కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: శ్రీధర్ ని అవమానించిన పారు- దీప ప్రెగ్నెన్సీ పోయేలా కిందపడేసిన జ్యో

Published : Nov 28, 2025, 08:13 AM IST

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (నవంబర్ 28వ తేదీ)లో జ్యోకు ఉత్తమ కూతురనే అవార్డు ఇవ్వాలి అంటాడు కార్తీక్. నా పేరుపై ప్రోపర్టీ ఉండాలి అంటుంది జ్యో. శ్రీధర్ ని అవమానిస్తుంది పారు. దీపను కిందపడేస్తుంది జ్యో. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..

PREV
18
కార్తీక దీపం 2 సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్

కార్తీక దీపం 2 సీరియల్ శుక్రవారం ఎపిసోడ్ లో మమ్మీ కోసం ల్యాండ్ కొన్నాను అని చెప్తుంది జ్యోత్స్న. మీరు చెప్పేది పచ్చి అబద్ధం అని.. నీ పక్కన ఉన్న పారు అనుకున్నా.. మేము మాత్రం నిజమనే నమ్ముతాము అంటాడు కార్తీక్. నేనెందుకు అబద్ధం అనుకుంటానురా అంటుంది పారు. మీరెప్పుడు మీ గురించే ఆలోచించుకుంటారు. ఆస్తులు మీ పేరు మీదే ఉంటాయి. నా తల్లి గురించి ఎవరూ ఆలోచించరు. అందుకే నేను మమ్మీ కోసం ఆ ల్యాండ్ కొన్నాను అంటుంది జ్యోత్స్న.

తల్లి కోసం ఇంత గొప్ప పని చేసిన జ్యోత్స్నను మెచ్చుకోవాలి. నీకోసం ఆలోచించే కూతురు పుట్టినందుకు నువ్వు గర్వపడాలి సుమిత్ర అంటుంది పారిజాతం. నిజమే ఈ ఉత్తమ కూతురికి పెద్ద ఫంక్షన్ చేసి ఈ గొప్ప తల్లి చేతుల మీదుగా.. తల్లి మనసు గెలుచుకున్న ఉత్తమ కూతురనే అవార్డు ఇవ్వాలి అని ఎగతాళి చేస్తాడు కార్తీక్. 

అంత వెటకారం అవసరం లేదు అంటుంది పారు. కంపెనీ డబ్బులు పర్సనల్ అకౌంట్ కి ట్రాన్స్ ఫర్ చేసినందుకు ముందు.. ఆ అకౌంటెంట్ పై కేసు పెట్టండి. అప్పుడు అందరికీ బుద్ధి వస్తుంది అంటాడు శివన్నారాయణ. వద్దు మామయ్య గారు.. విషయం మనకు తెలిసింది కదా.. దాన్ని ఎలాగోలా సెట్ చేద్దాం అంటాడు శ్రీధర్. జ్యోత్స్న మనకు కనిపించే అంత అమాయకురాలు కాదు నాన్న అని మనసులో అనుకుంటాడు దశరథ.

28
మమ్మీ పేరు చెప్పి తప్పించుకున్నాను

మీ అమ్మ మనసు గెలుచుకోవడం కోసం ల్యాండ్ తీసుకున్నావా? మంచి పని చేశావు అంటుంది పారు. ఏదో తప్పించుకోవడానికి మమ్మీ పేరు వాడుకున్నాను. అది నా పేరు మీదే కొన్నాను. నేను ఈ ఇంటి వారసురాలిని కాదు అని తెలిసిన రోజు.. నా పేరుతో ఎంతో కొంత ప్రోపర్టీ ఉండాలని ఆ పనిచేశాను అంటుంది జ్యోత్స్న. నేను సీఈఓగా ఉంటే.. నేను వాడుకున్న డబ్బులను నష్టాల్లో చూపించి తప్పించుకునేదాన్ని. కానీ ఈ బావ ఉన్నాడు కదా.. నా పాలిట రాక్షసుడిలా తయారయ్యాడు. ఎప్పుడూ నా తప్పులను వెతికే ప్రయత్నంలోనే ఉంటాడు అంటుంది జ్యోత్స్న.

38
ఈ ఆస్తి అంతా తనదే..

కానీ మీరు దొరకరు కదా అంటూ లోపలికి వస్తుంది దీప. వెనకాలే వస్తాడు కార్తీక్. మీరెందుకు వచ్చారు అంటుంది పారు. తినడానికి పిలుద్దామని వచ్చాం అంటుంది దీప. ఇద్దరు కలిసి ఏం ప్లాన్ చేస్తున్నారు అంటాడు కార్తీక్. ప్లాన్ చేయాల్సిన అవసరం మాకేంటి.. ఇది శివన్నారాయణ వారసురాలు. ఎప్పటికైనా ఈ ఆస్తి అంత తనదే అంటుంది పారు. 

కాదు అంటాడు కార్తీక్. ఈ ఆస్తి శివన్నారాయణ కష్టార్జితం. ఆయన తన కొడుకు పేరుపై రాశారు. ఆయన ఈ ఇంటి వారసురాలి పేరుపై రాస్తారు అంటాడు కార్తీక్. నేను చెప్పింది కూడా అదే కదా అంటుంది పారు. బోతార్ నాట్ సేమ్ పారు అని అక్కడి నుంచి వెళ్లిపోతాడు కార్తీక్. అయోమయంలో పడుతుంది పారు. వారసురాలి గురించి వాడు ఏదో చెప్పాడే అని జ్యోత్స్నతో అంటుంది పారు. బావ ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాడులే అంటుంది జ్యోత్స్న.

48
ఎవ్వరికీ సిగ్గు లేదు

శ్రీధర్, దీప, కార్తీక్ సహా అందరూ కలిసి భోజనం చేస్తూ ఉంటారు. కార్తీక్ దీపకు ప్రేమగా వడ్డిస్తుంటాడు. జ్యోత్స్న అదే పనిగా చూస్తూ ఉంటుంది. ఎంతసేపు వాళ్లనే చూస్తావు తిను అంటుంది పారు. ఇక్కడ ఎవ్వరికీ సిగ్గు లేదు గ్రానీ. తాత మామయ్యను కొట్టి వెళ్లగొట్టాడు. రా అనగానే వచ్చి సిగ్గులేకుండా కలిసిపోయాడు. ఇలాంటి వాళ్లతో కలిసి భోజనం చేస్తున్నందుకు మనకు కూడా సిగ్గు లేదు అంటుంది జ్యోత్స్న.

58
రిక్వెస్ట్ చేసిన శ్రీధర్

భోజనం చేసి వెళ్లబోతూ.. దశరథతో మాట్లాడుతాడు శ్రీధర్. బావ మీ చెల్లికి నువ్వంటే చాలా ఇష్టం. నువ్వు చెప్తే నీ మాట వింటుంది. నేను కాంచన లేకుండా ఉండలేకపోతున్నాను. కాంచన నన్ను క్షమించేలా నువ్వు తనతో మాట్లాడు బావ అంటాడు శ్రీధర్. నా చెల్లి నాకంటే మొండిది. నా మాట వింటుందా బావ అంటాడు దశరథ. వారి మాటలు విన్న పారిజాతం.. చిన్నగా గొడవ స్టార్ట్ చేస్తుంది.

68
కావేరిని వదిలెయ్

ఇద్దరు పెళ్లాలు కావాలి అనడానికి నీకు సిగ్గులేదేమో కానీ.. ఈ ఇంటి ఆడపడుచుకు మొదటి భార్యగా ఉండాల్సిన కర్మ లేదు అంటుంది పారు. శ్రీధర్ ని తక్కువ చేసి మాట్లాడే ప్రయత్నం చేస్తుంది పారు. వత్తాసు పలుకుతుంది జ్యోత్స్న. మాటలు జాగ్రత్తగా మాట్లాడితే మంచిదని హెచ్చరిస్తాడు కార్తీక్.

కావేరిని వదిలేసి రా.. కాంచన కాళ్లు పట్టుకొని అయినా నిన్ను క్షమించేలా చేస్తాను అని శ్రీధర్ తో అంటుంది పారు. మౌనంగా ఉంటాడు శ్రీధర్. వాళ్లు కూడా మనుషులే.. బంధాలు తెంపుకోవడం మీరు చెప్పినంత ఈజీ కాదు అంటాడు కార్తీక్. ఎన్ని గొడవలు ఉన్నా కలవాలి అనుకున్న మనుషులను కలిపేందుకు సాయం చేయాలి. లేకపోతే నోరుమూసుకొని ఊరుకోవాలి అంటుంది దీప.

78
కాంచన క్షమించదు..

కాంచన.. మీ నాన్నను క్షమిస్తుందని అనుకుంటున్నావా? అది ఎప్పటికీ జరగదు అంటుంది పారు. తాత మా నాన్నను క్షమిస్తాడని నువ్వు అనుకున్నావా? అని అడుగుతాడు కార్తీక్. అనుకోలేదు అంటుంది పారు. మా నాన్నకు సీఈఓ పదవి ఇస్తాడని అనుకున్నావా? అంటాడు కార్తీక్. అనుకోలేదు అంటుంది పారు. ఇప్పుడు నువ్వు అనుకోనివి ఎలా జరిగాయో.. మా అమ్మ కూడా మా నాన్నను క్షమించడం అలాగే జరుగుతుంది అంటాడు కార్తీక్. నోరు మూసుకుంటుంది పారు.

88
దీపను కిందపడేసిన జ్యోత్స్న

సరే నేను వెళ్లొస్తాను మామయ్య గారు అని చెప్పి అక్కడి నుంచి బయల్దేరుతాడు శ్రీధర్. మామయ్య ల్యాప్ టాప్ మర్చిపోయాడు. వెళ్లి ఇచ్చి రా అని జ్యోత్స్నకు ఇస్తాడు శివన్నారాయణ. శ్రీధర్ కి ల్యాప్ టాప్ ఇచ్చి.. వచ్చేటప్పుడు దీపకు కాలు అడ్డం పెడుతుంది జ్యోత్స్న. కింద పడబోతుంది దీప. పట్టుకుంటుంది సుమిత్ర. అంతటితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories