అమ్మాయిల అందాన్ని ఆరాధిస్తాడు. ఉదయాన్నే మద్యం తాగుతాడు. రేలషన్స్, ఎమోషన్స్ ఆయనకు ఉండవు. దేవుడిని నమ్మడు. కాగా ఐశ్వర్య రాయ్ ని ఉద్దేశించి వర్మ గతంలో ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఆమె గర్భం దాల్చిన న్యూస్ విన్న వెంటనే ఓ మెస్సేజ్ ఆమెకు పెట్టాడట.
1994లో ప్రపంచ సుందరి కిరీటం అందుకున్న ఐశ్వర్య రాయ్ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి అద్భుతాలు చేసింది. అందానికి చిరునామాగా ఐశ్యర్య రాయ్ ని చెప్పుకునేవారు. అందానికి తోడు ఆమె గొప్ప నటి, డాన్సర్. ఈ క్వాలిటీస్ ఆమెను తిరుగులేని స్టార్ ని చేశాయి.