తాజాగా తారక్ షూస్ ను కూడా అలానే హైలెట్ చేస్తున్నారు. ఎన్టీఆర్ ఈమధ్య.. అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగాతో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేశాడు. దేవర ప్రమోషన్స్ కు ముంబయ్ వెళ్ళిన ఎన్టీఆర్.. అక్కడ ప్రముఖులను కలుస్తున్నారు. ఈక్రమంలో ఆయన సందీప్ రెడ్డిని కూడా కలిసినట్టు తెలుస్తోంది.
అయితే సందీప్ తో ఎన్టీఆర్ కలిసి మాట్లాడుతున్న ఫోటో ఒకటి బయటకు వచ్చింది. ఈ ఫొటోలో ఎన్టీఆర్ వైట్ & బ్లాక్ కాంబినేషన్లో ఉన్న స్టైలిష్ షూ వేసుకొని ఉన్నాడు. Balenciaga అనే కంపెనీ షూస్ వేసుకున్నాడు ఎన్టీఆర్. దీంతో ఈ షూస్ ఎంత ధర ఉంటాయో అని ఫ్యాన్స్, నెటిజన్స్ వెతకడం మొదలు పెట్టారు.