పూర్ణతో ఎఫైర్‌ వార్తలు అందుకే.. అసలు విషయం ఒప్పుకున్న రవిబాబు.. ఛాన్స్ ఉంటే ఇప్పుడు కూడా..

Published : Jun 05, 2024, 08:53 PM IST

హీరోయిన్‌ పూర్ణ, దర్శకుడు, నటుడు రవిబాబు మధ్య ఎఫైర్‌ ఉన్నట్టు చాలా కాలంగా వార్తలున్నాయి. తాజాగా దీనిపై రవిబాబు స్పందించారు. అసలు విషయం చెప్పేశాడు.   

PREV
16
పూర్ణతో ఎఫైర్‌ వార్తలు అందుకే.. అసలు విషయం ఒప్పుకున్న రవిబాబు.. ఛాన్స్ ఉంటే ఇప్పుడు కూడా..

ర్శకుడు, నటుడు, మల్టీటాలెంటెడ్‌ రవిబాబు సెలక్టీవ్‌గా సినిమాలు చేస్తుంటాడు. ఆయన నటుడిగా చాలా సెలక్టీవ్‌గా కనిపిస్తుంటాడు. అదే సమయంలో దర్శకుడిగా సినిమాలు కూడా అంతే సెలక్టీవ్‌గా చేస్తుంటాడు. అయితే చాలా కాలంగా రవిబాబుకి సంబంధించిన ఓ రూమర్‌ వైరల్‌ అవుతూనే ఉంటుంది. సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంటుంది. 
 

26

అదే నటి పూర్ణతో ఎఫైర్‌ రూమర్‌. రవిబాబు, పూర్ణల మధ్య ఎఫైర్‌ ఉందని, డేటింగ్‌ లో ఉన్నారనే వార్తలు వినిపించాయి. పూర్ణ పెళ్లికి ముందు ఈ పుకార్లు బాగా వైరల్‌ అయ్యేయి. అందుకే ఆయన ఆమెతో వరుసగా సినిమాలు చేస్తున్నారనే కామెంట్స్ వినిపించాయి. దీనిపై అడపాదడపా స్పందిస్తూనే ఉన్నారు. కానీ ఇప్పుడు అసలు విషయం చెప్పాడు. ఎందుకు ఈ వార్తలు వచ్చాయో, ఎఫైర్‌ వెనుక కథేంటో తెలిపారు రవిబాబు. 
 

36

పూర్ణతో వరుసగా సినిమాలు చేయడం వల్లే ఇలాంటి రూమర్ వచ్చాయని వెల్లడించారు. బ్యాక్‌ టూ బ్యాక్‌ సినిమాలు చేయడం వల్లే తమ మధ్య ఏదో ఉందనే రూమర్‌ క్రియేట్‌ అయ్యిందని, దాన్నే మీడియా పదే పదే స్ప్రెడ్‌ చేస్తుందని తెలిపారు రవిబాబు. అయితే తాను మాత్రం సినిమా కథకి, పాత్రకి ఏం డిమాండ్‌ చేస్తే అదే తీసుకుంటానని, `అవును` సినిమాలో ఆ పాత్రకి ఆమె అయితే సెట్‌ అవుతుందని భావించి సెలక్ట్ చేసుకున్నానని తెలిపారు. ఆమె అంతటి హార్డ్ వర్కర్‌ అని, ఆమె పనితనం నచ్చి వరుసగా పనిచేసినట్టు తెలిపారు రవిబాబు. 
 

46

ఇప్పుడు తాను `రష్‌` అనే సినిమా చేస్తున్నారు. ఈ మూవీ ప్రమోషన్‌లో భాగంగా జర్నలిస్ట్ జాఫర్‌తో ముచ్చటించాడు. ఈ సందర్భంగా పూర్ణతో ఎఫైర్‌పై రియాక్ట్ అయ్యాడు. `పాపం మీడియావాళ్లు ఆ అమ్మాయితో లింక్ చేశారు. ఆమె ఎక్కడో కేరళాలో ఉంటుంది. ఈ లింక్‌ ఎందుకంటే ఆమెతో నేను ఎక్కువగా సినిమాలు చేయడం వల్లే` అని తెలిపారు రవిబాబు. నా వరకు నా సినిమాల్లో ఆ పాత్రకి నటుడు, నటి సరిపోతారా లేదా అనేదే చూస్తాను, వేరేది ఏది పట్టించుకోను. `సోగ్గాడు` సినిమాలో తరుణ్‌ తండ్రి పాత్రకి మా నాన్న చలపతిరావుని తీసుకుంటే బెటర్‌ అన్నారు. కానీ ఆయన సూట్‌ కాడని కోట శ్రీనివాసరావుని తీసుకున్నాను. 
 

56

అలాగే పూర్ణ విషయంలో కూడా, నేను ఆల్వేస్ ఆ పాత్రకి ఆమె సూట్‌ అవుతుందా లేదా అనేదాన్ని బట్టే ఎంపిక చేశాను. నేను ఎప్పుడు ఆమెకి క్యారెక్టర్‌ ఇచ్చినా 100శాతం జస్టీస్‌ చేస్తుంది. టెర్రిఫిక్‌ పర్ఫెర్మర్‌. వన్‌ మోర్‌ అడగడానికి నేనే భయపడతాను. అంతటి డెడికేషన్‌తో, కాన్‌సన్‌ట్రేషన్‌తో షాట్‌ ఇస్తుంది. అందుకే ఆమెని అన్ని సార్లు తీసుకున్నాను. అంతేకానీ బయట ప్రచారం చేస్తున్నందుకు కాదు` అని స్పష్టం చేశాడు రవిబాబు. ఆమెకి ఫైట్‌ చేయడం వస్తే `రష్‌` సినిమాలో ఆమెనే పెట్టేవాడిని. ఆమె మంచి డాన్సర్‌, కానీ ఫైట్లు చేయలేదని తెలిపారు రవిబాబు. 
 

66

రవిబాబు దర్శకత్వంలో మూడు సినిమాలు చేసింది పూర్ణ. `అవును`, `అవును 2`తోపాటు `లడ్డుబాబు` చిత్రాల్లో నటించింది. ఈ క్రమంలో పూర్ణతో ఎఫైర్‌ ఉంది కాబట్టే వరుసగా ఆమెని రిపీట్‌ చేస్తున్నారని, ఆమెపై క్రష్‌ కారణంగానే ఇది జరుగుతుందనే రూమర్లు వచ్చిన విషయం తెలిసిందే. రెండేళ్ల క్రితం పూర్ణ పెళ్లి చేసుకుంది. దుబాయ్‌లో వ్యాపారం చేస్తున్న బిజినెస్‌ మ్యాన్‌ని ఆమె పెళ్లి చేసుకోవడం విశేషం. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories