షాకింగ్: 'ధర్మా ప్రొడక్షన్' లో మేజర్ షేర్ అమ్మేస్తున్న కరణ్ జోహార్, నష్టాలే కారణం?

First Published | Oct 8, 2024, 10:19 AM IST

ధర్మ ప్రొడక్షన్స్ లో సినిమా వస్తోందంటే గ్యారింటీ హిట్ అనే పేరు ఉంది. కరణ్ జోహార్  సొంత నిర్మాణ సంస్థ అది.  

Saregama India , Karan Johar, Dharma Productions

బాలీవుడ్ లో భారీ సినిమాలు తీసే బడా ప్రొడ్యూసర్స్ లో కరణ్ జోహార్ ఒకరు. ఇప్పటికే ఆయన పలు సక్సెస్ ఫుల్ సినిమాలను తెరకెక్కించి దర్శకుడిగా , ప్రొడ్యూసర్ గా రాణిస్తున్నారు. అలాగే సెలబ్రెటీల వారసులను ఇండస్ట్రీ కి పరిచయం చేయాలంటే ముందుగా కరణ్ నే సంప్రదిస్తారు.

బిగ్‌ బాస్‌ తెలుగు 8 అప్‌ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

కెరీర్  ప్రారంభంలో డైరక్షన్ చేసి హిట్స్ కొట్టిన ఆయన...గత కొంతకాలంగా  డైరెక్షన్ పక్కనబెట్టి నిర్మాతగా వరస చిత్రాలు తీస్తున్నారు. కరణ్ జోహార్ ఎన్నో విజయవంతమైన సినిమాలను తెరకెక్కించారు. అందమైన ప్రేమకథలను అందించారు. ఆయన ధర్మ ప్రొడక్షన్ లో చేయాలని చాలా మంది ఉవ్విళ్లూరుతూంటారు. అయితే ఇప్పుడా ధర్మ ప్రొడక్షన్స్ లో మేజర్ షేర్ అమ్మేయబోతున్నట్లు సమాచారం.

ధర్మ ప్రొడక్షన్స్ లో సినిమా వస్తోందంటే గ్యారింటీ హిట్ అనే పేరు ఉంది. కరణ్ జోహార్  సొంత నిర్మాణ సంస్థ అది.  అయితే గత కొంతకాలంగా బాలీవుడ్ లో సక్సెస్ రేటు తగ్గటం, హీరో,హీరోయిన్స్ రెమ్యునరేషన్స్ పెరిగిపోవటం, ప్రొడక్షన్ కాస్ట్ ఊహించని విధంగా రెట్టింపు అవటంతో ఎంత పెద్ద హిట్ అయినా నామినల్ లాభాలు మాత్రమే వస్తున్నాయి.  ఈ క్రమంలో సిన సినిమా నిర్మాణం తగ్గించేసారు. ఎక్కువ డిస్ట్రిబ్యూషన్ మీదే దృష్టి పెడుతున్నారు. 
 


బాలీవుడ్ లో పెద్ద సంస్ద అయిన సారిగామా ఇండియా వారు ఇప్పటికే కరణ్ జోహార్ తో  చర్చలు జరుపుతున్నారు. నిర్మాత కరణ్ జోహార్ కంపెనీ ధర్మా ప్రొడక్షన్స్‌లో మెజారిటీ వాటాను కొనుగోలు చేయబోతున్నట్లు బాలీవుడ్ మీడియా సమాచారం. అయితే ఇప్పటిదాకా చర్చలే తప్పించి ఎగ్రిమెంట్ అయితే జరగలేదని రాసుకొచ్చాయి.  కరణ్ జోహార్ గత కొంతకాలంగా ధర్మ ప్రొడక్షన్స్  పెట్టుబడులు కోసం ప్రయత్నిస్తున్నారు.

గత కొంత కాలంగా  చూస్తే  బాలీవుడ్ సినిమాల వసూళ్లు పూర్తిగా పడిపోయాయి. తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలు దేశవ్యాప్తంగా బాగానే అడుతున్నాయి.ఆ స్థాయికి సరితూగే బాలీవుడ్‌ సినిమా రావడం లేదు. అయితే బాలీవుడ్ ఈ పరిస్థితికి రావడం వెనుక అనేక కారణాలు ఉన్నాయి అంటారు పరిశ్రమ పరిశీలకులు. అలా కరణ్‌ జోహార్‌ కూడా ఈ పరిస్థితిపై కామెంట్స్‌ చేశారు. హిందీ సినిమా హీరోలు, దర్శకులు, నిర్మాతల్లో గట్స్ తగ్గాయి. అందుకే బాలీవుడ్‌కి ఈ పరిస్థితి అని ఘాటుగా కామెంట్స్‌ చేశారాయన. 

Director Karan Johar

బాలీవుడ్‌లో ఒకప్పుడు ఒరిజినల్ కంటెంట్ సృష్టించేది. ఆ దమ్మున్న వాళ్లు అప్పుడు బాలీవుడ్‌లో ఉండేవారు. కానీ ఇప్పుడు అదే లోపించింది. దాంతో శాపంగా మారింది. అని స్ట్రాంగ్‌గా కామెంట్స్‌ చేశారు కరణ్‌ జోహార్‌. తెలుగు, తమిళ సినిమాల రీమేక్‌ల వెంట ఇప్పుడు బాలీవుడ్‌ జనాలు పడుతున్నారు.

దీంతో అక్కడే బాలీవుడ్‌ పతనం మొదలైంది అని కరణ్‌ అన్నారు.సౌత్‌ ఇండస్ట్రీలో విజయం అందుకున్న ప్రతి సినిమా హక్కులు కొనడం, వాటిని హిందీలో తీయడం ఎక్కువైంది. దీంతో సొంత ఆలోచనలు, సొంత కథలు గురించి ఇక్కడివాళ్లు ఆలోచించడం మానేశారు అని కరణ్‌ జోహార్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఇక కరణ్ జోహార్ బ్యానర్ ధర్మ ప్రొడక్షన్స్ నుంచి వస్తున్న తాజా చిత్రం ‘జిగ్రా’. ఆలియా భ‌ట్(Alia bhatt) వేదాంగ్ రైనా (Vedang Raina) ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తోన్న  చిత్రం  ‘జిగ్రా’ (Jigra). వాసన బాల దర్శకత్వం వహించారు. బాలీవుడ్‌లో మంచి అంచ‌నాలున్న ఈ చిత్రాన్ని హీరో రానా ద‌గ్గుబాటి ఈ సినిమాను తెలుగులో విడుద‌ల చేయ‌టానికి సిద్ధ‌మ‌య్యారు.

ఇప్ప‌టికే ఈ సినిమా హిందీ ట్రైల‌ర్ విడుద‌లై అంచ‌నాల‌ను పెంచిన సంగ‌తి తెలిసిందే. తెలుగు ట్రైల‌ర్‌ను  గ్లోబ‌ల్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌ విడుద‌ల చేశారు. వ‌యాకామ్ 18 స్టూడియోస్‌, ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్‌, ఎట‌ర్‌న‌ల్ షైన్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్స్ స‌మ‌ర్ప‌ణ‌లో కర‌ణ్ జోహార్, అపూర్వ మెహ‌తా, ఆలియా భ‌ట్‌, షాహిన్ భ‌ట్, సోమెన్ మిశ్రా నిర్మాత‌లుగా రూపొందిన ‘జిగ్రా’ చిత్రం అక్టోబ‌ర్ 11న ప్ర‌పంచ వ్యాప్తంగా భారీగా విడుద‌ల‌వుతుంది.   
 

రానా ద‌గ్గుబాటి మాట్లాడుతూ ‘‘జిగ్రా క‌థ‌లో మంచి సోల్ ఉంది. భాష‌తో సంబంధం లేకుండా ఎవ‌రికైనా ఇది క‌నెక్ట్ అవుతుంది. ఇలాంటి వైవిధ్య‌మైన క‌థ‌తో రూపొందిన ఈ సినిమాను తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందించాల‌ని భావించాం.  ధ‌ర్మ ప్రొడక్ష‌న్స్‌తో క‌లిసి నేను, ఏషియ‌న్ సురేష్ ఎంట‌ర్‌టైన్మెంట్ ఈ సినిమాను తెలుగులో విడుద‌ల చేస్తున్నామ‌ని గ‌ర్వంగా తెలియ‌జేస్తున్నాం.

జిగ్రా అనేది కేవ‌లం యాక్ష‌న్ చిత్రం మాత్ర‌మే కాదు. కుటుంబంలోని అనుబంధాల‌ను తెలియ‌జేసే చిత్రం. మ‌నం ఎంతగానో ప్రేమించే వ్య‌క్తుల‌ను మనం ఎలా కాపాడుకోవాలో తెలియ‌జెప్పే సినిమా. ఆలియా భ‌ట్‌, వేదాంగ్ రైనా ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన ఈ చిత్రం భాష‌, స‌రిహ‌ద్దుల‌తో సంబంధం లేకుండా ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న ప్రేక్ష‌కుల‌కు అద్భుత‌మైన అనుభవాన్ని అందిస్తుంద‌న‌టంలో సందేహం లేదు’’ అన్నారు. 

Latest Videos

click me!