దేవర చిత్రానికి గుడ్ న్యూస్ చెబుతూ జీవో..పవన్ కళ్యాణ్ కి థ్యాంక్స్ చెప్పిన జూనియర్ ఎన్టీఆర్

First Published | Sep 21, 2024, 2:20 PM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన దేవర చిత్రం సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. భారీ అంచనాల నడుమ ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ కి సిద్ధం అవుతోంది. ఈ నేపథ్యంలో ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఎన్టీఆర్, కొరటాల కాంబినేషన్ లో జనతా గ్యారేజ్ తర్వాత తెరకెక్కిన చిత్రం ఇది.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన దేవర చిత్రం సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. భారీ అంచనాల నడుమ ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ కి సిద్ధం అవుతోంది. ఈ నేపథ్యంలో ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఎన్టీఆర్, కొరటాల కాంబినేషన్ లో జనతా గ్యారేజ్ తర్వాత తెరకెక్కిన చిత్రం ఇది. భారీ బడ్జెట్ లో పాన్ ఇండియా మూవీగా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న చిత్రం కావడంతో పాన్ ఇండియా స్థాయిలో దేవర ఎలాంటి బిజినెస్ చేస్తుంది.. ఏ స్థాయిలో వసూళ్లు ఉండబోతున్నాయి అని ట్రేడ్ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పాన్ ఇండియా స్టార్ గా ఎన్టీఆర్ తన స్థానాన్ని పదిలం చేసుకోవాలంటే దేవర సక్సెస్ చాలా కీలకం. 

ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం నుంచి దేవర చిత్ర యూనిట్ కి గుడ్ న్యూస్ వచ్చింది. గత ప్రభుత్వంలో ఏపీలో అదనపు షోలు, టికెట్ ధరలు  పెంచుకోవడానికి అనుమతులు చాలా అరుదుగా వచ్చేవి. ఇప్పుడు మళ్ళీ ఏపీలో మిడ్ నైట్ షోల కళ కనిపించబోతోంది. ఈ మేరకు దేవర చిత్రానికి ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెబుతూ జీవో రిలీజ్ చేశారు. 


మిడ్ నైట్ షోలు, అదనపు షోలు, టికెట్ ధరలు పెంచుకునేందుకు దేవర చిత్రానికి అనుమతి ఇస్తూ ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది. రిలీజ్ డేట్ నుంచి 10 రోజుల పాటు టికెట్ ధరలు పెంచుకునేలా ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అప్పర్ క్లాస్ టికెట్ ధరని 110 రూపాయలు, లోయర్ క్లాస్ టికెట్ ధరని 60 రూపాయల వరకు పెంచుకునేలా వెసులుబాటు కల్పించారు. 

అదే విధంగా మల్టిప్లెక్స్ లలో 135 రూపాయలు పెంచుకునేలా అనుమతి  ఇచ్చారు. ఇది దేవర చిత్రానికి బిగ్ బూస్ట్ అని చెప్పొచ్చు. అదే విధంగా మిడ్ నైట్ షోలు, అదనపు షోలు 9 రోజుల పాటు ప్రదర్శించుకునేలా అనుమతి ఇచ్చారు. 9 రోజుల పాటు దేవర చిత్రానికి 5 షోలు ప్రదర్శించుకోవచ్చు. దీనితో ఎన్టీఆర్ ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. 

జీవో రిలీజ్ అయిన వెంటనే యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఏపీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెబుతూ ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఫినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ లకి ఎన్టీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. 'దేవర చిత్ర రిలీజ్ సందర్భంగా కొత్త జీవో రిలీజ్ చేసిన సీఎం చంద్రబాబు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, సినీటోగ్రఫీ మంత్రి దుర్గేష్ గారికి నా కృతజ్ఞతలు. తెలుగు సినిమాకి మీరు మంచి సహకారం అందిస్తున్నారు అంటూ ఎన్టీఆర్ అభినందించారు. 

ఎన్టీఆర్ తో పాటు దేవర చిత్రాన్ని ఏపీలో రిలీజ్ చేస్తున్న నిర్మాత నాగవంశీ కూడా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, కందుల దుర్గేష్ ముగ్గురికి కృతజ్ఞతలు తెలిపారు. అదే విధంగా ఈ చిత్రాన్ని నిర్మించిన ఎన్టీఆర్ సోదరుడు, నటుడు కళ్యాణ్ రామ్ కూడా ఈ ముగ్గురికి కృతజ్ఞతలు చెబుతూ ట్వీట్ చేశారు. 

Latest Videos

click me!