బ్లాక్ బస్టర్ కావాల్సిన బాలకృష్ణ సినిమాను ప్లాప్ చేసిన నిర్మాత, ఆ ఒక్క స్టేట్మెంట్ తో అంతా రివర్స్!

First Published | Oct 8, 2024, 10:32 AM IST

హీరో బాలకృష్ణ నటించిన ఓ మూవీ ఫలితాన్ని నిర్మాత ఇచ్చిన స్టేట్మెంట్ దెబ్బతీసిందట. సూపర్ హిట్ కావాల్సిన చిత్రం కాస్తా బాక్సాఫీస్ వద్ద చతికిలపడింది. 
 

when hero balakrishna movie result damaged by producer statement ksr
Balakrishna

ఒక చిత్ర ఫలితాన్ని అనేక విషయాలు ప్రభావితం చేస్తాయి. మంచి కంటెంట్ ఉన్న సినిమాలను ప్రేక్షకులు థియేటర్స్ లో రిజెక్ట్ చేయవచ్చు. పెద్దగా విషయం లేని సినిమాలకు ప్రేక్షకులు పోటెత్తవచ్చు. ప్రేక్షకుల మూడ్ చాలా ముఖ్యం. ట్రైలర్స్, టీజర్స్ మాత్రమే కాదు.. దర్శక నిర్మాతలు, హీరోల స్టేట్మెంట్స్ కూడా హిట్/ప్లాప్ అనేది నిర్ణయిస్తాయి. 

when hero balakrishna movie result damaged by producer statement ksr

బి. గోపాల్-ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన నరసింహుడు చిత్రం విడుదల కాకుండానే.. 200 సెంటర్స్ లో 100 డేస్ అని పోస్టర్స్ విడుదల చేశారు. నిర్మాత ఒత్తిడితో రూపొందించిన నరసింహుడు పోస్టర్స్ అబాసుపాలయ్యాయి. మూవీ డిజాస్టర్ కావడంతో ఎన్టీఆర్ తో పాటు సినిమా యూనిట్ ని జనాలు ఎగతాళి చేశారు. 

కాగా నిర్మాత ఇచ్చిన స్టేట్మెంట్ బాలకృష్ణ మూవీ ఫలితాన్ని దెబ్బ తీసిందని ఆ మూవీ డైరెక్టర్ స్వయంగా చెప్పాడు. ఆ మూవీ చెన్నకేశవరెడ్డి కాగా.. దర్శకుడు వివి వినాయక్. ఓ ఇంటర్వ్యూలో ఈ మేరకు ఆయన ఆసక్తికర కామెంట్స్ చేశాడు. 
 


Balakrishna


2002లో విడుదలైన చెన్నకేశవరెడ్డి చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది. చిత్ర ఫలితాన్ని ఉద్దేశిస్తూ... జయాపజయాలు దైవాదీనం. మనం సినిమా కోసం కష్టపడ్డాం. బెస్ట్ ఇచ్చే ప్రయత్నం చేశాం...అని వివి వినాయక్ తో అన్నాడట బాలకృష్ణ. విడుదలైన తర్వాత కొత్తగా ఓ పాట యాడ్ చేశారట. ఈ పాట జోడించాక సినిమా పికప్ అయ్యిందిట. 

సినిమా 60-65 శాతం రెవిన్యూ రాబట్టిందట. అప్పుడు నిర్మాత బెల్లంకొండ సురేష్  ఒక స్టేట్మెంట్ ఇచ్చాడట. ఆయన మాటలతో మెల్లగా ఊపందుకుంటున్న చెన్నకేశవరెడ్డి వసూళ్లు ఒక్కసారిగా పడిపోయాయట. ఆ స్టేట్మెంట్ బెల్లంకొండ సురేష్ తో వేరొకరు ఇప్పించారట. బెల్లంకొండ సురేష్ స్టేట్మెంట్ కారణంగా.. సూపర్ హిట్ కావాల్సిన చెన్నకేశవరెడ్డి... యావరేజ్ గా నిలిచిందట. ఆ స్టేట్మెంట్ బెల్లంకొండ సురేష్ ఇవ్వకుండా ఉండాల్సిందని.. వివి వినాయక్ అన్నారు. 
 

Balakrishna

తెలుపు తెలుపు తెలుపు.. అనే ఒక మాస్ గ్రూప్ సాంగ్ ని చెన్నకేశవరెడ్డి చిత్రానికి విడుదల తర్వాత జోడించారు. ఆ పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో కొన్ని సీన్స్ సైతం ట్రోల్స్ కి గురయ్యాయి. ఎయిర్ పిల్లోస్ కట్టుకొని బాలకృష్ణ బిల్డింగ్ పైనుంచి  దూకడాన్ని యాంటీ ఫ్యాన్స్ ట్రోల్ చేశారు. కానీ చెన్నకేశవరెడ్డి మూవీలో కొన్ని సీన్స్ చాలా పవర్ఫుల్ గా ఉంటాయి.  

ఆది మూవీతో దర్శకుడిగా మారిన వివి వినాయక్ బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఎన్టీఆర్ కి మాస్ హీరో ఇమేజ్ తెచ్చిపెట్టిన మొదటి చిత్రం ఆది. యంగ్ ఫ్యాక్షనిస్ట్ రోల్ లో ఎన్టీఆర్ అదరగొట్టాడు. ఆ సబ్జెక్టు ఎన్టీఆర్ కి సూట్ కాదని చాలా మంది సజెస్ట్ చేశారట. కానీ వివి వినాయక్ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ హిట్ కొట్టి చూపించాడు. 

Balakrishna

ఆది సక్సెస్ నేపథ్యంలో బాలకృష్ణతో మూవీ చేసే ఛాన్స్ దక్కింది. వివి వినాయక్ మరో ఫ్యాక్షన్ కథను సిద్ధం చేశాడు. ఫ్యాక్షన్ కథలతో ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన బాలయ్యతో మరో ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో మూవీ అనగానే అంచనాలు పీక్స్ కి వెళ్లాయి. అభిమానులు చెన్నకేశవరెడ్డి విషయంలో సంతృప్తి చెందారు. ఆడియన్స్ మాత్రం పూర్తి స్థాయిలో మెచ్చలేదు. 


బిగ్ బాస్ తెలుగు 8 లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఇక్కడ  తెలుసుకోండి 

Bellamkonda Suresh

ఇక బెల్లంకొండ సురేష్, బాలకృష్ణ కాంబోలో లక్ష్మీ నరసింహ టైటిల్ తో మరో చిత్రం తెరకెక్కింది. 2004 సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం మాత్రం సూపర్ హిట్ అందుకుంది. అనంతరం బాలకృష్ణ-బెల్లంకొండ సురేష్ మధ్య విబేధాలు తలెత్తాయి. బాలకృష్ణ తన నివాసంలో బెల్లంకొండ సురేష్ పై కాల్పులకు పాల్పడ్డాడు. తృటిలో ప్రాణాపాయం నుండి బెల్లంకొండ సురేష్ తప్పించుకున్నాడు. బాలకృష్ణ అరెస్ట్ అయ్యాడు. అనంతరం బెయిల్ పై విడుదలయ్యారు. ఇద్దరి మధ్య వివాదానికి కారణాలు తెలియరాలేదు. 

Latest Videos

click me!