్న ఉద్యోగాలు చేసిన రజినీ నేడు భారతీయ సినీ రంగంలో ఒక దిగ్గజం.

34
సూపర్ స్టార్ రజినీకాంత్

1975లో రజినీకాంత్ 'అపూర్వ రాగంగళ్' అనే తమిళ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశారు. ఆ తర్వాత 'బాషా', 'ఎందిరన్', 'శివాజీ: ది బాస్', '2.0', 'జైలర్' వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించారు. షారుఖ్ ఖాన్, ప్రభాస్, కమల్ హాసన్, జాకీ ష్రాఫ్ వంటి వారిని అధిగమించి భారతదేశంలోనే అత్యధిక పారితోషికం అందుకుంటున్న నటుడిగా ఉన్నారు.

44
నిరంతరం సినిమాల్లో నటిస్తున్న రజినీకాంత్

ప్రస్తుతం లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో, అనిరుధ్ సంగీతంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న 'కూలీ' సినిమాలో నటిస్తున్నారు. అలాగే 'జైలర్' సినిమా రెండవ భాగంలో కూడా నటిస్తున్నారు సూపర్ స్టార్ రజినీకాంత్. 70 ఏళ్లు దాటినా కూడా, ప్రస్తుత యువ నటులకు పోటీగా చురుగ్గా, కష్టపడి నటిస్తున్నారు రజినీకాంత్. సినిమాకు ఆయన 200 కోట్లకు పైగా తీసుకుంటుేన్నట్టు తెలుస్తోంది. 

Read more Photos on
Recommended Photos