నాగ మణికంఠ బండారం ఇది, ఝలక్ ఇచ్చిన వైఫ్, కాకరేపుతున్న సోషల్ మీడియా పోస్ట్స్!

First Published | Sep 21, 2024, 2:12 PM IST

నాగ మణికంఠకు భార్య భారీ ఝలక్ ఇచ్చింది. ఆయన సింపతీ గేమ్ కి బ్రేక్ వేసింది. నాగ మణికంఠ బండారం బయటపెడుతూ సోషల్ మీడియా పోస్ట్స్ పెట్టింది. 
 

Naga Manikanta

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 కంటెస్టెంట్ నాగ మణికంఠకు పెద్దగా ఫేమ్ లేదు. ఈ యంగ్ ఫెలో సంగతులు ఆడియన్స్ కి తెలిసింది తక్కువే. కానీ హౌస్లోకి వస్తూనే ఆకర్షించాడు. తన ఎమోషనల్, ట్రాజిక్ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ బయటపెట్టాడు. 

Bigg Boss Telugu 8

బాల్యంలోనే నాగ మణికంఠ తండ్రి కన్నుమూశాడట. తల్లి వేరొక వ్యక్తిని పెళ్లి చేసుకుందట. పెంపుడు తండ్రి వలన నాగ మణికంఠకు అనేక అవమానాలు, కష్టాలు ఎదురయ్యాయట. తల్లి మరణిస్తే దహన సంస్కారాలు చేయడానికి డబ్బులు లేక, అడుక్కున్నాడట. 

కన్నీరు పెట్టుకుంటూ నాగ మణికంఠ చేసిన ఈ కామెంట్స్ హౌస్ మేట్స్ ని సైతం కదిలించాయి. వారు కూడా ఎమోషనల్ అయ్యారు. మరో సందర్భంలో విగ్గు తీసి విసిరేసిన నాగ మణికంఠ ఇంత కంటే ట్రాన్స్పరెంట్ గా ఉండలేను బిగ్ బాస్. హౌస్ నుండి బయటకు వెళ్ళాక నా జీవితం ఏమిటో, నాకే తెలియదు అంటూ ఏడుపు లంగించుకున్నాడు. 


Bigg Boss Telugu 8

మాట్లాడితే.. నాకు నా భార్య కావాలి, నా బిడ్డ కావాలి. అత్తారింటిలో గౌరవం కావాలి. అవన్నీ పొందాలంటే నేను బిగ్ బాస్ టైటిల్ గెలవాలంటూ బరస్ట్ అవుతాడు. నాగ మణికంఠ చర్యలను గమనించిన కొందరు సింపతీ గేమ్ అంటున్నారు. పల్లవి ప్రశాంత్ ని ఫాలో అవుతున్నాడని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. 

హౌస్లో భార్య పిల్లల కార్డు వాడుతున్న నాగ మణికంఠకు వైఫ్ ప్రియ బ్రేక్ వేసింది. భర్త నాగ మణికంఠపై పరోక్ష విమర్శలు చేస్తూ వైఫ్ ప్రియ చేసిన సోషల్ మీడియా కామెంట్స్ కాకరేపుతున్నాయి. 
 

Bigg boss telugu 8

సమాజం కోసం విషపూరిత బంధం కొనసాగించడం కంటే వారితో విడిపోవడమే ఉత్తమం అని ఒక కామెంట్ పోస్ట్ చేసింది. భార్య భర్తల మధ్య విబేధాలు పిల్లల మీద ప్రతికూల ప్రభావం చూపుతాయి అని అర్థం వచ్చేలా మరొక పోస్ట్ పెట్టింది. ప్రియ సోషల్ మీడియా పోస్ట్స్ గమనిస్తే.. ఇద్దరికీ విబేధాలు ఉన్నాయని అర్థం అవుతుంది. 

నాగ మణికంఠ పెంపుడు తండ్రి పై చేసిన ఆరోపణలను ఆయన స్టెప్ సిస్టర్ ఖండించిన సంగతి తెలిసిందే. తల్లి మరణించాక ఇంటి నుండి వెళ్లిపోవాలనేది నాగ మణికంఠ ఛాయిస్. అతన్ని ఎవరు బయటకు పంపలేదు. మా నాన్న అన్ని బాధ్యతలు నెరవేర్చడాని ఆమె సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. 
 

Bigg boss telugu 8

మరోవైపు నాగ మణికంఠ కామెంట్స్ చూస్తుంటే... బిగ్ బాస్ షో ద్వారా వచ్చే ఫేమ్, డబ్బుతో కుటుంబానికి చేరువ కావాలని చుస్తున్నాడేమో అనిపిస్తుంది. అయితే నాగ మణికంఠలోని మరో యాంగిల్ లేడీ కంటెస్టెంట్స్ కి చిరాకు తెప్పిస్తుంది. 

సందర్భం ఉన్నా లేకున్నా వెళ్లి కౌగిలించుకుంటున్నాడు. నాగ మణికంఠ తనను ప్రతిసారి కౌగిలించుకోవడం పై యష్మి తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. సోనియాను పక్కకు తీసుకెళ్లి అడిగి మరీ హగ్ చేసుకున్నాడు. 
 

పెళ్ళైన నువ్వు అమ్మాయిల వెనుక ఎందుకు పడుతున్నావ్ అని నైనిక అడిగింది.  ఈ బిగ్ బాస్ హౌస్లో ఉన్నంత వరకే కదా చిల్ అయ్యేది. బయటకు వెళ్ళాక మళ్ళీ రొటీన్ లైఫ్ అన్న అర్థంలో నైనికకు సమాధానం చెప్పాడు. నాగ మణికంఠ గేమ్ జనాల్లోకి ఎలా వెళుతుందో తెలియదు కానీ... ఓట్లు బాగా పడుతున్నాయి. ప్రతిసారి ఎలిమినేషన్ లో ఉంటూ సేఫ్ అవుతున్నాడు. 

Latest Videos

click me!