`ఆచార్య`లో తన పాత్ర తొలగించడంపై కాజల్‌ క్రేజీ రియాక్షన్‌.. సైలెంట్‌గా దిమ్మతిరిగే కౌంటర్‌

Published : Jun 05, 2024, 10:55 PM IST

చిరంజీవి నటించిన `ఆచార్య` చిత్రంలో కాజల్‌ నటించిన విషయం తెలిసిందే. కానీ చివర్లో తొలగించారు. దానిపై కాజల్‌ రియాక్ట్ అయ్యింది. దిమ్మదిరిగే కౌంటర్‌ ఇచ్చింది.  

PREV
17
`ఆచార్య`లో తన పాత్ర తొలగించడంపై కాజల్‌ క్రేజీ రియాక్షన్‌..  సైలెంట్‌గా దిమ్మతిరిగే కౌంటర్‌

తెలుగు తెర అందాల చందమామ కాజల్‌ సెకండ్‌ ఇన్నింగ్స్ లోనూ దూసుకుపోతుంది. ఆమె యాక్షన్‌ కూడా చేస్తుంది. లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాల జోరు పెంచింది. ఓ రకంగా తనలోని 2.0ని చూపిస్తుంది కాజల్‌. ప్రస్తుతం ఆమె లేడీ ఓరియెంటెడ్‌ చిత్రం  `సత్యభామ`తో రాబోతుంది. తెలుగులో ఆమె ఇలాంటి సినిమా చేయడం మొదటి సారి. ఈ మూవీ కోసం ఎంతో శ్రమించింది కాజల్‌. ప్రమోషన్స్ పరంగానూ చాలా కష్టపడుతుంది. 
 

27

ఈ క్రమంలో ఆమె చిరంజీవితో చేసిన `ఆచార్య` సినిమాపై స్పందించింది. మెగాస్టార్‌తో `ఖైదీ నెంబర్‌ 150` మూవీ చేసి బ్లాక్‌ బస్టర్‌ అందుకుంది కాజల్. ఆ తర్వాత మరోసారి `ఆచార్య`లో జోడీ కట్టింది. ఆమె షూటింగ్‌లో కూడా పాల్గొంది. కానీ రిలీజ్‌ కి ముందు కాజల్‌ పాత్రని తొలగించినట్టు తెలిపింది యూనిట్‌. దర్శకుడు కొరటాల శివ దీనిపై క్లారిటీ ఇచ్చాడు. ఎందుకు తీసేయాల్సి వచ్చిందో తెలిపాడు. 
 

37

అయితే కాజల్‌ పాత్రని తొలగించడంపై అప్పట్లో పెద్ద హాట్ టాపిక్‌ అయ్యింది. పెద్ద వివాదం నడిచింది. కానీ కాజల్‌ ఎప్పుడూ స్పందించలేదు. చివరికి ఆ సినిమా పెద్ద డిజాస్టర్‌ కూడా అయ్యింది.  ఆ తర్వాత రకరకాల విమర్శలు వచ్చాయి. దర్శకుడు, చిరంజీవిలపై కూడా విమర్శలు వచ్చాయి. కానీ కాజల్‌ స్పందించలేదు. 
 

47

తాజాగా దీనిపై ఆమె వివరణ ఇచ్చింది. చాలా క్రేజీగా రియాక్ట్ కావడం విశేషం. `ఆచార్య`లో పాత్రని తొలగించడంపై మీ రియాక్షన్‌ ఏంటని అడగ్గా, ఇట్స్ ఓకే, జరిగేందో జరిగింది. దానికి నేనేం చేస్తాను, మీ లాగే నేను కూడా ఫీల్‌ అయ్యాను. కానీ ఏం చేస్తాం. ఆ విషయాన్ని అప్పుడే మైండ్‌ లో నుంచి డిలీట్‌ చేశాను. లైట్‌ తీసుకున్నాను. కానీ ఎందుకు తీసేశారో, ఏం జరిగిందో నిజంగా నాకు తెలియదు. తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదని భావించాను. అక్కడే ఆగిపోలేను, ముందుకెళ్లిపోతుండాలి` అని చెప్పింది కాజల్‌. పరోక్షంగా అటు దర్శకుడు, ఇటు మెగాస్టార్‌కి కౌంటర్‌ ఇచ్చింది కాజల్‌. 
 

57

`సత్యభామ` ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో మాట్లాడుతూ, ఈ విషయాన్ని వెల్లడించింది కాజల్‌.``సత్యభామ` మూవీ నా పర్సనల్ లైఫ్ తోనూ రిలేట్ చేసుకోవచ్చు. ఈ చిత్రంలో నా క్యారెక్టర్ లా ..నిజ జీవితంలో నేనూ సమాజంలో ఏదైనా జరిగితే స్పందిస్తుంటా. బయటకు వచ్చి ర్యాలీలు చేయకున్నా ఆ ఘటన గురించి ఆలోచనలు వస్తూనే ఉంటాయి. డిస్ట్రబ్ చేస్తుంటాయి. అందరిలాగే సొసైటీలో జరిగేవాటి గురించి నాకూ కొన్ని వ్యక్తిగతమైన అభిప్రాయాలు ఉంటాయి. నేను ఇప్పటివరకు ఎన్నో క్యారెక్టర్స్ చేశాను గానీ `సత్యభామ` సినిమా లాంటి ఎమోషనల్ మూవీ చేయడం ఇదే తొలిసారి. ఇందులో యాక్షన్ పార్ట్ కూడా చేశాను.
 

67

ఈ చిత్రంలో నటిస్తుంటే ఇప్పటిదాకా ఫీల్ కాని కొన్ని ఎమోషన్స్ అనుభూతిచెందాను. అవన్నీ మీకూ  రియలిస్టిక్ గా అనిపిస్తాయి. నన్ను చాలాకాలం టాలీవుడ్ చందమామ అని పిలిచేవారు. ఇప్పుడు సత్యభామ అని పిలిచినా సంతోషిస్తాను. నాకు రెండూ కావాలి. చందమామ బ్యూటిఫుల్ నేమ్, సత్యభామ పవర్ ఫుల్ నేమ్. నాకు రెండూ ఇష్టమే. ఈ కథ చెప్పినప్పుడు ఇన్ స్టంట్ గా ఓకే చెప్పాను. అంతలా నచ్చిందీ స్టోరి. గతంలో `జిల్లా` సినిమాలో పోలీస్ గెటప్ లో కనిపించా. అయితే అది సీరియస్ నెస్ ఉన్న రోల్ కాదు. సత్యభామలో మాత్రం ఎమోషన్, యాక్షన్ ఉన్న పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తా. పోలీస్ రోల్స్ గతంలో ఎంతోమంది హీరోయిన్స్ చేసి ఉంటారు. కానీ ఇది నాకు కొత్త. నా తరహాలో  పర్ ఫార్మ్ చేశాను. మీకు నచ్చుతుందనే ఆశిస్తున్నా.

77

యూత్, బెట్టింగ్ తో పాటు ఓ రిలీజియన్ గురించి సత్యభామలో కీ పాయింట్స్ ఉంటాయి. అయితే ఏ మతానికి పాజిటివ్ గా నెగిటివ్ గా ఏదీ చెప్పడం లేదు. జస్ట్ ఆ అంశం కథలో ఉంటుంది అంతే. మీరు ట్రైలర్ చూసిన దాని కంటే ఎన్నో ట్విస్ట్ లు, టర్న్స్ మూవీలో ఉంటాయి. అవన్నీ మూవీలో చూసి మీ రెస్పాన్స్ కు చెబుతారని కోరుకుంటున్నా` అని తెలిపింది కాజల్‌. సుమన్‌ చిక్కాల దర్శకత్వం వహించిన ఈ మూవీకి శశి కిరణ్‌ తిక్కా సమర్పించారు. ఈ నెల 7న `సత్యభామ` మూవీ విడుదల కానుంది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories