తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి విజయం సాధించిన నేపథ్యంలో ఎన్టీఆర్ ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఫలితాల రోజు ట్వీట్ చేయకపోవడంతో తారక్ స్పందిస్తాడా లేడా అనేది ఉత్కంఠ నెలకొంది. అయితే ఎట్టకేలకు తారక్ స్పందించాడు. చంద్రబాబు, పవన్, లోకేష్, మోడీలకు విషెస్ తెలియజేస్తూ ట్వీట్ చేశాడు.