ఒకే ఏడాది నాలుగు సినిమాలని దెబ్బ కొట్టిన జూ.ఎన్టీఆర్.. వెంకటేష్, మహేష్ బాబు సినిమాల అడ్రెస్ గల్లంతు

Published : Nov 28, 2025, 09:05 AM IST

యుంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకే ఏడాది రెండు సూపర్ హిట్లు అందుకుని నాలుగు సినిమాలని దెబ్బ కొట్టారు. 2010లో ఇది జరిగింది. ఇంతకీ ఎన్టీఆర్ హిట్ చిత్రాలు ఏంటి, ఆయన దెబ్బ కొట్టిన సినిమాలు ఏంటి అనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. 

PREV
15
ఒకే ఏడాది రెండు సూపర్ హిట్లు 

యంగ్ టైగర్ ఎన్టీఆర్ 2010లో రెండు సూపర్ హిట్లు కొట్టారు. 2010 పండుగలు ఎన్టీఆర్ కి బాగా కలిసి వచ్చాయి. 2010 సంక్రాంతికి అదుర్స్ చిత్రంతో సూపర్ హిట్ అందుకున్న తారక్.. అదే ఏడాది దసరాకి బృందావనం చిత్రంతో మరో హిట్ కొట్టారు. అదుర్స్ చిత్రం అద్భుతమైన వసూళ్లు అందుకుంది. వివి వినాయక్ దర్శకత్వంలో మాస్ యాక్షన్ మూవీగా అదుర్స్ తెరకెక్కింది. ఇక బృందావనం చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుని విజయం సాధించింది. ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకుడు. అదుర్స్ కి పోటీగా వచ్చిన మూడు సినిమాలు ఫ్లాప్ నిరాశ పరిచాయి. అదే విధంగా బృందావనం చిత్రంతో పోటీ పడిన మహేష్ బాబు సినిమా కూడా మునిగిపోయింది. 

25
అదుర్స్ కి పోటీగా వెంకీ 

అదుర్స్ చిత్రం జనవరి 13, 2010న విడుదల కాగా ఒక రోజు తర్వాత వెంకటేష్, శ్రీనువైట్ల కాంబినేషన్ లో నమో వేంకటేశ చిత్రం విడుదలైంది. శ్రీనువైట్ల ఆ టైంలో వరుస హిట్లతో దూసుకుపోతున్నారు. శ్రీనువైట్ల కామెడీ సీన్లు తెరకెక్కించడంలో దిట్ట. కామెడీ పండించడంలో వెంకీకి తిరుగులేదు. వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా అనగానే అంచనాలు పెరిగాయి. కానీ రిలీజ్ తర్వాత నమో వెంకటేశ చిత్రం పూర్తిగా నిరాశపరిచింది. అదుర్స్ ప్రభావంతో బాక్సాఫీస్ వద్ద నిలబడలేకపోయింది. 

35
రవితేజ, కాజల్ సినిమాలకు కూడా దెబ్బ 

 అదుర్స్ చిత్రానికి పోటీగా నమో వెంకటేశ చిత్రంతో పాటు కాజల్ నటించిన ఓం శాంతి, రవితేజ శంభో శివ శంభో చిత్రాలు కూడా రిలీజ్ అయ్యాయి. శంభో శివ శంభో చిత్రం విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్నప్పటికీ అదుర్స్ ప్రభావం వల్ల మంచి వసూళ్లు సాధించలేకపోయింది. ఒక కాజల్ ఓం శాంతి సినిమా అయితే బాక్సాఫీస్ వద్ద కనిపించనే లేదు. 

45
దసరాకి ఎన్టీఆర్ హవా 

సంక్రాంతికి అదుర్స్ తో దుమ్ములేపిన తారక్..అదే ఏడాది దసరాకి ఫ్యామిలీ ఆడియన్స్ ని మెప్పించి మరో హిట్ ఖాతాలో వేసుకున్నారు. వంశీ పైడిపల్లి, ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన బృందావనం చిత్రం బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్ తో మెప్పించింది. ఈ మూవీలో ఎన్టీఆర్ తో కాజల్, సమంత కెమిస్ట్రీ ఆకట్టుకుంది. 

55
అప్పుడు డిజాస్టర్ ఇప్పుడు కల్ట్ సినిమా 

బృందావనం చిత్రానికి వారం ముందు మహేష్ బాబు ఖలేజా చిత్రం రిలీజ్ అయింది. మహేష్ బాబుని అలాంటి పాత్రలో అభిమానులు ఊహించుకోలేకపోయారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ కొత్తగా ప్రయత్నించినప్పటికీ ఖలేజా చిత్రం వర్కౌట్ కాలేదు. దీనితో బాక్సాఫీస్ పోటీలో ఎన్టీఆర్ దే పైచేయి అయింది. కానీ ఇప్పుడు ఖలేజా ఓ కల్ట్ మూవీ అంటూ అభిమానులు అభివర్ణిస్తున్నారు. 

Read more Photos on
click me!

Recommended Stories